అక్బర్ ఆస్థాన కవులలో బీర్బల్ ఒకడు. అక్బర్ బీర్బల్ అంటే ఎంత ప్రేమ, గౌరవం.బీర్బల్ లేని తన రాజమహల్ ను అక్బర్ ఊహించడానికి కూడా బాధపడేవాడు. బీర్బల్ అక్బర్ ను రాజులాకాక తన సొంత స్నేహితుడిలా భావించేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. అక్బర్ తన రాజ్యంలో అమలులో వున్న పన్నులను పెంచాలను ఆస్థానంలోని పెద్దలందర సమక్షంలో చర్చ జరిపాడు. అలా చేయడం వల్ల రాజ్యంలో బీదవారికి సరిగ్గా తిండి దొరకదని , బీర్బల్ రాజుకు విరుద్ధంగా వాదించసాగాడు. ఆ వాదనతో కోపం పట్టలేక అక్బర్ ఈ రాజధిక్కారిని ఇతనికి వచ్చిన చెట్టుకు ఉరి తీసిరండి. అని ఇద్దరు భటులను ఆజ్ఞాపించాడు. రాజ భటులు బీర్బల్ ను తీసుకొని అడవికి బయల్దేరారు. బీర్బల్ అడవిలో చెట్లను చూస్తూ ఇందులో ఒకటీ నాకు నచ్చిన చెట్టుకాదు. అని అడవి మొత్తం చెట్లు చుట్టూ నెల రోజులు తిప్పించాడు. భటులు మరి మీ స్వంత గ్రామంలో ఆ చెట్టును వెదుకుదాం. అన్నారు. బీర్బల్ సరే అన్నాడు. బీర్బల్ స్వగ్రామానికి చేరేసరికి మరో నెల రోజులు పట్టాయి. అక్కడ కూడా బీర్బల్ నాకిష్టం అయిన చెట్టు ఇక్కడ కూడా లేదు అన్నాడు. భటులు ఇక కోపం ఆపుకోలేక బీర్బల్ ను తిరిగి రాజుగారి దగ్గరకేతీసుకెళ్ళారు. అక్కర్ అప్పుడు బీర్బల్ తో ఏంమైంది.... అన్నాడు. అప్పుడు బీర్బల్ జహపనా వెధవది నాకు ఓ చెట్టంటే ఇష్టం ఆ చెట్టు దొరకలేదు. దాని విత్తనాలు తెచ్చాను. మీరు అనుమతిస్తే ఆ విత్తనాలు నాటి అది మొక్కయి, చెట్టైన తర్వాత దానికే నన్ను ఉరి తీయండి అన్నాడు. అక్బర్ వెంటనే బీర్బల్ యుక్తికి నవ్వి, నువ్వు గడుసరివేనయ్యా... నిన్ను నేనెందుకు ఉరి తీయిస్తాను. నువ్వులేని రెండు నెలలు నాకేమీ తోచలేదు. నన్ను క్షమించు అన్నాడు అలా తన తప్పును సరిదిద్దుకున్నాడు అక్బర్.