వినికిడి లోపం కలవారి ప్రత్యేక విద్యలో ముఖ్య వివాదాలు ఒక వ్యక్తి దగ్గు మరియు జలుబుతో బాధపడుతున్నప్పుడు అనేక మంది అనేక సలహాలు ఇస్తారు. ప్రజలు హోమియోపతి లేదా ఆయుర్వేద ఔషధం లేదా ఇతరత్రా ఔషద ప్రయోగాల ఉపయోగంపై వాదించుకోవచ్చు. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రజలు వాదిస్తున్నారని కాదు జీవితంలోని సమస్యలు చాలా సంక్లిష్టం. ప్రజలు ఈ సమస్యలను పరిష్కరించడానికి వివిధ పద్ధతులు వాడతారు. ఇది వివిధ వివాదాలకు దారితీస్తుంది. ఎవరైనా ఒక ప్రత్యేక వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటి వివాదాలను ఎదుర్కోవలసి ఉంటుంది. వినికిడి లోపం కల పిల్లలకు ఇచ్చే ప్రత్యేక విద్య కూడా ఇలాంటి వివాదాలలో ఉంది. మేము తరచుగా తల్లిదండ్రులు, నిపుణులు, మీడియా మరియు విధాన నిర్ణేతల ద్వారా అనేక వివాదాలపై చర్చించాము. ప్రస్తుతం, ఈ వివాదాలోని రెండింటిని చర్చిద్దాం: మీరు మరిన్ని వివరాల కోసం తగిన ఎంపికలను క్లిక్కు చెయ్యండి. ఇంటిగ్రేటెడ్ మరియు సెగ్రిగేటెడ్ పాఠశాల చదువు ఓరల్ మరియు చేతి పద్ధతి. ఇంటిగ్రేటెడ్ మరియు సెగ్రిగేటెడ్ పాఠశాల చదువు మనం రెండు పదాలు అర్థం తెలుసుకొని మొదలు పెడదాం. సెగ్రిగేటేడు విద్య ముఖ్యంగా వినికిడి లోపాలు కల విద్యార్థుల అవసరాలకు కోసం రూపొందించిన ప్రత్యేక పాఠశాల విద్య. ఇది నిపుణులైన వ్యక్తులు మరియు ప్రత్యేక మౌలిక సదుపాయాలు కలిగి ఉంటుంది. అలాంటి పాఠశాలలు శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక బోధనా పద్ధతులు, ఉపకరణాలు మరియు పరికరాలు ఉపయోగిస్తాయి. అలాంటి పాఠశాలలు వినికిడి లోపాలు కలవారి అవసరాలను అనుసరించి ధ్వని మరియు నిర్మాణ నమూనాలను కలిగి ఉంటాయి. మరోవైపు ఇంటిగ్రేటెడ్ విద్య సమస్యలు లేని పిల్లలు చదివే పాఠశాలలో వినికిడి లోపాలు కల పిల్లలను చదివిస్తారు, వీటిని 'సాధారణ పాఠశాల’లుగా పిలుస్తారు. వివాదం సాధారణంగా వినికిడి లోపాలు పిల్లలకు ఏది ఉత్తమమైనది అనే దాని చట్టూ తిరుగుతుంది. దురదృష్టవశాత్తు, ఏది ఉత్తమం మరియు ఏది కాదు అనేదానికి మాదగ్గర సమాధానాలు సిద్ధంగాలేవు. అయితే, మేము కింద కొన్ని విషయాలను మీరు సొంత అభిప్రాయాలు ఏర్పరుచుకొనేందుకు సహాయం చేస్తుందనే దృష్టితో ఇస్తున్నాము. వివిధ విద్యా కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి (మీరు 'ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు'ను మరిన్ని వివరాలకు చూడవచ్చు) . విద్యా కార్యక్రమాలు అనేక విధాలుగా మారుతూ ఉంటాయి. ఇంటిగ్రేషను మొత్తం మరియు సెగ్రిగేషను మార్గాలలో ఒకటి. అన్ని రకాల కార్యక్రమాలు భారతదేశంలో అందుబాటులో లేవు. ప్రత్యేక పాఠశాలు మరియు వనరులు లేని ఇంటిగ్రేటెడు విద్య భారతదేశంలో చాలా సాధారణం. వనరుల యూనిటులో విద్య కొన్ని ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వనరులు లేకుండా విద్యలో విజయం పూర్తిగా తల్లిదండ్రుల ప్రేరణ మరియు సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేక పాఠశాలలో కొన్ని లాభాలు ఉన్నాయని పరిశోధనలు తెలిపినప్పటికి (మంచి ఆత్మ గౌరవం, విశ్వాసం మరియు సామాజిక సర్దుబాటు కలిగిన పిల్లలలో) వనరులతో ఉన్న వాటిలో చదువటం మాటలు మరియు భాష అభివృద్ధికి మంచి ఎంపికగా భావిస్తారు. ప్రభుత్వం కూడా పెద్దఎత్తున విద్యా అనుసంధానాన్ని ప్రోత్సహించడం భారతదేశం లో సామాజిక-ఆర్థిక, మౌలిక సదుపాయాల పరిస్థితులకు అద్దం పడుతుంది. పాఠశాల ఎంపిక రెండు విషయాలు ప్రకారం ఉంటుంది-పిల్లల అవసరాలు మరియు విద్యా కార్యక్రమాల లభ్యత. పాఠశాల ఎంచుకోవడంలో నిర్ణయాన్ని నిపుణుల సహాయంతో తలిదండ్రులు తీసుకోవాలి. ఒక ప్రత్యేక విధానాన్ని జీవితాంతం ఎంచుకోవలసిన అవసరం లేదు. మౌలిక విద్యకోసం ప్రత్యేక పాఠశాలకు వెళ్లి, చాలా సులభంగా ఇంటిగ్రేటెడ్ చదువులకు పిల్లలు వెళతారు. ప్రత్యేక పాఠశాలలు చాలా మంది విద్యార్థులను ఇంటిగ్రేటు చేయడానికి పూనుకుంటున్నాయి. మరోవైపు ప్రారంభంలో ఇంటిగ్రేటులో చదివి తర్వాత ప్రత్యేక పాఠశాలకు మారవచ్చు. ఏ పాఠశాలను తల్లిదండ్రులు ఎంచుకొన్నా కొన్ని విషయాల గురించి జాగ్రత్త వహించాలి. ప్రత్యేక పాఠశాలను ఎంచుకుంటే వృత్తిపరమైన శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారో లేదో తనిఖీ చేయండి మరియు పాఠశాల తగిన ఉపకరణాలను కలిగి ఉందో లేదో తెలుసుకొండి. వివిధ రకాల లోపాలు ఉన్న పిల్లలను ఒకే తరగతిలో కలిపి ఉంచకుండా చూడటం మంచిది. ఇంటిగ్రేటెడు వ్యవస్థను ఎంచుకొంటే అప్పుడు పాఠశాలలో వనరుల యూనిటు ఉన్నదో లేదో తెలుసుకొండి. సమీపంలో అలాంటి పాఠశాల ఉండటం అదృష్టం అనుకోవాలి. ఒకవేళ అలాంటి పాఠశాల లేకపోతే, అప్పుడు దగ్గరలోని పాఠశాల ఎక్కడైతే అధికారులు మరియు ఉపాధ్యాయులు సానుకూల విద్యా అనుసంధాలనికి ప్రయత్నిస్తారో అక్కడ పిల్లలను చేర్చాలి. లోపాలు ఉన్న పిల్ల/పిల్లలు కల తరగతిలో శిక్షణ లేని ఉపాధ్యాయుల కోసం AYJNIHH వద్ద అందుబాటులో కొంత విద్యా సామాగ్రి లభిస్తుంది. అనేక రాష్ట్రాల్లో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఫర్ డిసేబులు పథకం కింద ఉపాధ్యాయులు మరియు పాఠశాల అధికారుల కోసం పునశ్చరణ మరియు శిక్షణ అందింస్తున్నాయి. వికలాంగుల చట్టం (సమాన అవకాశాలు, హక్కుల రక్షణ మరియు పూర్తి భగస్వామ్యం, 1995) వినికిడి లోపాలు కల పిల్లలకు వారు మిగితా వారితో సమానం అవ్వడానికి వివిధ రాయితీలు మరియు సౌకర్యాలు అందించింది. మరికొన్ని రాయితీలు మరియు సౌకర్యాల వివరాలు మీరు చూడవచ్చు ముగించడానికి, ఇంటిగ్రేటెడ్ మరియు సెగ్రిగేటెడు వ్వనస్థలు రెండూ వివిధ రకాల సమస్యలు కల పిల్లలను క్లినికల్, నాన్ క్లినికల్ నేపథ్యం ప్రకారం వ్వవహరించాలి. విద్య ప్రతి పిల్లలకు అవసరము దీనికి వినికిడి లోపాలకల పిల్లలకు మినహాయింపు లేదు. ఏరకమైనా విద్యా పద్ధతి అయినా, సజావుగా పూర్తవ్వాలి‑ అది పిల్లలను పూర్తిగా అభివృద్ధి చేసేదిగా ఉండాలి మరియు సామాజికంగా వారు సఫలం అవ్వాలి. ఏది ఏపిల్లవాడికి పనికొస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అందువల్ల మేము వివాదానికి ఇంటిగ్రేటెడ్ వర్సస్ సెగ్రిగేటెడు అని కాకుండా ఇంటిగ్రేటెడ్ మరియు సెగ్రిగేటెడు విద్య అని పెరుపెట్టాము. మౌఖిక మరియు చేతి కమ్యూనికేషను సాధారణ పిల్లలు మరియు వినికిడి సమస్యలు గల పిల్లలు స్వయంచాలకంగా వేగంగా మరియు చాలా ప్రారంభ జీవితం లో సంభాషణ మరియు భాష నేర్చుకుంటారు. వినికిడి లోపాల పిల్లల భాషాభివృద్ధి అంత సులభం కాదు. వినికిడి సామర్ధ్యం నేరుగా మాటలతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి, వినికిడి సమస్యలు గల పిల్లలలో అనివార్యంగా మాట్లాడటంలో సమస్యలకు వస్తాయి. వినికిడి లోపాల పిల్లలకు మాట్లాడటానికి అవసరమైన అవయవాలలో లోపాలు లేనప్పటికి , అతడు/ఆమె స్వయంచాలకంగా మాటలు మరియు భాషా నైపుణ్యాలను పొందేందుకు వీలుకాదు. ఈ కారణంగా, వీరిని చెవిటి మూగ అంటారు కాని వారు మూగ వారు కాదు –వారు వారి తలిదండ్రులు మరియు నిపుణుల ద్వారా భాషను నేర్చుకో గలరు. కానీ, సమస్య యొక్క స్వాభావం కారణంగా, వినికిడి లోపాలు (పుట్టినప్పటి నుండి, రెండు చెవులు వినపడని వారలో) ఉన్న వారికి పూర్తిగా స్థాయిలో ప్రయత్నించకపోతే మాటలు మరియు భాష రావటం సాద్యం కాదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వివిధ పండితులు భిన్నంగా ఈ సమస్యపై దాడికి ప్రయత్నించారు. అందువల్లే ఈ – మౌకిక వర్సస్ చేతి కమ్యూనికేషన్ వివాదం. కొందరు పండితులు మాటలు అభివృద్ధి చేయవచ్చు కనక అభివృద్ధి చేయాలని అంటారు. పిల్లలకు మాటలు నేర్పాలంటే దానికి చాలా రకాలుగా పరిస్థితులు అనుకూలించాలి. అంటే మొదటి సంవత్సరం వయస్సు లేదా ఆరు నెలల వయసు అప్పుడే లోపాన్ని గుర్తించి వెటనే చెవికి యంత్రాలను అమర్చి నిపుణులు మరియు తల్లిదండ్రులు వెంటనే కఠినమైన శిక్షణను ప్రారంభించాలి. కొందరు పండితులు మాటలు కాకుండా సంకేత భాష అభివృద్ధికి ప్రయత్నించటం మంచిదని నమ్ముతారు. వారి ప్రకారం భాష మాటల కంటే ముఖ్యం. వినికిడి లోపం ఉన్న వ్యక్తి సంభాషణలు లేకుండా పూర్తిగా మరియు బాగా పని చేయవచ్చు. సంకేత భాష ఇతర భాష (సంజ్ఞలు సేకరణ మాత్రమే కాదు) వంటిదే – హిందీ, ఇంగ్లీష్ లేదా మరాఠీ భాష వాటి స్వంత వ్యాకరణం కలిగి ఉంటాయి. మాట్లాడటానికి బదులుగా చేతులను (శరీర కదలిక - చేతి కదలిక) ఉపయోగిస్తారు. ఈ వివాదం గురించిన కొన్ని ప్రాథమిక నిజాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి: భారతదేశంలో దాదాపు అన్ని పాఠశాలలు మౌఖిక పద్ధతిపై నమ్మకం కలిగి ఉన్నాయి, వినికిడి లోపం ఉన్నవారిగి మాటలు నేర్పడానికి ప్రయత్నిస్తారు. మాటలే కమ్యూనికేషన్ యొక్క ప్రాధమిక వ్యవస్థ అని భావిస్తారు. మౌఖిక పద్ధతి విజయానికి చాలా షరతులు ఉంటాయి కాబట్టి దానిని పూర్తిచేయటం చాలా సమయాలలో వీలు కాదు. కాబట్టి ఈ పద్ధతి భారతదేశంలో బాగా విజయం సాధించలేదు. భారతదేశంలో చాలా తక్కువ ప్రయోగాలు కమ్యూనికేషన్ పద్ధతి క్షేత్రంలో జరిగాయి. ఒకటి లేదా రెండు పాఠశాలలు మాత్రమే సంకేత పద్ధతిని ఉపయోగించటానికి ప్రయత్నించాయి. అందువలన, ఏ పద్ధతి బాగా పని చేస్తుందో చెప్పటం సాధ్యం కాదు. చెతి పద్ధతిలో కూడా, సంకేత భాషా మరియు సాంకేతాల పద్ధతులలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. భారతదేశంలో సాధారణ నిపుణులు, తల్లిదండ్రులు మరియు వినికిడి లోపం ఉన్నవారు చేతి పద్ధతి కంటే మౌఖిక పద్ధతిని కోరుకుంటారు. ఏ దేశంలో నైనా వివిధ వైద్య మరియు ఇతర నేపధ్యం గల విద్యార్ధుల విద్యావసరాలకు అత్యుత్తమంగా ఉపయోగపడే విధంగా ఈ రెండు విద్యా పద్ధతులు ఉండాలి. మూలం: ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్