భాష మరియు మాటలు నేర్చుకోవడానికి మద్దతు వినికిడి లోపం వలన భాష మరియు మాటలు చాలా ప్రభావితం అవుతాయి. ప్రాథమిక కమ్యూనికేషను కోసం భాషాభివృద్ధి ఎంతో కీలకం. ఇది పిల్లల సంపూర్ణ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన అంశం. ఏది నేర్చుకోవాలన్నా ఇది ముఖ్యం, క్రమబద్ధమైన విద్యా కోణాల్లో మాత్రమే కాకుండా పిల్లల మానసిక స్థితి మరియు సామాజిక సంబంధాలలో అభివృద్ధికి ఇది ఆధారం. ఇప్పుడు 'పిల్లలకు భాష అభివృద్ధి ఎలా చేయాలి మరియు వాళ్ళకు నేర్పించడం ఎలా' అనేవి ప్రశ్నలు. వినికిడి లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులు ఇతర పిల్లలతో మాట్లాడినట్టు గానే వారి పిల్లలతో సహజంగా మాట్లాడ వలసి ఉంటుంది. వారు గుర్తుంచుకోవలసినవి వినికిడి పరికరాలు పిల్లలు ఉపయోగించేలా చూడాలి. వినికిడి పరికరాలు సరిగా పనిచేస్తున్నాయో లేదో చూడాలి. పిల్లలు మిమ్మల్ని చూసే లాగా ఉంచి వారితో అత్యంత సహజంగా కొంచెం నెమ్మదిగా మాట్లాడాలి. ఉద్దేశ పూర్వకంగానే వారి చుట్టూ ఉన్న వస్తువులపై లేబుల్ ఉంచాలి. చూట్టూ జరుగుతున్న అన్ని సంఘటనలు మరియు కార్యకలాపాల గురించి వారితో మాట్లాడాలి. వినికిడి లోపాలు ఉన్న పిల్లలకు భాషను నేర్పించడానికి రోజంతా పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. ఇవి: నిద్ర లేచినప్పుడు, కడిగే టప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, బట్టలు వేసుకొనే టప్పుడు, బట్టలు విడిచేటప్పుడు, వంట సమయంలో, భోజన సమయంలో, మార్కెటుకు తోటకు లేదా జూకు వెళ్లినప్పుడు, మిత్రులను కలిసినప్పుడు, ఆడకునే టప్పుడు, పడుకొనే టప్పుడు. ఇలాంటి సమయాలలో ఉపయోగించిన మాటలకు నిజమైన అర్ధాలు కలిగి ఉంటాయి. తల్లిదండ్రులు వినికిడి లోపాల పిల్లల పదజాలాన్ని, అర్ధవంతమైన భాషా నిర్మాణాలను మరియు సమాచార నైపుణ్యాల పెంచడానికి సహాయం చేయవచ్చు. బొమ్మలు మరియు పుస్తకాలు పిల్లలకు అత్యంత ఆసక్తికరమైన విషయాలు. వీటిని ఉపయోగించి సంభాషణ మొదలు పెట్టి సంజ్ఞలను ఉపయోగించి భాషను నేర్పడానికి ప్రయత్నించాలి. ఇతర సహాయపడే చర్యలు ఈ చర్యలు నిరంతరం ఇంటి చుట్టూ జరుగుతుంటాయి కావున తల్లిదండ్రులు క్రింది వాటికి సరైన ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంటుంది: పిల్లల విద్యా కార్యక్రమాన్ని రూపొందించటానికి ప్రత్యేక ఉపాధ్యాయుల సహాయం తీసుకోండి. ఇంటిగ్రేటెడ్ (సాధారణ పాఠశాల) లేదా సెగ్రిగేటెడ్ (ప్రత్యేక పాఠశాల) పాఠశాలను పిల్లల సామర్థ్యాన్ని మరియు విజయాలను బట్టి ఎంచుకొండి. అతని/ఆమె రోజువారి పాఠాలలో భాగంగా ఉండండి మరియు వినటం, మాట్లాడటం మరియు పఠన నైపుణ్యాలను పెంచేందుకు ప్రయత్నించండి. తరగతిలో బోధన గురించి తెలుసుకోవడానికి పాఠశాల ఉపాధ్యాయులను సాధ్యమైనన్ని సార్లు కలవండి. భాష నేర్పించడానికి తరగతిలో ఉపాధ్యాయులు ఉపయోగించిన పద్ధతులు ఇంట్లో అనుసరించండి. మీ ప్రశ్నలు మరియు సందేహాల గురించి ఉపాధ్యాయులతో చర్చించండి. కుటుంబంలోని సంతోషకర రోజులు అంటే వేడుకలు, విహారయాత్రలు లాంటివి తరగతి వరకు తీసుకొచ్చేందుకు తరగతిలో చర్చించండి. అతని/ఆమె విజయాలప్పుడు అలాగే అపజయాలప్పుడు పిల్లల వెంట ఉండండి. గురువు మరియు ఫెసిలిటేటరులాగా ఉండండి. పిల్లలు స్వతంత్ర మరియు తగినంత స్వతహాగా ఉండేందుకు తోడ్పడండి. అతనికి/ఆమె చుట్టూ ప్రతి ఒక్కరిని కలిసేలా పిల్లలను ప్రోత్సహించండి. మంచి విలువలు మరియు నైతికతను పిల్లలలో అభివృద్ధి చేయండి. పిల్లలు స్వేచ్చగా తమ ఉనికిని చాటుకునేందుకు వీలు కల్పించండి మరియు అన్ని కుటుంబం చర్చల్లో వారిని కలపండి. మీ పిల్లల విద్య లో సమాన భాగస్వాములుగా పాల్గొనండి. మూలం: ఆలీ యావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హియరింగ్ హ్యాండిక్యాప్డ్