అందరికీ విద్య అందించాలనేది భారత ప్రభుత్వ దృఢ సంకల్పం. ఐతే మొత్తం ఆసియాలోకే అతి తక్కువ మహిళా అక్షరాస్యత భారత దేశంలోనే ఉంది. 1991లో 33 కోట్లలో 7 ఏళ్ల వయస్సుపైబడినమహిళా జనాభాలో దాదాపు 40శాతంకన్నా తక్కువమంది అక్షరాస్యులు. అంటే, నేటికి ఇండియాలో కనీసం 20 కోట్ల స్త్రీలు నిరక్షరాస్యులన్నమాట. ఈ అతి తక్కువ అక్షరాస్యత స్థాయి కేవలం మహిళల జీవనంపైనే కాదు, వారి కుటుంబ జీవనంపైన కూడా వ్యతిరేక ప్రభావాన్ని చూపుతోంది. ఆ ప్రభావం దేశ ఆర్థికాభివృద్ధి మీదా పడుతోంది. అనేక అధ్యయనాలనుబట్టి తెలిసినది ఏమిటంటే, నిరక్షరాస్యులైన మహిళలలోనే ప్రసవ సమయాల్లో చనిపోయే అవకాశాలెక్కువగా, పోషకాహారం తక్కువగా ఉండటం జరుగుతోంది. పైగా వారికి తక్కువ సంపాదనావకాశాలు, ఇంట్లో తక్కువ స్వాతంత్ర్యం ఉండటం జరుగుతోంది. దీనివల్ల ఆ మహిళల ఆరోగ్యం పైనే కాక వారి పిల్లల ఆరోగ్యంపైన కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ఉదాహరణకి, ఇటీవల భారతదేశంలో జరిపిన ఒక సర్వేలో పసికందులు మరణించే రేటు తల్లి అక్షరాస్యత స్థాయికీ సంబంధం ఉందని తేలింది. అదనంగా చెప్పొచ్చే మరో విషయం ఏమిటంటే, నిరక్షరాస్య జనాభావల్ల దేశ ఆర్థికాభివృద్ధి కూడా కుంటుపడుతుంది. బాలికలకు మరియు స్త్రిలకు సంపూర్ణ విద్యను కల్పించడం అనేది భారత ప్రభుత్వ కార్యాచరణ విధానాల రూపకల్పన లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కొత్త శహస్రాబ్దిలో పిల్లలందరికి ముఖ్యంగా బాలికలకు ప్రాధమిక విద్యను అందించాలనే లక్ష్యం తో భారత ప్రభుత్వం ఇంతవరకూ చేప్పట్టిన విద్యాపరమైన సంస్కరణలు సమకూర్చి వాటికి మరిన్ని వనరులను మరియు ధ్రడమైన కార్య విధానాలను ఎర్పరిచి, విద్యావంతమైన నవ భారత నిర్మాణం కోసం కృషి చేస్తుంది . కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు (KGBV) విద్యాపరంగా వెనకబడిన మండలాలలో బాలికల విద్యాభివృద్ధి కొరకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో 395 విద్యాలయాలు పనిచేస్తున్నాయి. సప్లిమెంటరీ బడ్జెట్ 2011-11 లో మరో 348 విద్యాలయాల ఏర్పాటుకు అనుమతించారు. మార్గదర్శక సూత్రాలు (కె.జి.బి.వి) క్లిష్ట ప్రాంతాలలో ప్రముఖంగా గల ఎస్.సి., ఎస్.టి., ఒ.బి.సి., మైనారిటీ వర్గాల బాలికల కోరకు ప్రాథమికోన్నత స్ధాయిలో వసతి పాఠశాలకు ఆగస్టు 2004 న భారత ప్రభుత్వంచే కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాల (కె.జి.బి.వి) పథకం ప్రారంభించబడింది. సర్వశిక్షాభియాన్ (ఎస్.ఎస్.సి), ఎలిమెంటరీ స్ధాయిలో బాలిక విద్య కొరకు జాతీయ కార్యక్రమం ( ఎన్ పి ఇ జి ఇ ఎల్ ), మహిళా సమాఖ్య (ఎమ్.ఎస్) తో మొదటి రెండు సంవత్సరాలు సామరస్యంతో ఉంటూ, ప్రత్యేకంగా నడచింది, కాని 2007 ఏప్రిల్ 1వ తేదికి సర్వశిక్షాభియాన్ లో ఒక ప్రత్యేక విభాగంగా కలిసిపోయింది. పరిధి / పథక విస్తరణ జాతీయ సగటు ( 2001 జనాభా లెక్కల ప్రకారం 46.13 శాతం) కన్నా తక్కువ గాగల గ్రామీణ మహిళా అక్షరాస్యతగల విద్యా పరంగా వెనుకబడిన బ్లాకులు (ఇబిబిలు) జాతీయ స్త్రీ పురుష అక్షరాస్యతా వ్యత్యాసం కన్నా ( 2001 జనాభా లెక్కల ప్రకారము) ఎక్కువగా ఉన్న కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాల పథకం 2004 నుండి అమలులో ఉంది. ఈ బ్లాకులలో నెలకొల్పే పాఠశాలలు మహిళా అక్షరాస్యత తక్కువగాగల గిరిజన జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు, బడిబయట అధిక సంఖ్యలో బాలికలుగల ప్రాంతం, మహిళల అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న బడిబయట ఆడ పిల్లలు అధికంగాగల ఎస్.సి., బి.సి., మైనారిటీ అధిక జనాభా గల ప్రాంతాలు మహిళా అక్షరాస్యత తక్కువగా గల పాఠశాల నెలకొల్పలేని ప్రాంతాలు మరియు పెద్ద సంఖ్యలో చెల్లా చెధూరుగా గల చిన్న ఆవాసాలు. ఏప్రిల్ 1, 2008 నుండి అర్హతగల బ్లాకులలో వర్తించబడే సవరించిన ప్రమాణాలు గ్రామీణ మహిళా అక్షరాస్యత 30 శాతం కన్నా తక్కువ గల్గి విద్యా పరంగా వెనుకబడిన 316 అదనపు బ్లాకులు మరియు జాతీయ మహిళా అక్షరాస్యత రేటు కన్నా తక్కువ గల (2001-జనాభా లెక్కల ప్రకారం 53.67 శాతం), ఎక్కువ సంఖ్యలో మైనారిటీలు గల (మైనారిటి వ్యవహారాల మంత్రిత్వశాఖ గుర్తించిన జనాభా జాబితా ప్రకారం) 94 పట్టణాలకు/నగరాలకు అదనంగా కెజిబివిలు ఇవ్వబ డ్డాయి. ఈపథకంలోనిఅంశాలుక్రిందివిధంగావున్నాయి.ఈ పథకంలోని అంశాలు క్రింది విధంగా సవరించబడిన ఆర్ధిక నిబంధనల ద్వారా 2008, ఏప్రిల్ 1 నుండి కొత్త కెజిబివిలు ఫలప్రదం కావడానికి అంగీకారమైంది. 2007 మార్చి వరకూ గల 2180 కెజిబివిలకు పునరావృత ఆర్ధిక వనరులను అనుమతించడమైనది. ఈ నిబంధనలు 2008 ఏప్రిల్ 1 తారీఖు నుండి వర్తిస్తాయి. నేపథ్యం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం అనే కొత్తపథకానికి భారత ప్రభుత్వం ఆమోదించింది. షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, అల్ప సంఖ్యాక వర్గాలలో ఆడపిల్లల శాతం అధికంగా ఉన్న వారికొరకు ఎలిమెంటరీ స్ధాయి వరకు విద్య నేర్పర్చడానికి 750 వసతి పాఠశాలలను భోజన సౌకర్యాలతో సహా ఏర్పాటు చేసింది. ఎలిమెంటరీ విద్య - అక్షరాస్యత శాఖయందు అమలులోగల సర్వశిక్షాభియాన్ (ఎస్.ఎస్.ఎ), ఎలిమెంటరీ స్ధాయి వరకు బాలికా విద్యా జాతీయ కార్యక్రమం, మహిళా సమాఖ్యల తో ఈ పథకం సమన్వయం చేస్తుంది. పరిధి - పథక విస్త్రతం 2001 జనాభా లెక్కల ప్రకారం, విద్యాస్ధాయిలో వెనుకబడిన బ్లాకులను గుర్తించారు. గ్రామీణ మహిళా అక్షరాస్యత జాతీయ సగటుతో పోలిస్తే బాల బాలికల అక్షరాస్యతా శాతంలో వ్యత్యాసం అధికంగా గల బ్లాకులను ఎంచుకున్నారు. ఈ బ్లాకులలో గిరిజన జనాభా సాంద్రత అధికంగా ఉండి, మహిళా అక్షరాస్యత తక్కువగాను లేదా బడి బయట గల ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్నచోట్ల షెడ్యూల్డు కులాలు, ఇతర వెనుకబడిన కులాలు, అల్పసంఖ్యాక వర్గాల జనాభా సాంద్రత ఎక్కువగా ఉండి, మహిళా అక్షరాస్యత తక్కువగాను, లేదా అధిక సంఖ్యలో బడిబయట బాలికలు ఉన్నచోట్ల ఈ పాఠశాలలను ఏర్పాటు చేయవచ్చును. అధిక సంఖ్యలో ఉండి చిన్నవిగా చెల్లాచెదరుగా గల ఆవాస ప్రాంతాలలో ఈ కస్తూర్బా పాఠశాలలు ఏర్పాటు చేయడానికి అర్హత ఉండదు. ఎన్.పి.ఇ.జి.ఇ .ఎల్, ఎస్.ఎస్.ఎ పథకాలకు ఏ నిబంధనలు వర్తించాయో అవే నిబంధనలు విద్యలో వెనుకబడిన బ్లాకులకు కూడ వర్తిస్తాయి. లక్ష్యం గ్రామీణ ప్రాంతాలలో ఇంకనూ లింగ అసమానతలు నిర్లక్ష్యానికి గురైన జాతులలో ఉన్నాయి. ప్రాథమికోన్నత స్ధాయిలో ప్రత్యేకంగా గమనించితే బాలబాలికల నమోదుకు, ఎలిమెంటరీ స్ధాయిలో బాలికల నమోదు బాలురతో పోలిస్తే చెప్పుకో దగ్గంత వ్యత్యాసం కన్పిస్తుంది. బడుగు వర్గాలలోగల బాలికలకు నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడమే కెజిబివి లక్ష్యం, ఈ లక్ష్యసాధన కొరకు భోజన సౌకర్యాలను కల్పిస్తూ ఎలిమెంటరీ స్ధాయి వరకు విద్య నేర్పడానికి వసతి పాఠశాలలను ఏర్పాటు చేయడం. వ్యూహాలు పదవ ప్రణాళికావధిలోగా దశలవారిగా 500 నుండి 700 వరకు వసతి పాఠశాలలను ఏర్పాటు చేయడం. రూ|| 19.05 లక్షలను పునరావృతం అయ్యే ఖర్చుగాను రూ|| 26.25 లక్షలు పునరావృతం కాని ఖర్చుగాను ప్రతి పాఠశాలకు అంచనా చేయడం. పథక ప్రారంభంలో ప్రతిపాదించబడిన పాఠశాలలను అద్దె గృహాలలోను లేదా నిర్ణయించిన ప్రాంతంలో అందుబాటులో గల ప్రభుత్వ భవనాలను వినియోగించడం. సామాజిక న్యాయం సాధికారక మంత్రిత్వం, గిరిజన సంక్షేమ మంత్రిత్వ పరిధిలోగల ఏ ఇతర పథకాలలోనూ బాలికకు ఎలిమెంటరీ స్ధాయి విద్య నందించే వసతి పాఠశాలలు లేనిచోటనే , వెనుకబడిన బ్లాకులలోనే ఈ పాఠశాలలను ఏర్పాటు చేయాలి. జిల్లా స్ధాయి ఎస్.ఎస్.ఎ అధికారులు జిల్లా స్ధాయి ప్రణాళికలలోను కెజిబివి లను ప్రారంభించడానికి వాస్తవిక రూపకల్పనలో ఇతర శాఖలు మంత్రిత్వ శాఖల సమన్వయంతో అనుమతిని పొందాలి. కెజిబివి ఎంపిక, సౌకర్యాల కొరకు గిరిజన మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న విద్యాసముదాయాల జాబితాను జతపరచాలి. కస్తూర్బా పాఠశాలల పథకానికి కావలసిన అంశాలు ఎస్.సి, ఎస్.టి, మైనారిటి వర్గాలలో ఆడపిల్లలు అధికంగా గల చోట్ల కనీసం 50 మంది బాలికలతో వసతి పాఠశాలను ఏర్పాటు చేయాలి. అర్హతగల బాలికలను బట్టి 50 కన్నా ఎక్కువ మందిని కూడ చేర్చుకోవచ్చును. అవసరమైన నమూనాలను గుర్తించి అటువంటి పాఠశాలలు జతచేయబడినవి ఐ(ఎ) నుండి ఐ(సి) వరకు. అవసరమగు భవన నిర్మాణ సౌకర్యాలను కల్పించడం, కావలసిన బోధనాభ్యస సామగ్రిని, పరికరాలను సిద్ధం చేసుకోవడం, అందుబాటులోకి తెచ్చుకోవడం. అవసరమగు బోధనా మద్ధతును తగిన విధానాలతో ఏర్పరచి మూల్యాంకనం, పర్యవేక్షణకు వినియోగించడం. వసతి పాఠశాలలకు బాలికలు వచ్చే విధంగా ఉన్ముఖీకరించడంతో బాటు వారి కుటుంబాలకు తగిన విధమైన ప్రేరణతో బాలికలను పంపించడానికి సిద్ధంచేయడం . ప్రాథమిక విద్యా స్థాయికి తీసుకు రావడంలో పదేండ్ల వయస్సు నిండిన బాలికలు,వయసులో కొద్దిగా పెద్దవారైన బాలికలపై ఒత్తిడి తేవాలి. ఈ బాలికలు బడి బయట ఉండడంతో బాటు ప్రాథమిక విద్యను పూర్తి చేయలేనివారై ఉండడం కారణంగాను, అదే విధంగా క్లిష్టప్రాంతాలలో/మారుమూల ప్రాంతాలలో (వలస జనాభా , చెల్లాచెదరు ఆవాసాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు లేకపోవడం) గల చిన్న వయస్సులోగల బాలికలను కూడ ఈ వసతి పాఠశాలలకు తీసుకురావడం చేయాలి. ప్రాథమికోన్నత స్ధాయిలో నియత పాఠశాలలకు వెళ్ళలేని కౌమారదశలోగల బాలికల పై ప్రత్యేక దృష్టిసారించాలి. లక్ష్మాత్మకంగా ఈ పథకంలో ఎస్.సి., ఎస్.టి, ఒ.బి.సి, మైనారిటి వర్గాల ప్రాధాన్యత ననుసరించి 75 శాతం వరకు నమోదు చేసుకోవాలి. మిగితా 25 శాతం కేటాయింపును దారిద్ర్యరేఖకు దిగువగల కుటుంబాల బాలికలకు అవకాశం ఇవ్వాలి. ఎక్కడ అవకాశముంటే అక్కడ లాభాపేక్షలేని సంఘాలను, పేరుగాంచిన స్వచ్ఛంద సేవాసంస్ధలను ఈ పాఠశాలలను నడపడానికి కలుపుకోవాలి. ప్రైవేటు (కార్పోరేట్) సమూహాలు కూడ ఈ పాఠశాలలను దత్తత తీసుకోవచ్చును, ప్రత్యేక మార్గదర్శక సూత్రాలను వెలువరించాలి. అమలు - పర్యవేక్షణ – మూల్యాంకనం మహిళా సమాఖ్యగల రాష్ట్రాలలో మహిళా సమాఖ్య సొసైటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం మహిళా సమాఖ్య లేనిచోట్ల సర్వశిక్షాభియాన్ ద్వారా అమలు జరపడం రాష్ట్ర సర్వశిక్షాభియాన్ సొసైటీల ద్వారా ఎస్.ఎస్.ఎ పద్ధతివలెనే నిధులు విడుదల చేయడం. పర్యవేక్షణ మూల్యాంకనం రాష్ట్ర, జిల్లా స్ధాయిలలో జరపడానికి మహిళా సమాఖ్య రాష్ట్రాలలో వనరుల కేంద్రాల ద్వారా ఎస్.ఎస్.ఎ లోగల కార్యక్రమంలో ఎలిమెంటరీ స్ధాయి వరకు బాలికల విద్య ద్వారా మండలిని ఏర్పరచి మహిళా సమాఖ్య లేని రాష్ట్రాలలో మూల్యాంకనం జరపడం. జిల్లా విద్యాశిక్షణ సంస్ధ, బ్లాకు వనరుల కేంద్రాలు, మహిళా సమాఖ్య వనరుల సముదాయాల సమన్వయంతో కస్తూర్బా పాఠశాలల్లోగల ఉపాధ్యాయులకు, సిబ్బందికి శిక్షణ నిప్పించడం. రాష్ట్ర మద్దత్తు సమూహం ఎన్.పి.ఇ.జి.ఇ.ఎల్ లో ఆమోదమైన రాష్ట్రస్ధాయి సలహా మండలి సమన్వయ కమిటి ఈ కార్యక్రమానికి దిశానిర్దేశంతో బాటు మద్దతునిస్తుంది. ఈ సమూహంలో సంబంధిత భారత ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలోగల వారు బాలికా విద్యలో నిష్ణాతులైన వ్యక్తులు విద్యావేత్తలు మొదలగువారు సభ్యులుగా ఉంటారు. పాఠశాల నమూనాకు తగిన స్ధలం ఎంపికను ఎన్.పి.ఇ.జి.ఇ.ఎల్, క్రొత్తగా ప్రతిపాదించిన పథకంలోగల జిల్లా అమలు కమిటీ సూచనల మేరకు చేయడం. జాతీయ మద్దత్తు సమూహం జాతీయ స్ధాయిలో మహిళా సమాఖ్య ఏర్పరచిన జాతీయ వనరుల సమూహం (ఎన్ .ఆర్ .జి) భావనా విషయక, సంబంధిత జాగృత కార్యక్రమాలలో వనరులను కల్పించడం. బాలికా విద్యపై భారత ప్రభుత్వ కార్యాచరణ విధాన విషయాలకు సలహాలు ఇవ్వడం. ఈ సమూహం, పరిశోధనకు, శిక్షణా సంస్ధలకు, మహిళోద్యమానికి ,విద్యావేత్తలకు, స్వచ్ఛంద సేవాసంస్ధలకు, బాలికా విద్య ఇతర అనుభవాలపై మధ్యవర్తిత్వం వహించడం. ఎన్.ఆర్.జి ఏర్పడిన తర్వాత కొద్దిమందితోనే, సంవత్సరానికి రెండు, మూడు సార్లు మాత్రమే సమావేశాలను ఏర్పరచడం జరిగింది. ఎన్.ఆర్.జి చిన్న ఉప కమిటీలను ఏర్పరచి, ప్రత్యేక వనరులను అంటే ఉపాధ్యాయులకు బాలికా విద్యపై శిక్షణ బాలికాధారిత శిక్షణాభ్యసన సామగ్రిని అభివృద్ధిపరచుట, దృశ్య శ్రవణ కార్యక్రమాల అభివృద్ధి మొదలగునవి ఏర్పరచడం. వీటి కొరకు నిష్ణాతులైన వ్యక్తులను లేదా సంబంధిత సంస్ధలలోగల అదనపు వ్యక్తులను సమన్వయం చేసుకోవడం. బోధనాపద్ధతి రాష్ట్రస్దాయి కమిటీ ఆధారంగా ఎంపిక చేసిన నమూనా పాఠశాలలో బాలికల సంఖ్యను బట్టి వసతి పాఠశాలను ఏర్పరచడం. జిల్లా కమిటీ సూచనల మేరకు చేయడం. ఈ ప్రతిపాదనలను జాతీయ స్ధాయిలోగల ప్రత్యేక విభాగానికి పంపించడం. ఇతర సంస్థలు లేదా సలహాదారుల ద్వారా ఒప్పుదల జరిగి, ఎక్కడ అవసరమో అక్కడ ఏర్పరచడానికి ఎస్.ఎస్.ఎ పథక ఆమోదసంఘం ,ఈ ప్రణాళికలను ఆమోదించడం. కె.జి.బి.వి ఆర్ధిక నిబంధనలు పదవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ఎస్.ఎస్.ఎ. మాదిరిగానే ఆర్ధిక విధానంలో 75 : 25 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్ధిక పంపిణి ఉంటుంది. తర్వాతి కాలంలో 50 : 50 నిష్పత్తిలో జరుగుతుంది. వ్యయ పంపిణి నిమిత్తం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు వ్రాతపూర్వక నిబద్దతలో ఉంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో గల సర్వశిక్షాభియాన్ పథకంలో మాదిరిగానే ఆర్ధిక విధానాలు ఉంటాయి. ఏప్రిల్ 1వ తేది, 2007 నుండి కస్తూర్బా గాంధి బాలికా విద్యాలయాలు సర్వశిక్షాభియాన్లో ఒక భాగంగా ఉండడం వలన అవే ఆర్ధిక విధానాలు వర్తిస్తాయి. ఎన్.పి.ఇ.జి.ఇ.ఎల్., ఎస్.ఎస్.ఎ. లోలాగానే అదనపు సౌలభ్యాలు ఉంటాయి. ఎస్.ఎస్.ఎ సొసైటియే కెజిబివి సమాలోచనలు చేస్తుంది. నిధుల కేటాయింపుకు తగిన విధంగా పెట్టుబడి చేయడం ఉంటుంది. ఒకే విధమైన కార్యకలాపాలు జరపకుండా చూడడం జరుగుతుంది. ఎస్.ఎస్.ఎ. రాష్ట్ర అమలు సొసైటికి నేరుగా భారత ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం తన వంతు నిధిని రాష్ట్ర అమలు సొసైటీకి విడుదల చేయడం జరుగుతుంది. మహిళా సమాఖ్య సొసైటి ఉన్నచోట్ల మహిళా సమాఖ్యకు విడుదలౌతాయి. మహిళా సమాఖ్య అమలులేని రాష్ట్రాలలో ఎస్.ఎస్.ఎ లోగల బాలికా విభాగం, ప్రస్తుతం ఎస్.ఎస్.ఎ. ఏ వ్యవహార సరళిలో అమలు ఉందో అదే విధంగా అనుసరించబడ్తుంది. కెజిబివి నిధులను వినియోగించడంలో ప్రత్యేక సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్ ను రాష్ట్ర సొసైటి ఏర్పాటు చేస్తుంది, ప్రత్యేక బడ్జిట్ విభాగం ద్వారా రాష్ట్ర ఎస్.ఎస్.ఎ సొసైటీకి సరిపడు వంతును రాష్ట్రప్రభుత్వం విడుదల చేస్తుంది. ఇదే విధంగా జిల్లా, ఉపజిల్లాలలో ప్రత్యేక ఎకౌంట్లు నిర్వహిస్తారు. జతపరచబడినవి ఐ(ఎ) ఆర్ధిక అంచనాలు - 1 (సూచనా పట్టిక 100 మంది బాలికలకు వ్యయ అంచనా) పునరావృతం కానివి : వరుస సంఖ్య విషయం : ఒక్కొక్క బడికి అంశాలవారీగా ఖర్చు (రూ|| లక్షలలో) 1 భవనాలు 20.00 2 ఫర్నీచర్/సామగ్రి/వంటగది సహా సామగ్రితో సహా 2.50 3 గ్రంధాలయ పుస్తకాలతో సహా బోధనాభ్యసన సామగ్రి 3.00 4 పడక 0.75 మొత్తం 26.25 సంవత్సరానికి పునరావృతమయ్యే ఖర్చు వరుస సంఖ్య విషయం : ఒక్కొక్క బడికి అంశాలవారీగా ఖర్చు (రూ.|| లక్షలలో 1 ప్రతి బాలిక కొరకు నెలకు 7509.00 చొప్పున 2 బాలికా విద్యార్ధికి స్టైపండ్ నెలకు 500.00 చొప్పున 3 చదవవలసిన పుస్తకాలు, స్టేషనరి, ఇతర విద్యా సామగ్రి 50.00/నెలకు 0.60 4 పరీక్ష రుసుము 0.01 5. వేతనాలు : ఒక వార్డెన్ కమ్ ఉపాధ్యాయుడు ఇద్దరు మద్దత్తు సిబ్బంది- (ఎకౌంటెంట్/అసిస్టెంట్, ప్యూన్ ,చౌకీదారు,వంటవాడు) - 6.49 ముగ్గురు పాక్షిక కాలం - ఉపాధ్యాయులు నలుగురు పూర్తి కాలపు - ఉపాధ్యాయులు 6 శిక్షణ - ప్రత్యేక నైపుణ్యాల శిక్షణ 0.40 7 విద్యుత్తు/నీటి ఖర్చులు 0.50 8 మందులకు/ఇతరాలకు రూ||50.00/విద్యార్దికి 0.75 9 చిల్లర ఖర్చులతో బాటు నిర్వహణ 0.40 10 సంసిద్దతా శిబిరాలు 0.15 11 తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశాలు/పాఠశాల కార్యక్రమాలు 0.15 మొత్తం 19.05 100 మంది బాలికలను దృష్టిలో ఉంచుకొని చేసిన అంచనా - బాలికల సంఖ్య ననుసరించి వ్యయముంటుంది. ఆర్ధిక అంచనా - 2 (సూచనా పట్టిక 2 : 50 మంది బాలికలగు ఖర్చు అంచనా ) పునరావృతంకానిని : వరుస సంఖ్య విషయం : ఒక్కొక్క బడికి అంశాల వారీగా ఖర్చు (రూ|| లక్షలలో) 1 భవనాలు 15.00 2 ఫర్నీచర్/సామగ్రి/వంటగది సామానుతో సహా సామగ్రి 2.50 3 గ్రంధాలయ పుస్తకాలతో సహా బోధనాభ్యసన సామగ్రి 3.00 4 పడక 0.75 మొత్తం 21.25 సంవత్సరానికి పునరావృతమయ్యే ఖర్చు వరుస సంఖ్య విషయం : ఒక్కొక్క బడికిఅంశాలవారీగా ఖర్చు ( రూ. లక్షల లో) 1 నెలవారిగా బాలికా నిర్వహణకగు ఖర్చు 7504.50 2 నెలకు ఒక్కొక్క బాలికకు ఇచ్చే స్టైపండ్ 500.3 3 చదవాల్సిన పుస్తకాలు, స్టేషనరీ, ఇతర విద్యా సామగ్రి 50/నెలకు 0.3 4 పరీక్ష రుసుము 0.1 5 జీతాలు 6.49 ఒక వార్డెన్ ఇద్దరు మద్దత్తు సిబ్బంది (ఎకౌంటెంట్/ఎసిస్టెంట్, ప్యూన్, చౌకీదారు ,వంటవాడు) ముగ్గురు పాక్షిక కాలం - ఉపాధ్యాయులు నలుగురు పూర్తి కాలపు ఉపాధ్యాయులు వృత్తి శిక్షణ/ప్రత్యేక నైపుణ్యాల శిక్షణ 0.3 విద్యుత్తు/నీటి ఖర్చులు మందులు/ఇతరత్రా రూ|| 750/విద్యార్దికి 0.375 చిల్లర ఖర్చుతో సహా నిర్వహణ 0.35 సంసిద్ధతా శిబిరాలు 0.1 తల్లిదండ్రుల - ఉపాధ్యాయ సమావేశం/పాఠశాల కార్యక్రమాలు 0.1 మొత్తం 12.815 (50 మంది బాలికలను దృష్టిలో ఉంచుకొని చేసిన గణనం. బాలికల సంఖ్య పెరిగితే అంచనా పెరుగుతుంది) జతపరచబడినవి ఐ(సి) ఆర్ధిక అంచనా - 3 (సూచనా పట్టిక 3 - ప్రాథమికోన్నత పాఠశాలలో గల బాలికలు) పునరావృతంకానివి : వరుస సంఖ్య విషయం : ఒక్కొక్క బడికి అంశాల వారీగా ఖర్చు (రూ|| లక్షలలో) 1 భవనాలు 15.00 2 ఫర్నీచర్/వంటగది సామగ్రితో సహా సామగ్రి 2.50 3 గ్రంధాలయ పుస్తకాలతో సహా బోధ నాభ్యసన సామగ్రి 3.00 4 పడక 0.75 మొత్తం సంవత్సరానికి పునరావృతమయ్యే ఖర్చు వరుస సంఖ్య విషయం ఒక్కొక్క బడికి అంశాల వారీగా ఖర్చు(రూ|| లక్షలలో) 1 నెలవారిగా బాలికా నిర్వహణకగు ఖర్చు 7504.50 2 నెలకు ఒక్కొక్క బాలికకు ఇచ్చే స్టైపండ్ 500.3 3 చదవాల్సిన పుస్తకాలు, స్టేషనరీ, ఇతర విద్యా సామగ్రి 50/నెలకు 0.3 4 పరీక్ష రుసుము 0.01 5 జీతాలు 3.6 ఒక వార్డెన్ ఇద్దరు మద్దత్తు సిబ్బంది (ఎకౌంటెంట్/ఎసిస్టెంట్, ప్యూన్, చౌకదారం వంటవాడు) ముగ్గురు పాక్షికాలం - ఉపాధ్యాయులు వృత్తి శిక్షణ/ప్రత్యేక నైపుణ్యాల శిక్షణ ; 0.3 విద్యుత్తు/నీటి ఖర్చులు మందులు/ఇతరత్రా రూ|| 750/విద్యార్దికి 0.375 చిల్లర ఖర్చుతో సహా నిర్వహణ 0.35 * 10 తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం/పాఠశాల కార్యక్రమాలు 0.1మొత్తం 9.925 ఆధారము: సర్వ శిక్షా అభియాన్ (www.ssa.nic.in) ఎలిమెంటరీ స్థాయి జాతీయ బాలికల విద్యా కార్యక్రమము (NPEGEL) బాలబాలికల మధ్య లింగవివక్షత, నమోదు, నిలకడలలో వ్యత్యాసాన్ని తగ్గించి, బాలికల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంపొందించడం ద్వారా సాధికారత కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగుతుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోని 23 జిల్లాల్లోని విద్యా విషయకంగా వెనుకబడిన మండలాల్లో (మహిళా అక్షరాస్యతా శాతం 45.13% కంటే తక్కువ మరియు స్త్రీ పురుష అక్షరాస్యతల మధ్య వ్యత్యాసం 21.59% కంటే ఎక్కువగా ఉన్న 5765 మోడల్ క్లస్టర్స్ పాఠశాలల్లో అమలు జరుగుతున్నది. ఇందులో భాగంగా పాఠశాలల్లో బాలికల కొరకు స్నేహపూరిత వాతారణం కల్పించడం , వృత్తి విద్యా నైపుణ్యాలను కల్పించడం, నాణ్యమైన జీవనాన్ని గడిపేందుకు కావలసిన జీవననైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుంది. NPEGEL కార్యక్రమాల నిర్వహణ కొరకు రికరింగ్ గ్రాంటు క్రింద ప్రతి సంవత్సరము ప్రతి మోడల్ క్లస్టర్ పాఠశాలకు రూ.62,700 లు విడుదల చేస్తారు. 2012 - 13 విద్యా సంవత్సరంలో 5765 క్లస్టర్లకు రూ. 3614.66 లక్షలు మంజూరైనవి. ఎలిమెంటరీ స్థాయి జాతీయ బాలికల విద్యా కార్యక్రమము (NPEGEL) పై పూర్తి వివరాలు ఈ క్రింది పి.డి.ఎఫ్. లలో అందుబాటులో ఉన్నాయి. ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమం లక్ష్యాలు ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమం మండలాల ఎంపిక క్లస్టర్ అంటే ఏమిటి, మోడల్ క్లస్టర్ పాటశాల ను ఎలా ఏర్పాటు చేస్తారు క్లస్టర్ స్థాయిలో ఈ కార్యక్రమాలను ఎవరు అమలు చేస్తారు మోడల్ క్లస్టర్ పాటశాలల ప్రధానోపాధ్యాయుల పాత్ర మోడల్ క్లస్టర్ పాటశాలలో బాలికలలు ప్రత్యేకతలు మోడల్ క్లస్టర్ పాటశాలలో చేపట్టదగిన వృత్తి విద్యా కోర్సులు ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమంలో సమాజ భాగస్వామ్యం ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమ నిర్వహణలో అధికారుల పాత్ర ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమంలో శిక్షణా కార్యక్రమాల వివరాలు ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమ ఆడిట్, పాటించవలసిన నియమాలు క్లస్టర్ పాటశాలలలో ప్రదర్శించవలసిన చార్ట్ ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమాల నియంత్రణ మరియు పర్యవేక్షణ ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యా కార్యక్రమ పాటలు ఆధారము: సర్వ శిక్షా అభియాన్