విద్యామనోవిజ్ఞానశాస్త్ర అధ్యయన పద్ధతులు:అనేక రకాలైన ప్రవర్తనలను అధ్యయనం చేయడానికి వివిధ పద్ధతులను రూపొందించడం జరిగింది. ఈ పద్ధతులను నాలుగు ముఖ్య విభాగాలుగా విభజించవచ్చు. అవి: 1. అంతఃపరీక్షణ పద్ధతి, 2. పరిశీలనా పద్ధతి, 3. ప్రయోగాత్మక పద్ధతి, 4. వ్యక్తి అధ్యయన పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతి: . అంతఃపరీక్షణ పద్ధతి ని ప్రవేసపెట్టిన శాస్త్రవేత్త సెయింట్ ఆగస్టీన్. ఇతను ఈ పద్ధతి ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించాడు. కొన్నిసార్లు మనము ప్రతిస్పందించే సమయంలో మనలో కొన్ని అనుభూతులు కలుగుతాయి వీటిని మనము పరీక్షించాడాన్ని అంతః పరీక్షనమని చెప్పవచ్చు. ఏదైనా ఉద్దీపన మన మీద ప్రభావాన్ని చూపినప్పుడు మనం ప్రతిస్పందిస్తుంటాం. మన అనుభూతి లేదా అనుభూతులను రాత పూర్వకంగా గాని లేదా నోటి ద్వారా గాని తెలియజేసినట్లయితే అంతః పరీక్షణా నివేదిక అని అంటారు. ఈ పద్దతిలో పరిశీలించే వ్యక్తి, పరిశీలింపబడే వ్యక్తి ఒక్కరే. ఊంట్ తన ప్రయోగశాలలో ఈ పద్దతుని ఉపయోగించి వ్యక్తి చేతనత్వాన్ని పరీక్షించాడు. లోపాలు: 1.వ్యక్తి నిష్టత 2.భాషా లోపాలు 3.ఉద్వేగాల మార్పులు ఉపయోగాలు: ఇతరులతో చెప్పుకోలేని మానసిక ప్రక్రియలు (ఉదా: లైగిక అనుభవం) కూడా ఈ పద్ధతి ద్వారా పరిశీలించవచ్చు. అంతః పరీక్షన ద్వారా ఒక వ్యక్తి తన లోటుపాట్లను సవరించుకుని తన మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచుకోగాలుగుతాడు. ఉపాధ్యాయుడు అంతః పరీక్షణ ద్వారా తన భోధనలోని లోపాలను తెలుసుకుని నూతన భోధనా పద్దతులను ఉపయోగించగాలుగుతాడు. 2.పరిశీలనా పద్ధతి: ప్రవర్తనను ఉన్నదున్నట్లుగా గ్రహించడమే పరిశీలనా అని చెప్పవచ్చు. ఇతరులు వ్యక్తపరిచే ప్రవర్తనను ప్రత్యక్షంగా పరిశీలించడం ఈ పద్ధతి ముఖ్యలక్షణం. అంటే ఏదో ఒక ఉద్దీపనకు ఒక వ్యక్తి ప్రతిస్పందిస్తున్నప్పుడు అతడు వ్యక్తం చేసే ప్రవర్తనను లేదా ప్రవర్తన అంశాలను పరిసీలింకాహ్డం జరుగుతుంది. పరిశీలనా పద్దతులు సాధారణం గా నాలుగు రకాలు అవి : 1.సహజ పరిశీలన. 2. నియంత్రిత పరిశీలన 3.సంచరిత పరిశీలన, 4.అసంచరిత పరిశీలన. 1. సహజ పరిశీలన: పరిశీలన అంశాలు సహజ పరిస్థితులలో జరుగుతున్నప్పుడు పరిసీలించడాన్ని ‘సహజ పరిశీలన’ అంటారు. సహజ పరిశీలనలో పరిశీలింప బడే వారికి తాము పరిశీలింప బడుతున్నామని తెలియదు, తెలియకూడదు. 2. నియంత్రిత పరిశీలన: సహజ పరిస్థితులు ఏర్పడడం చాలా అరుదు. ఈ పద్దతిలో కృత్రిమంగా పరిశీలనా సన్నివేశాలు కల్పించి, ఆయా సన్నివేశాలలో ప్రవర్తనను గమనించడం జరుగుతుంది. ఈ పరిశీలనలో తాము పరిశీలించబడుతున్నమనే విషయం ప్రయోజ్యుడికి తెలిసే ఉంటుంది. 3.సంచరిత పరిశీలన: ఈ రకమైన పరిశీలనలో పరిశీలకుడు సన్నివేశంలో తాను కూడా పాల్గొని ముందుగా నిర్ణయించుకున్న పరిశీలన అంశాలను సన్నద్దతతో నిశితంగా చూడడాన్ని సంచరిత పరిశీలన అంటారు. 4.అసంచరిత పరిశీలన: ఈ పరిశీలనలో పరిశీలకుడు సన్నివేశంలో ప్రత్యక్షం గా పాల్గొనకుండా దూరంగా ఉండి తాను ముందుగా నిర్ణయించుకున్న పరిశీలనాంశాలను వారికి తెలియకుండా పరిసీలించాదాన్ని .అసంచరిత పరిశీలన అంటారు. ముఖ్యంగా పసిపిల్లల, జంతువుల, పక్షుల ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. గెసెల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు బాలల వివిధ వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్సర్వేషన్ డోమ్ ని అమర్చాడు. లోపాలు: నియంత్రిత పరిస్థితుల వల్ల సహజత్వం కోల్పోయే అవకాసం ఉంది. ప్రమాదాలు మొదలైన వాటి విషయంలో నియంత్రిత సన్నివేశాలు కల్పించి ఫలితాలు సాధించడం సాధ్యపడదు. ఉపయోగాలు: నియంత్రిత పరిశీలనా వల్ల అరుదైన పరిస్థితులను కల్పించి కాలయాపన లేకుండా పరిశీలనంశాలను అధ్యయనం చేయవచ్చు. పరిశీలనా పద్దతిని ఉపయోగించి చిన్నపిల్లల, అసాధారణ వ్యక్తుల, జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు. పరిశీలనా పద్ధతి విద్యా ఉపయోగాలు: అసాధారణ ప్రవర్తనకు కారణాలను అన్వేషించవచ్చు. అసాధారణ శిశువులను, ప్రజ్ఞావంతులను, వెనుకబడిన వారిని, మందబుద్ధులను పరిశీలించి తగిన చర్యలను చేపట్టవచ్చు. 3. ప్రయోగాత్మక పద్ధతి: ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ప్రయోగపద్దతిని అత్యంత వస్తునిష్టత కలిగిన శాస్త్రీయ పద్దతిగా చెప్పవచ్చు. ఎవరి మానసిక లేదా ప్రవర్తనా లక్షణాలను అధ్యయనం చేయదలచామో వారిని లేదా వాటిని శాస్త్రీయంగా పరీక్షించడానికి చేసే ప్రయత్నమే ప్రయోగం అని చెప్పవచ్చు.లేదా ఏదైనా ఒక దృగ్విషయాన్ని నియంత్రిత పరిస్థితులలో అధ్యయనం చేయడాన్ని ప్రయోగం అనవచ్చు. ప్రయోగాపద్దతిలో కొన్ని పదాలు: 1.ఉద్దీపన, 2.ప్రతిస్పందన, 3.ప్రయోక్త,4.ప్రయోజ్యుడు, 5.చరాలు, 6.సమూహాలు, 7.నమూనాలు.. ఉద్దీపన: ప్రవర్తనా మార్పుకు దోహదపడేది. ప్రతిస్పందన: ఉద్దీపనకు వ్యక్తి చూపే ప్రతిచర్యే ప్రతిస్పందన. ప్రయోక్త/పరిశోధకుడు: ఎవరైతే ప్రయోగాన్ని నిర్వహిస్తున్నారో వారిని ప్రయోక్త లేదా పరిశోధకుడు అంటారు. ప్రయోజ్యుడు: ఎవరి మీద ప్రయోగం నిర్వహిస్తున్నమో వారిని ప్రయోజ్యుడు అంటారు. చరాలు: చరం అంటే మార్చడానికి వీలుగా ఉన్నది లేదా తనంతట తానే మారేది అని అర్ధం. చరాలు సాధారణం గా మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి. ఎ) స్వతంత్ర చరం, బి) పరతంత్ర చరం. సి) మధ్యస్త చరం. ఎ) స్వతంత్ర చరం: ఒక ప్రయోగం చేసేటప్పుడు ప్రయోక్త ఉద్దీపనలనుగానీ, ఉద్దేపింపజేసే పరిస్థితులను గాని తాను పరీక్షించ దలచుకున్న పద్దతిలో మలచుకోవదాన్ని స్వతంత్ర చరం అంటారు. స్వతంత్ర చరాలు ఎప్పుడూ ప్రయోక్త ఆదీనంలో ఉంటాయి. ఉద్దీపనలను స్వతంత్ర చరాలు అనవచ్చును. బి) పరతంత్ర చరం: పరిశోధకుని అదుపులో ఉన్న చరాన్ని స్వతంత్ర చరమనీ దాని ప్రభావానికి లోనయ్యే చరాన్ని పరతంత్ర చరమనీ అంటారు. స్వతంత్ర చరాలకు ప్రయోజ్యుని ప్రతిస్పందనే పరతంత్ర చరం. ఈ ప్రతిస్పందనలు స్వతంత్ర చారాల మీద ఆధారపడతాయి. అభ్యసించడంలో వేగం, ప్రతిచార్యాకాలం, ప్రయోజ్యుల అనుభవాల వివరణ మొదలైనవి కొన్ని ఉదాహరణలు. ఆధారము: విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర ఆధారాలు తెలుగు అకాడమి