అంగనవాడీలో ఒక రోజు యొక్క స్నాప్ షాట్ రోజువారీ 6 గంటల 30 నిమిషాల షెడ్యూలు మూడు బ్లాక్లుగా ఆలోచనాత్మకంగా రూపొందించబడింది. ప్రతి ఒక్కటి ఆట-ఆధారిత నిర్మాణాత్మక అభ్యాసం కోసం ప్రత్యేక ఉప-బ్లాక్ ను కలిగి ఉంది. అందులో అల్పాహారం, భోజనం మరియు విశ్రాంతి సమయం కోసం మొత్తం 160 నిమిషాల విరామం కేటాయించబడింది. బ్లాక్ 1 (స్వాగతం & స్వేచ్చా ఆటలు) మరియు బ్లాక్ 3 (ప్రతిస్పందన మరియు ముగింపు) పిల్లల నేతృత్వంలోని ఇండోర్ మరియు ఔట్డోర్ ఆటలు మరియు సర్కిల్ సమయ సంభాషణల కోసం ఉద్దేశించబడ్డాయి. ఈ బ్లాక్ లలో, సాధారణ మార్గదర్శకాల ఆధారంగా అంగన్ వాడీ కార్యకర్తలు వారి స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కృత్యాలను రూపొందించాలి. దీనికి విరుద్దంగా, ఐదు ఉప-బ్లాక్లతో కూడిన బ్లాక్ 2 (ఆడుకుంటూ నేర్చుకుందాం), తరగతి గది సంసిద్ధత, ఆట ఆధారిత సరదా కృత్యాల సముదాయంతో పూర్తిగా ప్రణాళిక చేయబడింది. ఇవి బోధన అభ్యాస సమయాన్ని సమర్ధవంతముగా ఉపయోగించటానికి మరియు పిల్లల వయస్సుకు తగిన అభివృద్ధి మైలురాళ్లు మరియు అభ్యసన లక్ష్యాలను సాధించడంలో సహాయపడటానికి రూపొందించబడ్డాయి (NCF-FS 2022లో అండర్ లైన్ చేసినట్లు). ప్రారంభ & ప్రవేశ వారాలు-1 ప్రారంభ & ప్రవేశ వారాలు-1 లో పిల్లలు ఏమి నేర్చుకుంటారు అనేది మరియు తరగతి గది సంసిద్ధత, ఆట ఆధారిత సరదా కృత్యాల వివరణ. మొదటి వారంలో చేయవలసిన కృత్యాలు ఆటలు మరియు పిల్లలను స్వయంగా చేసే కృత్యాలలో పాల్గొనేలా ప్రోత్సహించడం జరుగుతుంది. ఉదాహరణలు కృత్యం: "పెద్దమ్మతో మాటలాట ప్రక్రియ: టీచర్ ఒక పెద్దవారి పాత్రను ధరిస్తుంది (ఉదాహరణకీ: తాతయ్య లేదా పెద్దమ్మగా నటిస్తుంది). టీచర్ ముందుగా పిల్లల ముందుకు వచ్చి పెద్దవారి తరఫున హాయిగా చిన్న మాటలతో సంభాషణ ప్రారంభిస్తుంది. ఉదాహరణకి: "హాయ్ చిన్నా! నీవు ఎక్కడినుండి వచ్చావు?" "ఈరోజు నీకు ఏ ఆట ఆడాలనిపిస్తోంది?", "నీ పేరేమిటి బాబు?" ఒకో విద్యార్థిని దగ్గరకు రమ్మని పిలిచి, ఆ పిల్లవాడి సమాధానాలను ప్రోత్సహిస్తూ హాయిగా మాట్లాడుతుంది. పిల్లలు ఒకరి తర్వాత మరొకరు టీచర్ (పెద్దవారి పాత్రతో రెండు లేదా మూడు వాక్యాల హృదయపూర్వక సంభాషణ జరుపుతారు. కృత్యం: మనం కలిసి ఆడేద్దాం పిల్లలను చిన్న గుంపులుగా చేసి బంతి పాస్ చేసే ఆట ప్రారంభించాలి ఒక్కొక్కరూ తమ గుంపులోకి మరో పిల్లవాడిని ఆహ్వానించాలి. ఆటలో అవసరమైతే పెదల సహాయం కోరేలా పోత హించాలి. ఆట ముగిసిన తరువాత పిల్లల అనుభవాలపై చిన్న చర్చ జరపాలి. కృత్యం: "మా పిల్లల మిత్రులు!" తల్లిదండ్రులు తమ బిడ్డను వేదికపైకి తీసుకొచ్చి మాట్లాడేలా ప్రోత్సహించాలి - ఉదా: "ఇతని పేరు అభి, ఇతను మీతో ఆడుకుంటాడు."