ప్రారంభ & ప్రవేశ వారాలు-3 పిల్లలు ఏమి నేర్చుకుంటారు కృత్యం పేరు: "చెప్పుకుంటూ పోదాం" వివరణ: తల్లి లేదా పెద్దలు చిన్నారి చేయి పట్టుకొని ఎలా చెప్పాలి. "ఇతను నీ మిత్రుడు/మిత్రురాలు - ఆట ఆడుకుందాం అని సెంటర్ లో పిల్లలందరినీ పరిచయం చేయాలి." అనంతరం పిల్లవాడిని ఇతర పిల్లల సమూహంలో నెమ్మదిగా చేర్చాలి. ఒక చిన్న బంతి ఆట, లేదా రింగ్ ఇచ్చి ఆట మొదలు పెట్టాలి. కృత్యం : పిల్లలందరిని చిన్నచిన్న గుంపులుగా చేసి, ఒక్కో పిల్లవాడు వేరుగా నిలబడినప్పుడు, గుంపు పిల్లలు అతనిని "మా ఆటలో నీవు రావాలి.?" అంటూ ఆహ్వానించాలి. ఈ ప్రక్రియను ప్రోత్సహించేందుకు AWW సహాయం చేయాలి. కృత్యం : "బొమ్మ చూపు పదాన్ని చెప్పు " తల్లి తండ్రి చిన్నపిల్లలతో పొద్దున మనమూ లేవాలి పాడతారు. తర్వాత పిల్లలని పాడించే ప్రయత్నం చేస్తారు. పాటల తరువాత చిన్న డ్యాన్స్ లేదా యాక్షన్ చేయించాలి. పిల్లలను చిన్న మరియు పెద్ద సమూహాలుగా విభజించి, ప్రతి సమూహానికి వివిధ వస్తువుల బొమ్మలు (పండ్లు, జంతువులు, వస్త్రాలు) ఇవ్వాలి. AWW ఓక్కొక్క బొమ్మ చూపిస్తూ, దాని పేరు ఏమిటో అడగాలి. పిల్లల ప్రతిస్పందనను శ్రద్ధగా గమనించి వారి మాటల స్థాయిని పరిశీలించాలి పిల్లల అభ్యాస స్థాయిని గమనించి తగినట్టు నమోదు చేయాలి. కృత్యం : "మా మాటలు - మా ఆటలు" పిల్లలను చిన్న చిన్న సమూహాలుగా విభజించి, ఒక సాధారణ అంశం (పండ్లు, జంతువులు, కుటుంబం) ఇవ్వాలి. సమూహంలోని ప్రతి పిల్లవాడు ఆ ఆంశంపై ఒక పదం లేదా వాక్యం చెప్పాలి. AWW చురుకుగా వారి మాటలు గమనించి, మాట్లాడే ధైర్యాన్ని ప్రోత్సహించాలి. చివరిలో పిల్లల సంభాషణల తీరు, పదజాలం, సమన్వయం గురించి పరిశీలనలుగా AWW నమోదు చేసుకోవాలి. కృత్యం : "పిల్లలకి అంగన్వాడీ లో చక్కటి వాతావరణం" ను ప్రేమలో ఆహ్వానించండి. సురక్షితంగా ఉండేందుకు అవసరమైన నియమాల (క్రూరమైన చూపులు, కొత్తకొత్త వ్యక్తలు) ను సులభమైన మాటల్లో చెప్పండి. కలిసి చిన్న బొమ్మల ద్వారా ఆ నియమాలను చూపించండి (ఉదా: "నడవండి", "వినండి", "బంధువులతో సహకరించండి") AWW నియమాలు పాటించడం ఎలా ఉందో గమనించి, పిల్లలను ప్రోత్సహించండి. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ