వారం 2 పిల్లలు ఏమి నేర్చుకుంటారు తరగతి గదిలో ఎక్కడి వస్తువులు అక్కడ పెట్టి, శుభ్రంగా ఉండేటట్లు నిర్ధారించుకోవటం మరియు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించటం. ఆకారాలు, రంగులు మరియు వాటి షేడ్స్ మధ్య తేడాను గుర్తించడం. భావనలను అర్థం చేసుకొని చెప్పడానికి పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవటం, సంభాషణలలో థీమ్ నిర్దిష్ట పదాలను ఉపయోగించటం మరియు ధ్వనుల అవగాహనను అభివృద్ధి చేసుకోవటం. విభిన్న వ్యక్తులతో తమ పాత్రను గుర్తించి, వివరించడం మరియు ఇతరుల పట్ల ప్రేమను చూపడం. దృశ్య కళలు నిర్వహించడానికి కావలసిన పరికరాలను అన్వేషించి ఉపయోగించటం మరియు దృశ్య కళను రూపొందించడానికి ముద్రలు వేయడం. ధ్వనిలో నిల అధిక మరియు తక్కువ పిచ్ ల మధ్య తేడాను గుర్తించడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు విలక్షణమైన ధ్వనులు చేసే సాధారణ గృహ వస్తువులను సేకరించండి (ఉదా: తాళం చెవి, చెంచా, గంట), పిల్లవాడి కళ్లకు గంతలు కట్టి, ధ్వని ధ్వన చేసి, వాటిని ఊహించమనండి. సీసా మూతలు, స్పాంజు లేదా కత్తిరించిన కూరగాయ ముక్కలలాంటి వంట ఇంట్లో దొరికే వస్తువులను సేకరించండి. కళ నమూనాలను రూపొందించడానికి రంగులలో ముంచి, కాగితంపై ముద్రలు వేయమని పిల్లలను ప్రోత్సహించండి. రంగులను గుర్తించడంలో సహాయం చేయండి. పిల్లలను ఇరుగు పొరుగు పరిసరాలలోకి తీసుకువెళ్ళండి. జంతువులను గుర్తించడంలో సహాయపడండి, వాటి రంగు, అవి ఏమీ తింటాయి, ఏమి ధ్వనులు చేస్తాయి, ఎక్కడ నివసిస్తాయి మొదలగునవి వారితో మాట్లాడండి. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ