వారం-3 పిల్లలు ఏమి నేర్చుకుంటారు సాధారణ వస్తువులు, వ్యక్తులు, చిత్రాలు, స్థలాలు, సాధనాలను గుర్తించి, వివరించటం. సహాయం చేసిన వ్యక్తులకు కృతజ్ఞతను తెలియచేయటం. వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం, వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించడం. చిత్రాలలో తప్పిపోయిన భాగాలను గుర్తించి, మూడు స్థాయిల వరకు వస్తువులను అమర్చటం. కనిపించే కళాకృతులను చేయడానికి వివిధ వస్తువులను అన్వేషించి, ఉపయోగించటం మరియు ముద్రలను తయారుచేయటం. ఆకారాలు, రంగులు మరియు వాటి షేడ్స్ మధ్య తేడాను గుర్తించటం. భావనలను అర్థం చేసుకోవడానికి పదజాలాన్ని అభివృద్ధి చేసుకోవటం, సంభాషణలలో థీమ్-నిర్దిష్ట పదాలను ఉపయోగించటం మరియు ధ్వనుల అవగాహనను అభివృద్ధి చేసుకోవటం. వాసనలు మరియు ధ్వనుల మధ్య తేడా; సారూప్యత మరియు వ్యత్యాసాల ఆధారంగా వాటిని గుర్తించటం, వర్గీకరించటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు పిల్లలతో కలిసి ప్రకృతి సందర్శనకు వెళ్లి, కొమ్మలు, రాళ్లు, ఆకులు, పువ్వులు మొదలైన విభిన్న వస్తువులను సేకరించండి. వీటిని గుర్తించేలా పిల్లలను ప్రోత్సహించండి, రంగులలో ముంచి, కళ నమూనాలను రూపొందించడానికి కాగితంపై ముద్రలు వేయండి. రంగులను గుర్తించడంలో సహాయం చేయండి. పిల్లలను చుట్టుపక్కలకు తీసుకువెళ్ళి, వివిధ కమ్యూనిటీ సహాయకులతో సంభాషణను ప్రోత్సహించటం. వారి వృత్తి, ఉపయోగించే సాధనాలు, వారు ఇతరులకు ఎలా సహాయం చేస్తారు మరియు వారికి కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడంలో సహాయం చేయటం. పిల్లల కళ్లకు గంతలు కట్టి, వివిధ వస్తువుల రుచి మరియు వాసన చూడడానికి వారిని ప్రోత్సహించటం. వాసన యొక్క మూలాన్ని గుర్తించడంలో మరియు ఆహ్లాదకరమైన /అఇష్టమైన, బాగున్న / బాగోని, ప్రమాదకరమైన వాసనలు మొదలైన వాటిని వర్గీకరించడంలో వారికి సహాయపడటం. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ