వారం 23 పిల్లలు ఏమి నేర్చుకుంటారు రుచి మరియు ఆకృతిలో తేడాలను అన్వేషించడం, పోల్చటం & సిరియేషన్ ద్వారా వస్తువులలోని స్పర్శ లక్షణాల ద్వారా వేరు చేయటం. ప్రకృతిని గమనించడంలో ఉత్సుకత చూపడం మరియు మొక్కలు, జంతువులకు జంతువులకు చేసే చేస్తే అనవసరమైన హానిని నివారించడం. సహాయంతో తగిన సాధనాలను ఎంచుకోవడం మరియు సంభాషించడం ద్వారా సాంకేతిక వినియోగం చూపటం. పిల్లలందరినీ సమ్మిళితం చేయటం, చురుకుగా సాధన చేయటం - జెండర్ మరియు వైకల్యం. అక్షర ధ్వనులను మిళితం చేయటం ద్వారా మెరుగైన సుపరిచితమైన పదాలను రూపొందించడం. సమూహాలలో వివిధ రకాల ధ్వనులు మరియు దృశ్య కళాకృతులను రూపొందించడం. (ప్రసంగం, కదలిక మరియు ధ్వనిని సమన్వయం చేయడానికి ప్రయత్నించడం ద్వారా సహకార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం) బహుళ ఇంద్రియ కృత్యాలను అన్వేషించడం. రూపాలు, ఆకృతులను తయారు చేయడం మరియు రిథమిక్ వ్యక్తీకరణలతో ప్రయోగాలు చేయడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు వివిధ రకాల నివాసాల (గూళ్ళు, బొరియలు, గుహలు) గురించి చర్చించండి. కాగితం, కొమ్మలు లేదా చిన్న పెట్టెలను ఉపయోగించి చిన్న పక్షి గూడు నిర్మించమని మీ పిల్లలను ప్రోత్సహించండి. "పక్షులు ఎలాంటి ఇంట్లో నివసిస్తాయి?" వంటి ప్రశ్నలను అడగండి. పిల్లలతో భాష ఆటలను ప్లాన్ చేయండి. ఒక ధ్వనిని ఎంచుకుని, వంతుల వారీగా ఆ ధ్వనితో ప్రారంభమయ్యే, వీలైనన్ని విభిన్న వస్తువుల పేర్లను చెప్పండి. ఒక చిన్న కుండలో శనగ గింజలను నాటండి, వాటికి నీరు పోసి, చిన్న మొలకలు రావడం చూడండి. మొక్కల యొక్క వివిధ భాగాలు మరియు వాటి పెరుగుదల గురించి చర్చించండి. మొక్క జీవిత దశలను గమనించడానికి ప్రతిరోజూ మొలకలని పరిశీలన చేయటంలో నిమగ్నం చేయండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ