వారం - 31 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఆకృతి, ఆకారం, ఉష్ణోగ్రత, రంగు, పరిమాణం, బరువు మొదలైన వాటి ఆధారంగా వస్తువులను పోల్చటం, వస్తువులు మరియు సంఘటనలను తార్కిక క్రమంలో (logical sequence) ఉంచటం. భద్రత, సాధారణ నియమాలు, భావాల నిర్వహణ మరియు సమ్మిళితం గురించి చురుకుగా అర్థం చేసుకోవటం. ఆచరించటం. సంఘటనలు, కథలను సంఘటనల క్రమంలో చెప్పటం, అక్షర మరియు ధ్వని ఆటలను వివరించడంలో నిమగ్నమై ఉండటం. పరిష్కారాలను చేరుకోవడానికి మునుపటి జ్ఞానం మరియు తర్కాన్ని అన్వేషించటం, ప్రయోగాలు చేయటం, వర్తింప చేయటం. సంఖ్య మరియు లెక్కింపులో నైపుణ్యాన్ని ప్రదర్శించటం, వస్తువులను వివిధ మార్గాల్లో సమానంగా విభజించుట, నిర్దిష్టమైన వస్తువులను ఇవ్వడం తీసుకోవడం - లెక్కించడం అభ్యసించటం. వివిధ జీవుల జీవిత చక్రాన్ని అర్థం చేసుకోవటం, చిత్ర కార్డులను క్రమంలో ఉంచటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు పిల్లలను వారి స్వంత చిత్రం/ స్క్రాప్ పుస్తకాన్ని రూపొందించడంలో నిమగ్నం చేయండి. పాత వార్తాపత్రికలు పుస్తకాలు మొదలైన వాటి నుండి వారు ఇష్టపడే చిత్రాలను చింపి అతికించమని ప్రోత్సహించండి. వివిధ ఆకులు/పువ్వులు వంటి సహజ పదార్థాలు గురించి మాట్లాడండి మరియు చర్చించండి. కుటుంబం కోసం చేసే సరళమైన, వండే అవసరం లేని వంట కార్యకలాపాలలో పిల్లలను నిమగ్నం చేయండి. పదార్థాలను గుర్తించి, వివిధ పరిమాణాలలో కలిపి, వాసన, రుచి చూసి అంచనాతో అవసరమైన విధంగా మార్పులు చేయడానికి వారిని ప్రోత్సహించండి. నిర్మాణ కృత్యాలలో పిల్లలను సవాలు చేయండి. ఉదా: ఉక్కు ప్లాస్టిక్ వంటగది పాత్రలను ఉపయోగించి వారు చేయగలిగినంత ఎత్తైన టవర్ లేదా ఇటుకలు/రాళ్ళు మొదలైన వాటిని ఉపయోగించి పొడవైన వంతెనను తయారు చేయమని చెప్పండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ