పునశ్చరణ కి పునర్బలన వారం - 7 పిల్లలు ఏమి నేర్చుకుంటారు కళాకృతిలో ప్రాథమిక మరియు ద్వితీయ రంగులను గుర్తించడం, ప్రయోగించటం, వర్గీకరించడం మరియు వాటిని ఉపయోగించడం. విభిన్న ఆకృతులను మరియు వాటి లక్షణాలను గుర్తించడం, వాటిని గీయడం, వస్తువులను వాటి ఆకారాల ఆధారంగా వర్గీకరించడం మరియు వాటిని ఉపయోగించి ఆసక్తికరమైన నమూనాలను రూపొందించడం. సంగీతం, బీట్స్, శరీర కదలికలు మొదలైన వాటిలో లయబద్ధమైన నమూనాలను ఆస్వాదించటం, సాధన చేయటం. ధ్వనుల అవగాహనను పెంపొందించుకోవటం, ధ్వనులను మాతృభాషలోని అక్షరాలతో అనుబంధించటం. సంఖ్యలను గుర్తించటం, అర్థం చేసుకోవటం, క్రమంలో లెక్కించటం. పునశ్చరణ వర్క్ షీట్ కీలక కృత్యాలకు మద్దతు అందిస్తాయి. ఒక్కొక్కరికి ప్రత్యేకంగా కృత్యాలను వివిధ గ్రూపులకు మారుస్తూ అన్ని కృత్యాలను అన్ని గ్రూపులకు పునరావృతం చేయడం. సహచరుల భాగస్వామ్యం. వ్యక్తిగత విజయాల పరిశీలన, రికార్డింగ్. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు సరళమైన మరియు సంక్లిష్టమైన నమూనాలను రూపొందించడానికి రోజువారీ వస్తువులను ఉపయోగించండి. నమూనాలను మొదట గుర్తించి, కాపీ చేయడానికి పిల్లలను ప్రోత్సహించండి, తరువాత వారినే స్వయంగా విస్తరించి, సొంతంగా ఏర్పరచనివ్వండి. ఇంటి చుట్టూ ఉండే వివిధ ఆకారాలుగల వస్తువులను కనుగొనేలా పిల్లలను ప్రోత్సహించండి. వేలితో ఆ వస్తువుల సరిహద్దులను గీయండి. ప్రతి ఆకృతికి పేరు పెట్టి, దాని లక్షణాలను వివరించండి. గాలిలో, నీటిలో, ఇసుకలో ఆకారాలను గీయమని వారిని ప్రోత్సహించండి. వివిధ రకాల సంగీతాన్ని వినిపించండి మరియు పిల్లలను బీట్ లకు అనుగుణంగా సృత్యం చేయమని ప్రోత్సహించండి. సులభంగా అందుబాటులో ఉన్న సామగ్రిని ఉపయోగించి మీరు చేసే బీట్లకు అనుగుణంగా వారి స్వంత నృత్య కదలికలను చేయటానికి మరియు ప్రదర్శించడానికి వారిని ఉత్తేజపరచండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ