వారం - 35 పిల్లలు ఏమి నేర్చుకుంటారు సాహిత్యంలో చురుకుగా నిమగ్నమై, జాతీయ ప్రాముఖ్యత మరియు స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల కథలను అవగాహన చేసుకోవడం. ప్రాచీన పటాల ద్వారా తగినంత పదజాల అభివృద్ధి & ప్రాదేశిక అవగాహనను వ్యక్తపరచటం. సాధారణ అక్షరాలు మరియు వాటి ధ్వనులు, సంకేతాలు, లోగోలు & లేబుల్స్ ను గుర్తించడానికి, పరిశీలించటానికి, పోల్చటానికి, వివరించటానికి జ్ఞానాన్ని సృజనాత్మకంగా వినియోగించడం. పరస్పర చర్యల ద్వారా వైవిధ్యాన్ని అన్వేషించుట, అభినందించటం మరియు వివిధ రకాల ఆహారాన్ని తినటం. ప్రాథమిక గడియార లక్షణాలను గుర్తించటం, సమయాన్ని అర్థంచేసుకోవటం, సమయ భావనను వారి రోజువారీ దినచర్యలతో అనుబంధించటం. కోరికలు మరియు భావాలను వ్యక్తం చేయటం, తనవంతు కోసం వేచియుండటం, కృత్యాలలో మార్పులను అంగీకరించడం ద్వారా భావాలను అదుపు చేయటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు సురక్షితమైన వ్యర్థ పదార్థాలను తిరిగి ఉపయోగించడం ద్వారా మీ పిల్లలతో సృజనాత్మకంగా ఉండండి. పాత కార్డ్ బోర్డ్/ప్లాస్టిక్ పెట్టెలు/సీసాలు & పాత వార్తాపత్రికలు వంటి వస్తువులను ఉపయోగించి కొత్తగా ఏదైనా తయారు చేయండి. పజిల్స్ ను కలిసి పూర్తి చేయడం, లేని భాగాలను గుర్తించడం. పాత పుస్తకాలు మరియు వార్తాపత్రికల నుండి కత్తిరించిన పెద్ద చిత్రాలను గరిష్టంగా 4-5 ముక్కలుగా చింపి తిరిగి అతికించడం. కథ ప్రాంప్ట్‌లను ఉపయోగించి మీ పిల్లలతో సృజనాత్మక కథనాలను రూపొందించండి. కథలను గీయడానికి ఇంట్లో ఉన్న కాగితం మరియు క్రియాన్ లను ఉపయోగించండి. మీరు వివిధ రకాల తోలుబొమ్మలను కూడా తయారు చేయవచ్చు. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ