వారం 36 పిల్లలు ఏమి నేర్చుకుంటారు శ్రద్ధగా వినటం, సంఘటనలు మరియు పాత్రలను తిరిగి చెప్పేటప్పుడు వాటిని సరైన క్రమంలో గుర్తుచేసుకోవటం. చిత్రలేఖనంలో సృజనాత్మకతను వ్యక్తపరచటం. వ్యక్తిగత కథనాలు మరియు చిత్ర పుస్తకాలను తయారుచేయటం. సురక్షిత వాతావరణంలో ఇతరులతో సంభాషించేటప్పుడు కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవటం. వైవిధ్యం, వైకల్యం మరియు ప్రకృతి పట్ల సున్నితత్వాన్ని చూపిస్తూ ఎంపికలు చేసుకోవటం మరియు ప్రాధాన్యతలను వ్యక్తపరచటం. తెలిసిన సమాచారాన్ని సృజనాత్మకంగా వినియోగించుకుంటూ, పంచుకుంటున్న వనరులను కాగితం. విద్యుత్) జగత్తగా వినియోగిస్తారు. నిశిత పరిశీలన, శ్రద్ధగా వినటం, సూచనలను అనుసరించటం మరియు చిత్రాలతో వర్ణనలను సమర్థవంతంగా సరిపోల్చటం. నెలవారీ ECCE రోజు కుటుంబ సభ్యులతో చర్చించండి. పిల్లలతో శారీరక అభివృద్ధి కృత్యాలను ఎలా నిర్వహించాలో ప్రదర్శించండి: హాప్ స్కాచ్, యోగా, ఆటలు మొదలైనవి. ప్రతిభ ప్రదర్శన. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, మీ పిల్లలతో ట్రాఫిక్ నియమాలను చర్చించండి. రోల్ కోసం ఇంటి నేలపై టేపులను ఉపయోగించి, ఒక చిన్న రహదారిని ఏర్పరచండి. బొమ్మల కార్లను ఉపయోగించండి, కాగితంపై రహదారి సంకేతాలను గీయండి మరియు రోల్ ప్లే లో రోడ్డు దృశ్యాన్ని ప్రదర్శించండి. పేర్లు మరియు సంబంధాలను జోడిస్తూ, ఒక పెద్ద కాగితంపై కుటుంబ వృక్షాన్ని గీయండి, సరదాగా మరియు పరస్పర సంభాషణలుగా మార్చటానికి కుటుంబ దృశ్యాలను రోల్ ప్లే చేయండి. సరళమైన భాషను ఉపయోగించి భారత స్వాతంత్య్ర పోరాటం గురించి కథలను చెప్పండి. ప్రశ్నలు అడగడానికి మరియు స్వతంత్రం యొక్క ప్రాముఖ్యతను చర్చించడానికి మీ బిడ్డను ప్రోత్సహించండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ