పునశ్చరణ కి పునర్బలన వారం - 2 పిల్లలు ఏమి నేర్చుకుంటారు సమాజం, విభిన్న ప్రదేశాలు, వాటి అవసరం ఉపయోగం గురించి అవగాహన. వివిధ వృత్తులను అర్థం చేసుకుని, అభినందించడం, ఇతరులకు మద్దతు ఇవ్వడంలో వారి పాత్ర మరియు ఇతరుల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరచడం. వారి స్వంత భావాలను అర్థం చేసుకోవడం, లేబుల్ చేయడం, వాటిని ఇతరులకు షేర్ చేయడం. ఒకే విధమైన పరిస్థితులను వేర్వేరు వ్యక్తులు విభిన్నంగా భావించవచ్చని గుర్తించడం. పోషణ, పరిశుభ్రత మరియు ఆరోగ్యంను ప్రోత్సహించే అలవాట్లను పాటించడం. ప్రతిరోజూ విభిన్నమైన థీమ్‌లను ఎంచుకుని, పిల్లలను అనేక, వైవిధ్యమైన, ఆహ్లాదకరమైన, ఆట ఆధారిత కృత్యాలలో నిమగ్నం చేయండి. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు పిల్లలను చుట్టుపక్కలకు తీసుకువెళ్ళి, వివిధ కమ్యూనిటీ సహాయకులతో సంభాషణను ప్రోత్సహించటం. వారి వృత్తి, ఉపయోగించే సాధనాలు, వారు ఇతరులకు ఎలా సహాయం చేస్తారు మరియు వారికి కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడంలో సహాయం చేయటం. పిల్లలు వివిధ భావోద్వేగాలను అనుభవించినప్పుడల్లా 5 వరకూ లెక్కించడం, తమను తాము కౌగిలించుకోవడం, లోతైన శ్వాస తీసుకోవడం మొదలైన భావోద్వేగ నిర్వహణ వ్యూహాలను అభ్యసించమని వారిని ప్రోత్సహించండి. వారితో కలిసి చిత్రాలతో కూడిన ఒక రిమైండర్ పోస్టర్‌ను తయారు చేయండి. కుటుంబం కోసం చేసే సరళమైన, వండే అవసరం లేని వంట కార్యకలాపాలలో పిల్లలను నిమగ్నం చేయండి. పదార్థాలను గుర్తించి, వివిధ పరిమాణాలలో కలిపి, రుచి చూసి అవసరమైన విధంగా మార్పులు చేయడానికి వారిని ప్రోత్సహించండి ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ