వారం - 20 పిల్లలు ఏమి నేర్చుకుంటారు పది వరకు సంఖ్యలను చదవటం, సూచనలను అనుసరించడం. సంఖ్య / ఆకార పేర్లను ఉపయోగించడం, ఆకారాలు, రంగులు మరియు వాటి ఛాయలను వేరు చేయడం మరియు భారతీయ కరెన్సీ నాణేలను గుర్తించడం. అందరినీ కలుపుకుని వెళ్ళటం వైవిధ్యాన్ని ఆచరించడం మరియు గౌరవించడం. అందరూ ఉపయోగించే ప్రదేశాలలోని నిబంధనలను గుర్తించి, అనుసరించటం. భద్రత గురించి అర్థం చేసుకుని సాధన చేయటం. మట్టి లేదా పిండి వంటి పదార్థాన్ని చుట్టడం మరియు ఒత్తడం ద్వారా త్రిమితీయ (3D) ఆకృతులను తయారు చేయడం. సాధారణ వస్తువులు, వ్యక్తులు, చిత్రాలు, జంతువులు, పక్షులు మరియు సంఘటనలను స్వతంత్రంగా గుర్తించి వివరించటం. విభిన్న రుచులు, వాసనలు మరియు ఆకృతులను అన్వేషించటం, చల్లటి ఆహారాన్ని వండడానికి ఇష్టపడటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు రోజులోని నిర్దిష్ట సమయాలలో చేసే రోజువారీ దినచర్యలను చర్చించడం, గుర్తించడంస వమరియు వివరించడం ద్వారా సమయం మరియు దినచర్యపై అవగాహన పెంచటం. మీరు మీ పిల్లలతో కలిసి ఇంటిలోని రోజువారీ దినచర్య చార్జ్ ను కూడా తయారుచేయండి. లోపల బయట, పైన కింద, ఓవర్ / అండర్, ముందు / వెనుక మొదలైన పదాలను ఉపయోగించి వివిధ వస్తువులను వేర్వేరు ప్రదేశాలలో ఉంచమని చెబుతూ పిల్లలతో ఆడుకోండి. పిల్లలతో కలిసి మీ పరిసరాలలోని సాధారణ ప్రదేశాలను అన్వేషించండి. కమ్యూనిటీ గురించి పరిచయాన్ని పెంపొందించడానికి పార్కులు, మార్కెట్లు, పాఠశాలలు, ప్రార్థనా స్థలాలు మొదలైన ప్రదేశాలను గుర్తించండి మరియు వాటి గురించి చర్చించటం ద్వారా వారిలో సమాజ భావన మరియు పరిచయాన్ని పెంపొందించండి. ఆధారం : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ