వారం - 21 పిల్లలు ఏమి నేర్చుకుంటారు సృజనాత్మక వ్యక్తికరణ ద్వారా భాషను మెరుగుపరుచుకుంటూ లెక్కించటం, క్రమబద్ధీకరించటం. పొడవు మరియు బరువును అన్వేషించే సంఖ్యా నైపుణ్యాలపై పురోగతి సాధించటం. స్వాతంత్య్రాన్ని ప్రదర్శించడం. సామాజిక నైపుణ్యాలను పెంపొందింపచేసుకోవడం, సమూహ ఆటలను ప్రారంభించడం, బాధ్యతాయుతంగా సూచనలు మరియు పాఠశాల నియమాలను అనుసరించడం, సానుకూల సంబంధాలను పెంపొందించుకోవటం. అధునాతన నమూనాలను గుర్తించటం, తయారుచేయటం మరియు అద్భుతమైన వర్గీకరణ నైపుణ్యాలు. ఉత్సుకతతో ఆరుబయట అన్వేషించడంలో నిమగ్నమవ్వటం, రంగులు వేయటం, పాడటం మరియు సృత్యం చేయడం ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేయటం. గేయాల ద్వారా భావ వ్యక్తీకరణ, పుస్తకాలను చురుకుగా అధ్యయనం చేయడం, అక్షరాలు, లోగోలు, సంకేతాలను స్వతంత్రంగా గుర్తించటంతో ప్రారంభ అక్షరాస్యత నైపుణ్యాలను ప్రదర్శించడం. రహదారి భద్రత మరియు స్వీయ సంరక్షణ పనులపై పట్టు సాధించడం, సాధారణ సంకేతాలు మరియు లోగోలను గుర్తిస్తూ తమ అసౌకర్యాన్ని విశ్వసనీయ పెద్దలకు తెలియచేయటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు మీ పిల్లలతో కలిసి చుట్టుపక్కల ప్రాంతాలను అన్వేషించండి. కిరాణా దుకాణంలోని సుపరిచితమైన లోగోలు లేదా స్టాప్ గుర్తు వంటి సంకేతాలను గుర్తించండి. వీటిని గీయడంలో మీరు కూడా వారికి సహాయపడండి. సమానత్వాన్ని హైలైట్ చేయడానికి అబ్బాయిలు మరియు అమ్మాయిలు విభిన్న కృత్యాలలో పాల్గొంటున్న కథలు లేదా వీడియోలను షేర్ చేయండి. అబ్బాయిలు మరియు అమ్మాయిలు ఎలా సమానంగా ఉన్నారో చర్చించండి వారు ఆడగలరు, చేయగలరు. వారు కోరుకున్నది ఏదైనా కాగలరు అనే నమ్మకాన్ని ఇవ్వండి. ఇంట్లో లభించే రకరకాల బట్టలు మరియు బూట్లతో డ్రెస్-అప్ గేమ్‌లు ఆడండి. వాటిని ధరించడానికి పిల్లలను ప్రోత్సహించండి మరియు వారిని స్వతంత్రంగా కట్టుకోనివ్వండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ