వారం - 29 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ముఖ కవళికలు & సంజ్ఞల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తూ, సరైన క్రమం, లయ & శ్రావ్యతతో గేయాలను పాడటం. ప్రాదేశిక భావన, సమస్యా పరిష్కారం మరియు తార్కిక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. పజిల్ భాగాలను సరిగ్గా గుర్తించడం మరియు సరిపోల్చడం, పజిల్స్ ని నమూనాలు మరియు సన్నివేశాలను వివరించడం. వివిధ సందర్భాలలో సురక్షితమైన పెద్దలను గుర్తించటం మరియు పేరు చెప్పటం గురించి చర్చించటం. గృహ వస్తువులను ఉపయోగించి లయ బద్దమైన స్వరాలను సృష్టించడం, వివిధ రకాల ధ్వనులు మరియు నమూనాలను అన్వేషించడం. పండుగలలో పాల్గొనడం, విభిన్న పద్ధతుల గురించి తెలుసుకోవడం మరియు సాంస్కృతిక ప్రశంసలను అభివృద్ధి చేయడం. సంఘటనలు లేదా చర్యల ప్రభావాన్ని అంచనా వేయడం ద్వారా ముందుగా ఊహించే నైపుణ్యాలను మెరుగుపరచడం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు మీ పిల్లలతో కలిసి డ్యాన్స్ చేయడం ఆనందించండి, వివిధ భాషల్లో విభిన్న గేయాలు మరియు పాటలను ప్లే చేయడం లేదా పాడడం ద్వారా వేగవంతమైన మరియు నెమ్మదైన సంగీత ట్యూన్లకు నృత్యం చేయండి. మీ పిల్లలకు నిజమైన నాణేలు/ నోట్లను చూపడం ద్వారా మరియు వాటిని సాధారణ లావాదేవీల కోసం ఉపయోగించడం ద్వారా డబ్బు గురించి అర్థం చేసుకునేలా వారిని ప్రోత్సహించండి. మార్కెట్ కు వెళ్ళినప్పుడు, పిల్లవాడు దుకాణదారులకు డబ్బు ఇచ్చి, తీసుకోవటం చేయనివ్వండి. పిల్లలతో కలిసి ఊహించి చెప్పండి అనే ఆటలను ఆడండి. రంగు, ఆకారం, ఉపయోగం, స్థానం, ఆకృతి, వాసన మొదలైన వివిధ వస్తువులకు సంబంధించిన సూచనలను వంతులవారీగా ఇవ్వండి. వాటిని ఊహించమనండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ