వారం - 30 పిల్లలు ఏమి నేర్చుకుంటారు ఆహారంలో పోషణ మరియు వైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి వివిధ రకాల ఆహారాలను అన్వేషించటం ఇతరులతో సహకరించటం, బాధ్యత తీసుకోవటం మరియు నియమాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం. సాధారణ వర్ణమాలను గుర్తించటం, కథ చెప్పడం మరియు చిత్ర పుస్తకం / కథ పుస్తకం పఠన సెషన్లలో చురుకుగా పాల్గొనటం. సురక్షితమైన వ్యర్థాలను పునర్వినియోగం చేయడానికి మరియు రీసైకిల్ చేయడానికి, చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి సృజనాత్మక ఆలోచనను ఉపయోగించడం. సాధారణ చిత్రాల అవుట్ లైన్ లను కత్తిరించటం చింపటం ద్వారా సూక్ష్మ కండర నైపుణ్యాలు మరియు సృజనాత్మకతను మెరుగుపరచటం. వస్తువులను వాటి రూపాల్లోని మార్పుల ఆధారంగా గమనించి, పోల్చిచూడటం, ప్రయోగాలు చేయడం మరియు తార్కికతను వర్తింప చేయటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు పిల్లలతో కథ చెప్పే సెషన్లలో పాల్గొనండి. వారికి ఇష్టమైన కథలను పంచుకోవడానికి వారిని ప్రోత్సహించండి. పిల్లలతో కలిసి వివిధ అంశాలపై సరదాగా కథలు మరియు గేయాలను కూడా తయారు చేయవచ్చు. ఇంట్లో టేబుల్ లాగడం, బొమ్మలు శుభ్రం చేయడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటి సాధారణ పనుల బాధ్యతను తీసుకోవటంలో పిల్లలను నిమగ్నం చేయాలి. వాటిని గుర్తు చేయడానికి రోజువారీ బాధ్యతల చిత్రపట చార్టన్ను రూపొందించండి. మనం వేర్వేరు దుస్తులు ఎందుకు ధరిస్తామో అర్థం చేసుకోవడానికి మరియు దుస్తులలో వ్యక్తిగత ఎంపికలను చేసుకునేలా పిల్లలకు సహాయపడండి. వారుసొంతంగా దుస్తులు ధరించటం ద్వారా స్వేచ్ఛగా అభ్యసించేలా పిల్లలను ప్రోత్సహించండి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ