వారం-7 పిల్లలు ఏమి నేర్చుకుంటారు తమ గురించి మరియు కుటుంబం గురించి సమాచారాన్ని పంచుకోవడం, నిర్దిష్ట థీమ్ లనుండి పదజాలం ఉపయోగించడం, సాధారణ వస్తువులను గుర్తించి వివరించడం. వస్తువుల పొడవు మరియు బరువులను బట్టి వాటిని పొడవు/పొట్టి మరియు బరువు/ తేలిక అని పోల్చి, వేరు చేసి ఆకారం, పొడవు, ఎత్తు మరియు బరువు ఆధారంగా వాటిని మూడు గ్రూపులుగా వర్గీకరిస్తారు. కుటుంబం, పరిసరాలు, పాఠశాల మరియు నగరంలో సభ్యునిగా తనను తాను గుర్తించుకోవడం. దృశ్య కళలలో గుర్తులు, రేఖలు మరియు ఇతర చిత్రాలను సృష్టిస్తూ కళా వాయిద్యాలను అన్వేషించటం. లయను కనుగొనటంలో వేగవంతమైన మరియు నిదానమైన టెంపోల (గమనం) మధ్య తేడాను గుర్తించడం మరియు బీట్ ప్రకారం వివిధ రకాల ధ్వనులు మరియు శారీరక కదలికలను చేయటం. సాధారణ సూచనలను అనుసరించటం మరియు ఆకారాలు, రంగులు, రవాణా పద్దతులు, ఖగోళ వస్తువులు, డిజిటల్ మరియు నాన్-డిజిటల్ పరికరాలను గుర్తించటం. ఇంట్లో చేయించవలసిన కృత్యాలు పాత మ్యాగజైన్లు లేదా వార్తాపత్రికలను అందించండి. వారు గుర్తించిన వివిధ రకాల రవాణా పద్దతులను కత్తిరించడానికి లేదా చింపడానికి పిల్లలను ప్రోత్సహించండి మరియు వాటితో కొలాజ్ లను రూపొందించమనండి. ఇతరులు చేసిన వాటితో పోల్చడం / వ్యత్యాసాలు మొ.. ప్రతిదాని గురించి మాట్లాడండి. ఉదయం మరియు రాత్రి ఆకాశాన్ని పరిశీలించడానికి పిల్లవాడిని వేర్వేరు రోజులు & సమయాలలో బయటకు తీసుకువెళ్లండి. వారు ఏమి చూస్తారో, ఆకాశం ఎలా మారుతుందో గురించి మాట్లాడండి. సూర్యోదయం సూర్యాస్తమయం, చంద్రుని వివిధ ఆకారాలు, నక్షత్రాల అమరిక నమూనాలు మొదలైన వాటి గురించి మాటాడండి. వివిధ రకాల సంగీతాన్ని వినిపించండి మరియు పిల్లలను బీట్ లకు అనుగుణంగా నృత్యం చేయమని ప్రోత్సహించండి. సులభంగా అందుబాటులో ఉన్న ఉన సామగ్రిని ఉపయోగించి మీరు చేసే బీట్లకు అనుగుణంగా వారి స్వంత నృత్య కదలికలను చేయటానికి మరియు ప్రదర్శించడానికి వారిని ఉత్తేజపరచండి. ఆధారం: మహిళా శిశు సంక్షేమ శాఖ