బాబూ జగ్జీవన్ రామ్ : 1971 యుద్ధంలో పాకిస్తాన్ కు దీటైన జవాబు ఇచ్చిన యోధుడు జననం: ఏప్రిల్ 5, 1908మరణం : జూలై 6, 1986 భారత రాజకీయాల్లో ప్రముఖుడైన బాబూ జగ్జీవన్ రామ్ జీవితం అంతా సమ్మిళిత, సమ సమాజ స్థాపన కోసం పోరాడారు. ఆహార, వ్యవసాయ మంత్రిగా భారతదేశంలో హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన ఘనుడు ఆయన. రక్షణ మంత్రి హోదాలో బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసిన 1971 భారత, పాకిస్తాన్ యుద్ధంలో చారిత్రక విజయానికి కారకులయ్యారు. సామాజిక న్యాయానికి ఆయన కట్టుబాటు ఎల్లప్పుడూ స్పూర్తిని అందిస్తూనే ఉంటుంది. జగ్జీవన్ రామ్ మహోన్నత స్వాతంత్య్ర యోధుడు. సమాజంలో అజచివేతకు గురవుతున్న వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన యోధుడు. 1908 ఏప్రిల్ 5వ తేదీన ఆయన బీహార్లోని భోజ్ పూర్లో జన్మించారు. మత ప్రచారకుడైన తన తండ్రి నుంచి మానవతా విలువలు, జ్ఞానం ఆయనకు వారసత్వంగా సంక్రమించాయి. బాబూజీగా అభిమానపాత్రంగా పిలుచుకునే జగ్జీవన్ రామ్ దళితుల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషి చేశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు మహాత్మా గాంధీ ఆరాధకుడైన బాబూ జగ్జీవన్ రాము 1940 డిసెంబర్ 10 వ తేదీన ఒక సారి, 1942 ఆగస్టు 19వ తేదీన మరోసారి అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదల అనంతరం 1946లో కేంద్రంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వంలో అతి పిన్న వయస్కుడైన మంత్రిగా ఆయన పని చేశారు. ఆయన భారత రాజ్యాంగ సభ సభ్యుడుగా కూడా ఉన్నారు. 1936లో బిహార్ శాసన మండలి సభ్యుడుగా నామినేట్ అయిన జగ్జీవన్ రామ్ 28 సంవత్సరాల వయసులోనే శాసన సభ్యుడయ్యారు. 35 సంవత్సరాల పాటు కేబినెట్ మంత్రిగా పని చేశారు. కేంద్రంలో సుదీర్ఘ కాలం పని చేసిన మంత్రిగా ఆయన పలు కీలక శాఖలు నిర్వహించారు. ఆయన ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆహార, వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేసిన కాలంలో "హరిత విప్లవం" విజయవంతం చేసిన వ్యక్తిగా ఘనత సాధించారు. రక్షణ మంత్రిగా 1971 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఏర్పాటుకు దారి తీసిన యుద్ధంలో దేశాన్ని చారిత్రక విజయం. బాటలో నడిపారు. ఒక పాలకుడుగా దేశానికి ఆయన సేవలు నిరుపమానం. ఆ మహోన్నత నాయకుడు 1986 జూలై 6వ తేదీన మరణించారు. "నిరాకరణకు, అణచివేతకు గురవుతున్న వర్గాల హక్కుల కోసం ఆయన జీవితకాలం పాటు చేసిన పోరాటం ఎల్లప్పుడూ దేశానికి ఒక స్ఫూర్తిగా ఉంటుంది. బాబూ జగ్జీవన్ రామ్ తన జీవితాన్ని పేదల సంక్షేమానికే అంకితం చేశారు. ఆయన పలు సంవత్సరాలు జాతి సేవలోనే గడిపారు. బాబూ జగ్జీవన్ రామ్ రెండే అంశాలు ప్రగాఢంగా కోరే వారు. అవి శక్తిమంతమైన భారత్, ప్రజాస్వామ్య భారత్, పాకిస్తాన్కు మనం గట్టి సమాధానం ఇచ్చిన సమయంలో ఆయన దేశానికి రక్షణ మంత్రిగా ఉన్నారు.దేశంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా గళం విప్పిన తొలి కాంగ్రెస్ నాయకుడు ఆయన. ప్రజలను ఇష్టానుసారంగా అరెస్టులు చేస్తున్న ఆ కష్టకాలంలో దేనికీ భయపడవద్దని ప్రజలను ప్రోత్సహించిన, బలమైన గళంగా అవతరించిన నాయకుడు ఆయన" . ఆధారం: న్యూ ఇండియా సమాచార్