జాతీయ పతాకం గౌరవాన్ని సమున్నతంగా నిలిపిన అమరవీరుడు జాతీయ పతాకం నేలపై పడకుండా కాపాడిన స్వాతంత్య్ర సమర యోధుడు ఆయన. బ్రిటిషర్లపై నిరసన ప్రదర్శన జరుగుతున్న సమయంలో తన ప్రాణాన్నే ఫణంగా పెట్టి జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడాడు. 27 సంవత్సరాల వయస్కుడైన ఆ సాహసి తిరుప్పూర్ కుమరన్. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత జాతీయ పతాకాన్ని నిషేధించింది. మాతృభూమి కోసం ఆయన నిస్వార్ధపూరితంగా చేసిన ఆత్మత్యాగం దేశ ప్రజల్లో ఐక్యత, ఆత్మగౌరవం, సాహసం అనే భావాలను తట్టిలేపే పిలుపుగా మారింది. తిరుప్పూర్ కుమరన్ సాహసం నేటికీ దేశ పౌరులకు స్ఫూర్తిదాయకంగానే ఉంది. జననం: అక్టోబర్ 4, 1904మరణం: జనవరి 11, 1932 ప్రస్తుతం తమిళనాడులో భాగంగా ఉన్న ఈరోడ్ (Erode) జిల్లాకు చెందిన చెన్నిమలైలో 1904 అక్టోబర్ 4వ తేదీన స్వాతంత్య్ర సమర యోదుడు, తిరుగుబాటు యోధుడు తిరుప్పూర్ కురమన్ జన్మించారు. దేశం అంతటా స్వాతంత్య్రోద్యమం జోరందుకుంటున్న సమయంలో దాని ప్రభావం కుమరన్ పై ప్రగాఢంగా పడింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, ఆదర్శాలతో స్ఫూర్తిని పొందిన ఆయన స్వాతంత్రోద్యమంలో భాగస్వామి అవడం ప్రారంభించారు. 1932వ సంవత్సరంలో గాంధీజీ బొంబాయిలో ఒక నిరసన ప్రదర్శన నిర్వహించాలని తలపెట్టినప్పుడు ఆయనను అరెస్టు వేయాలని బ్రిటిషర్లు భావించారు. ఆయన అరెస్టు దేశవ్యాప్తంగా శక్తిమంతమైన నిరసనలు ప్రణ్యరిల్లచేసింది. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత జాతీయ పతాకాన్ని నిషేధించగా ఆత్మగౌరవానికి, ప్రతిఘటనకు చిహ్నంగా తాము భావించే ఆ పతాకాన్ని నిరసనకారులు చేతబూని ప్రదర్శనలకు దిగారు. అలా జాతీయ పతాకాన్ని పట్టుకున్న ప్రదర్శనకారుల్లో తిరుప్పూర్ కుమరన్ ఒకరు. ప్రదర్శనకారులపై బ్రిటిష్ పోలీసులు లాఠీచార్జి చేస్తున్నప్పటికీ కుమరన్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. కుమరన్ తో సహా నిరసనకారులను పోలీసులు దారుణంగా కొట్టారు. ఆ సమయంలో తాను నేలపై పడిపోయినప్పటికీ కుమరన్ జాతీయ పతాకం వేలపై పడకుండా గట్టిగా పట్టుకున్నారు. ఆ సందర్భంలో అయిన తీవ్ర గాయాల ఫలితంగా కుమరన్ 1932 జనవరి 11వ తేదీన కన్ను మూశారు. "కోడి కథ కుమరన్"గా త్రివర్ణ పతాక సంరక్షకుడు కుమరన్) ఆయన వారసత్వం భరతమాత పట్ల చెక్కు చెదరని భక్తిభావం, అన్యాయాన్ని ఎదిరించాలన్న దృఢ సంకల్పం రెండింటి సంగమంగా ప్రసిద్ధి చెందింది. తుది క్షణాల్లో కూడా త్రివర్ణ పతాకం నేలపై పడకుండా గట్టిగా పట్టుకున్న ఆయన చెక్కు చెదరని సంకల్పం అసాధారణ సాహసం, మాతృభూమి పట్ల చెక్కు చెదరని ప్రేమకు తార్కాణంగా మనందరికీ గుర్తుండిపోతుంది. ఆయన ఎంతో సాహసంతో చేసిన ఆ కార్యం, దాని జ్ఞాపకాలు జాతీయ పతాకాన్ని సంరక్షించాలన్న స్ఫూర్తిని ప్రతీ తరంలోనూ రగిలిస్తాయి. ఎందరో త్యాగధనుల కారణంగా వచ్చిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవలసిన అవసరాన్ని సంపూర్ణ అంకిత భావంతో జాతికి సేవలందించాలన్న సందేశాన్ని, ఆత్మత్యాగ స్ఫూర్తిని గుర్తు చేస్తూ ఉంటాయి. అక్టోబర్ 4వ తేదీన కుమరన్ సంస్కరణ దినోత్సవం నాడు ఆ పవిత్ర దివాన భరతమాత ముద్దుబిడ్డ అయిన తిరుప్పూర్ కుమరన్ ను మనమందరం గుర్తు చేసుకుని, శిరస్సు వంచి అభివాదం చేయాలి. ఎంతో గొప్ప రాష్ట్రం అయిన తమిళనాడుకు చెందిన ఆయన తన జీవితాన్ని స్వాతంత్రోద్యమానికి, జాతీయతా స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేందుకు అంకితం చేశారని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జాతీయ పతాకాన్ని నేల పడకుండా సమున్నతంగా పట్టుకోవడం కోసం తిరుప్పూర్ కుమరన్ అసమాన సాహసం ప్రదర్శించడమే కాకుండా నిస్వార్ధపూరిత త్యాగం చేశారు. వలసపాలన కాలంలో వారి బారి నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు లెక్క చెప్పలేనంత మంది చేసిన పోరాటాలు, ఎదుర్కొన్న కష్టనష్టాలను కుమరన్ ఆత్మత్యాగం మనందరికీ గుర్తు చేస్తూనే ఉంటుంది. దేశానికి ఆయన చేసిన సేవ మనందరిలోనూ జాతీయాభివృద్ధి, ఐక్యతకు కృషి చేయాలన్న స్ఫూర్తిని రగిలిస్తూనే ఉండు గాక. ఆధారం: న్యూ ఇండియా నమాచార్