ఏంటో, మరీ ఆ బేషరమ్?ఊహకందని క్రూరత్వంతోసాధుత్వపు ముసుగులోదానవత్వపు వికటాట్టహాసంఇంకెంత ఉన్మాదంఆ అధికారం ఆవల దాగి ఉందో?నలభై మంది దేశభక్తులను హత్య చేసిపర దేశానికి భక్తిగా ప్రకటించిందిఅందలమెక్కిన అహంలోవిషకరకుతనంతో విషాద ఛాయలుప్రభుత్వ పడకగదిలోపట్టు పరుపు వేసుకునిఉరవడి పవళిస్తూలొట్టలేస్తున్న వేళపుల్వామాలో పారిన రక్తంనేడు జలపాతమైస్మృతిగీతి పాడుతూ ఉరికిందిపహారా పని మరిచి పరాయిపటాసుల పక్కా పథకానికి పళ్లికిలిస్తూకాపాడాల్సిన కన్నే గన్నైప్రాణం కోసం విమానం అడిగితేకనీస ప్రమాణాలు మరిచిందిపాడె మీద పేలాలేరుకునేపాలకుల జమానాలోమన రా'జీవనమే జుర్మానాకానీండి, ఎప్పటికీ మాయని గాయంతోఘాతుకానికి పట్టాభిషేకందొడ్డి దారిలో అసత్య నిచ్చెనలెక్కండిసత్యాన్ని కాండ్రించి ఉమ్మడానికికాల నాగులు పొంచి ఉన్నాయిదేశాన్ని మట్టుబెట్టే దారులసాక్షిగానా మత జవాన్ల చితిలోపేలిన తూటాలు యావత్ దేశంసంచరిస్తూ పరిహారాన్ని ప్రశ్నిస్తున్నాయివడ్డీతో వసూల్ కై సవాల్ చేస్తున్నాయి. - డా|| మాటూరి శ్రీనివాస్ ఆధారం : ప్రజాశక్తి