అవునులేనేటి విద్యార్థుల్నిరేపటి పౌరులుగా నిలబెట్టే వాళ్లం కదాకూర్చునేందుకు మాకు కుర్చీలెందుకులేరకరకాల పేర్లతో నెల నెలాఎంతో కొంత మా పచ్చదనాన్నిలాగేసుకుంటూనే వున్నారుఒక పక్క ఒరిగి సగం విరిగిన కుర్చీలనిలాగేసుకోవటం మీకో లెక్కా..!? అయినానిలబడి పాఠాలు చెప్పటంలోమా తరువాతే ఎవరైనాఒక జాతిని నిలబెట్టేవాళ్లం కదాఒక పౌరసమాజాన్ని ప్రతిష్టించేవాళ్లంఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు నిలబడాలోమీకంటే మాకే బాగా తెలుసునరాలు తెగేలా బోధించీ బోధించీకడుపులో పేగులు కదిలేలా అరిచీ అరిచీఅదీ ఏ రాతపూతల కోసమోఅలసిసిన దేహాన్ని కాసేపు అలా కుర్చీలో కుదేస్తాంమీలెక్క మేమేమీ కుర్చీల కోసంకుస్తీలు పట్టేవాళ్లం కాదులెండికుర్చీని బల్లిలా అంటి పెట్టుకునిఐదేళ్ల దాకా ససేమిరా దిగిపోమనిమొరాయించెటోళ్లం కాదులెండి! అయినా మీ కళ్లకుపనీపాటా మానేసికునికిపాట్లు పడే కుర్చీలు కనిపించవుచేయాల్సిన ప్రజల పనుల్ని వాయిదా వేసినిద్రబల్లలుగా మారిన కుర్చీలు కనబడవుఉన్నఫళంగా ఎటూ కదలకుండాఏళ్ల తరబడి పదవిలో జోగాడే కుర్చీలు కనబడవుప్రజల పట్ల బాధ్యత మరిచికుర్చీల కోసమే కుమ్ములాడుకునేవ్యవస్థా కనబడదు కూర్చున్నా నిలబడ్డానిలువునా మంచులా కరిగినానిప్పులా తగలబడినాఒక దేశాన్ని నిర్మించి నిలబెట్టేబోధించే జాతి మాదిమా కుర్చీలే కనిపిస్తాయి మీకు అయినామా ఒంట్లో రక్తాన్నీ నరాల్నీలాగేసుకుంటున్నవాళ్లకుమా ముడ్డి కింద కుర్చీలనిలాగేసుకోవటం ఒక లెక్కాఒక జాతినీ ఒక నీతినీఒక దేశాన్నే నిలబెట్టేవాళ్లంమేము నిబడలేమాఅయ్యా మా కుర్చీలు లాగటానికి ముందుప్రజల సంక్షేమాన్ని మరిచి గురకపెట్టేమీ కుర్చీల గురించి కాస్త ఆలోచించండి!(టీచర్లకు కుర్చీలు తీసెయ్యాలన్న ఇటీవలి ఒక వార్త చూశాక) - చిత్తలూరి - కవిత్వం ఆధారం : ప్రజాశక్తీ