మీరు చెమటోడ్చి సంపాదించిన సొమ్ము నష్టపోకండి. నమ్మలేనటువంటి లాభాలు అంటే భరించలేనటువంటి కష్టాలు కలగవచ్చు అధిక మొత్తం లో డబ్బు ఇస్తామని ఇ మెయిల్, కాల్స్ మరియు సందేశాలద్వారా చేసే వాగ్దానాలు మోసపూరితమైనవి. మీరు చెమటోడ్చి సంపాదించిన సొమ్ము నష్టపోకండి. మీ కార్డు బ్లాక్ చేయబడిందని లేదా మీకు పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెబుతామంటూ ఆర్.బి.ఐ, ఆర్.బి.ఐ మరియు/లేదా ఏదైనా ఇతర అధికారి పేరుతో వచ్చే ఎస్ఎంఎస్, ఫోన్, ఈమెయిల్ కి మోసపోకండి. తెలిసిన లేదా తెలియని సంస్థల నుంచి పెద్ద మొత్తాల్లో డబ్బు అందుతుందనే ఆశతో, ప్రారంభ డిపాజిట్, కమిషన్ లేదా ట్రాన్స్ఫర్ ఫీజుగా ఎవ్వరికీ డబ్బు పంపకండి. ఆర్.బి.ఐ వ్యక్తులపేరుతో అకౌంట్ తెరవదు లేదా క్రెడిట్/ డెబిట్ కార్డ్లు జారీచేయదు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్ వర్డ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నంబరు, సివివి, ఎటిఎం పిన్ లేదా ఒటిపిని ఎవ్వరికీ * వెల్లడించకండి. ఆర్.బి.ఐ లేదా మీ బ్యాంక్ ఎప్పుడూ వీటిని అడగదు. ఎస్ఎంఎస్/ఈమెయిల్ లో ఇచ్చిన లింకులపై క్లిక్ చేయడం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎవ్వరికీ ఇవ్వకండి. మీ బ్యాంక్ యొక్క అధికారిక సైట్లో లేదా మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వెనుక ఇచ్చిన సమాచారంపై మాత్రమే ఆధారపడండి. విదేశాల నుండి లేదా భారతదేశం నుండే తక్కువ వడ్డీకి లేదా తక్కువ ఖర్చుతో నిధులు సమకూరుస్తామనే ఆఫర్లు మీకు వస్తే, మీరు స్థానిక పోలీసులకు, సైబర్ క్రైమ్ అధికారులకు లేదా sachet@rbi.org.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. మీరు లావాదేవీని ప్రారంభించినప్పుడు మినహా. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్