చెక్కుల వేగమైన క్లియరింగ్ ఇక్కడ! ఇప్పటినుండీ, బ్యాంకులు అదే రోజున చెక్కులను పాస్/రిటర్న్ చేస్తాయి. కస్టమర్ అదే రోజున క్రెడిట్ పొందుతారు. చెక్కులను సమర్పించిన కొద్ది గంటల లోపుననే చెక్కులు క్లియర్ చేయబడి కస్టమర్ ఖాతాకు జమ చేయబడతాయి. దాని అర్థం ఏమిటి? వేగమైన నిధుల లభ్యత మెరుగుపడిన సౌకర్యం తగ్గిపోయిన ఆలస్యాలు గుర్తుంచుకోండి! చెక్ బౌన్స్ నివారించడానికై మీ ఖాతాలో తగినంత బ్యాలన్స్ ఉంచుకోండి. మరిన్ని వివరాల కోసం, మీ బ్యాంకును సంప్రదించండి లేదా www.rbi.org.in సందర్శించండి. వేర్వేరు డిజైన్లు గల నాణేల పట్ల నమ్మకం లేకుండా ఉన్నారా? ఒకే విలువ కలిగిన వేర్వేరు డిజైన్లు గల నాణేలు ఒకే సమయంలో చెలామణిలోనే కొనసాగుతాయి. 50 పైసలు, ₹1, ₹2, ₹5, ₹10, మరియు ₹20 నాణేలు అన్నీ చట్టబద్ధమైనవి మరియు సుదీర్ఘకాలం చెలామణిలో ఉంటాయి. నాణేల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని లేదా పుకార్లను నమ్మవద్దు. ఎటువంటి సందేహం లేకుండా వాటిని స్వీకరించండి. పాత బ్యాంకు ఖాతాలలో ఉన్నడబ్బు మర్చిపోయారా? దాన్ని తిరిగి పొందడంలో RBI మీకు సహాయం చేస్తుంది! మీ లేదా మీ కుటుంబం యొక్క ఖాతా 10+ సంవత్సరాల పైన నిష్క్రియంగా ఉంటే, ఆ నిధులు RBI యొక్క డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ (DEA) ఫండ్లో ఉండవచ్చు. కానీ మీరు వాటిని ఇప్పటికీ తిరిగి పోందవచ్చు. క్లెయిమ్ చేయని డిపాజిట్లను తనిఖీ చేయండి: https://udgam.rbi.org.in మీ బ్యాంకు యొక్క ఏదైనా శాఖను సందర్శించండి . KYC సమర్పించండి (ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ID, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇత్యాది ) మీ డబ్బును తిరిగి పొందండి (వర్తిస్తే, వడ్డీతో సహా). మీ బ్యాంకు నుండి కేవైసీ అప్డేట్ చేయాలనే మెసేజ్ వచ్చిందా? చింతించకండి! ఇది త్వరితం, సులువు, ఇంకా మీ బ్యాంకింగ్ సేవల్ని అంతరాయం లేకుండా పొందడంలో సహాయపడుతుంది. ఎలా? ఒకవేళ కేవైసీ లో ఏ మార్పు లేకుంటే లేదా చిరునామా మాత్రమే మారి ఉంటే, స్వీయ ధృవీకృత ప్రకటన సరిపోతుంది. ఇతర మార్పుల కోసం, మీరు క్రిందివాటిలో దేనితోనైనా అప్డేట్ చేయవచ్చు: ఆధార్ ఓటిపి ఆధారిత ఇ-కేవైసీ వీడియో కేవైసీ మీ బ్యాంక్ బ్రాంచ్ యందు అప్డేట్ చేయబడిన అధికారికంగా చెల్లుబాటయ్యే పత్రాలను(OVD)ను సమర్పించడం గుర్తుంచుకోండి బ్యాంక్-అధీకృత ఛానెల్స్ ద్వారా మాత్రమే కేవైసీ ని అప్డేట్ చేయండి. మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడం కోసం ఎవరైనా మీకు సులభమైన డబ్బును అందజూపుతున్నారా? మనీ మ్యూల్గా మారకండి! మనీ మ్యూల్ అంటే, ఇతరుల తరఫున అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేసే వ్యక్తి. మీ బ్యాంక్ ఖాతా = మీ డబ్బు డబ్బును బదిలీ చేయడానికి మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడానికి ఎవరినీ అనుమతించవద్దు. మీ బ్యాంక్ ఖాతా ద్వారా డబ్బును పొందడానికి లేదా పంపించడానికి ఇతరుల్ని అనుమతిస్తే మీరు జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, లేదా పాస్వర్డ్లను ఏ ఒక్కరితోనూ ఎప్పటికీ పంచుకోవద్దు. మీ ఖాతాను కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సులభంగా వచ్చే డబ్బు కోసం రిస్క్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. మరింత సమాచారం కోసం దయచేసి : https://rbikehtahai.rbi.org.in/telugu/index.html పై క్లిక్ చేయండి మీ నగదు మీ ఫోన్లోనే ఇమిడిపోతే ఎలా ఉంటుంది? డిజిటల్ రూపాయి (e₹)తో, అది సాధ్యం. డిజిటల్ రూపాయి (e₹) ఆర్బిఐ చే జారీ చేయబడిన డిజిటల్ కరెన్సీ. కచ్చితమైన చిల్లర కోసం చూడాల్సిన అవసరం లేదు. యుపిఐ తో సహా, అన్ని క్యుఆర్ కోడ్లపై పనిచేస్తుంది. భారతదేశ కేంద్రీయ బ్యాంక్ విశ్వాసాన్ని ఆనందిస్తూనే తెలివైన రీతిలో చెల్లింపులు చేయండి. ఆర్బిఐ అంటుంది డిజిటల్ రూపాయి: నగదే, కానీ డిజిటల్ రూపంలో. మీరు సంవత్సరాలుగా ఉపయోగించని బ్యాంకు ఖాతాలో మీ డబ్బు అలాగే ఉండిపోయిందా? మీరు రెండు సంవత్సరాలకు పైగా మీ బ్యాంకు ఖాతాలో ఎలాంటి లావాదేవీలు చేయకపోతే, ఆ ఖాతా క్రియారహితంగా మారుతుంది. క్రియారహిత బ్యాంకు ఖాతాను తిరిగి సక్రియం చేయడానికి మీ బ్యాంకును సంప్రదించండి. మీ బ్యాంక్ యొక్క ఏదైనా శాఖలో లేదా వీడియో KYC ద్వారా మీ KYC వివరాలను నవీకరించండి. మీ బ్యాంకు ఖాతాను ఎల్లప్పుడూ సక్రియంగా ఉంచుకోండి. మరింత సమాచారం కోసం దయచేసి : https://rbikehtahai.rbi.org.in/telugu/index.html ను సందర్శించండి ఆర్బీఐ ఆర్బిఐ అంటుంది - విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి! ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)