RBI రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ద్వారా సురక్షిత పెట్టుబడులు రీటెయిల్ డైరెక్ట్ పథకము అనేది వ్యక్తిగత పెట్టుబడిదారులచే ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిని అనుకూలపరచుటకు ఉన్న వన్-స్టాప్ పరిష్కారము. ఈ పథకములో వ్యక్తిగత రీటెయిల్ పెట్టుబడిదారులు RBI తో గిల్ట్ సెక్యూరిటీస్ అకౌంట్ – “రీటెయిల్ డైరెక్ట్ గిల్ట్ (ఆర్డిజి)” అకౌంట్ ను తెరవవచ్చు. అర్హతలు రీటెయిల్ పెట్టుబడిదారులు అంటే వ్యక్తులు (సహజ వ్యక్తులు) అందరు RBI రీటెయిల్ డైరెక్ట్ పథకము ప్రకారము రీటెయిల్ పెట్టుబడిదారులు, వారికి ఈ క్రింది అంశాలు ఉంటే, పథకము కింద నమోదు చేసుకోవచ్చు మరియు ఒక ఆర్డిజి అకౌంట్ ను నిర్వహించవచ్చు: భారతదేశములో నిర్వహించబడే రుపీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ; ఆదాయపు పన్ను విభాగము జారీ చేసిన పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్); కేవైసి కొరకు ఏదైనా ఓవిడి; చెలామణిలో ఉన్న ఈమెయిల్ ఐడి; మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబరు. విదేశీ మారక నిర్వహణ చట్టము, 1999 కింద ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే అర్హత ఉన్న నాన్-రెసిడెంట్ రీటెయిల్ పెట్టుబడిదారులు ఈ పథకకము ప్రకారం అర్హత కలిగి ఉంటారు. ఆర్డిజి అకౌంట్ ను సింగిల్ గా లేదా అర్హత ప్రమాణాలను నెరవేర్చే మరొక రీటెయిల్ పెట్టుబడిదారుడితో ఉమ్మడిగా తెరవవచ్చు. ప్రధాన సదుపాయాలు రీటెయిల్ డైరెక్ట్ పెట్టుబడిదారులను చేర్చుకోవడము, ఆర్డిజి అకౌంట్స్ తెరవడము మరియు నిర్వహణ, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐఎల్) ద్వారా ప్రైమరీ జి-సెక్యూరిటి ఆక్షన్స్ లో నాన్ కాంపెటీటివ్ బిడ్డింగ్ లో పాల్గొనడాన్ని అనుకూలపరచడము సిసిఐఎల్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జిబీలు) ద్వారా పెట్టుబడిని అనుకూలపరచడము సిసిఐఎల్ ద్వారా సెకండరీ మార్కెట్ వాణిజ్యం మరియు అటువంటి వాణిజ్యాల సెటిల్మెంట్ కొరకు రీటెయిల్ డైరెక్ట్ పెట్టుబడిదారులకు ఎన్డిఎస్ ఓఎం ప్రాప్యతను అనుకూలపరుస్తుంది. ఈ క్రింది పెట్టుబడి సేవలను అందించడము: అకౌంట్ స్టేట్మెంట్ నామినేషన్ సదుపాయము తనఖా/తాత్కాలిక హక్కు బహుమతి లావాదేవీలు కార్పొరేట్ చర్యలను అనుకూలపరచడం, ఉదా:కూపన్ చెల్లింపులుకూపన్ చెల్లింపులు ఇతర సేవలు RBI రీటెయిల్ డైరెక్ట్ పోర్టల్ పై రెటెయిల్ డైరెక్ట్ పెట్టుబడిదారుడికి ఈ క్రింది అదనపు సేవలు అందుబాటులోకి తీసుకొని వచ్చే ప్రతిపాదన ఉంది: నామినేషన్ గిఫ్టింగ్ తనఖా/తాత్కాలిక హక్కు/బదిలీ ఫీజు మరియు ఛార్జీలు RBI తో ‘రీటెయిల్ డైరెక్ట్ గిల్ట్ అకౌంట్’ తెరచి నిర్వహించుటకు ఎలాంటి ఫీజు చెల్లించవలసిన పనిలేదు. ప్రైమరీ ఆక్షన్స్ లో బిడ్స్ సబ్మిట్ చేయుటకు అగ్రగేటర్ ఎలాంటి ఫీజు తీసుకోరు. చెల్లింపు గేట్వే మొదలైనవాటికి ఫీజు, వర్తించే విధంగా, రిజిస్టర్డ్ పెట్టుబడిదారుచే చెల్లించబడుతుంది. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్