బ్యాంక్ ఖాతాలకు నామినేషన్ నమోదు ప్రాముఖ్యత మీ ప్రియమైన వారిని ఇవాళే నామినేట్ చేయండి, వారి రేపటి భవిష్యత్తుని భద్రపరచండి. నామినేషన్ అనేది మీ ప్రియమైనవారికి మీ ఆర్థిక ఆస్తులను, మీ మరణానంతరం, ఏ అవాంతరాలూ లేకుండా పొందేలా నిశ్చింతపరుస్తుంది. మీ బ్యాంక్ ఖాతా, లాకర్ ఇంకా ఇతర ఆర్థిక ఆస్తులకు మీ నామినేషన్ నమోదు చేయించండి. నామినేషన్ వివరాలు మీ బ్యాంక్‌లో సరిచూసుకోవచ్చును. మీ బ్యాంక్ అకౌంట్‌కి నామినీని రెజిస్టర్ చేయాలని గుర్తుంచుకోండి. చనిపోయిన డిపాజిటర్(ల) క్లెయిమ్ని సులభంగా పరిష్కరించేందుకు నామినేషన్ సహాయపడుతుంది. చనిపోయిన డిపాజిటర్(ల) క్లెయిమ్ని క్లెయిమ్ అందిన తేది నుంచి 15 రోజుల లోపు బ్యాంక్ పరిష్కరించవలసి ఉంటుంది. జాయింట్ డిపాజిట్ అకౌంట్ అయితే, ఖాతాదారులు చనిపోయిన తరువాత మాత్రమే నామినీకి హక్కు ఉత్పన్నమవుతుంది. నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్