మీరు మీ ఖాతాలోకనీస బ్యాలెన్స్ఉంచదల్చుకోలేదా? బి.ఎస్.బి.డి అకౌంట్ తెరవండి. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్(బీఎస్బీడీ) ఖాతా తెరవండి. కనీస నిల్వ అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డ్ ఇంకా ప్యాన్ కార్డు లేదా ఫార్మ్ నం. 60తో సులువగా తెరవచ్చు. ఏ వ్యక్తి అయినా వారి వయసు లేదా ఆదాయంతో సంబంధం లేకుండా, ‘బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్’ (బీఎస్బీడీఏ) తెరవవచ్చు. ఈ బీఎస్బీడీ ఖాతా ఆరంభపు డిపాజిట్ ఏమీ లేకుండా తెరవచ్చు; ఈ ఖాతాలో కనీస నిల్వ ఉంచవలసిన అవసరం లేదు. వినియోగదారుని అభ్యర్థనపై ఒక మామూలు సేవింగ్స్ బ్యాంక్ ఖాతాని బీఎస్బీడీఏగా మార్చవచ్చు. బీఎస్బీడీ ఖాతాదారులకు ఏటీఎమ్-కమ్-డెబిట్ కార్డ్ వంటి ప్రాథమిక బ్యాంకింగ్ సదుపాయాలు ఉచితంగా అందించబడతాయి. బీఎస్బీడీ ఖాతాలోకి చేసుకోగల డిపాజిట్ల సంఖ్యకు పరిమితి లేదు. బీఎస్బీడీ ఖాతాదారులకు ఒక నెలలో ఏటీఎమ్ విత్డ్రాయల్స్, ఆర్ఉఈఎస్/ఎన్ఈఃటీ/క్లియరింగ్/ఇంటర్నెట్ డెబిట్లు/స్థాయీ ఆదేశాలు /ఈఎమ్ఐలు మొదలైన వాటితో కలిపి, అత్యధికంగా నాలుగు విత్డ్రాయల్స్ ఉచితంగా అనుమతించబడతాయి. బీఎస్బీడీ ఖాతాదారులకి అదే బ్యాంక్లో సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండటానికి వీల్లేదు. ఆధారం : భారతీయ రిజర్వ్ బ్యాంక్