మీ బ్యాంకునుంచి కెవైసి అప్డేట్ అలర్ట్ వచ్చిందా? చింతించకండి- కెవైసిని అప్-టు-డేట్‌గా ఉంచడం ద్వారా అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలని పొందచ్చు. మీ కెవైసిని అప్డేట్ చెయ్యడం ఎలా? మీ కెవైసిని అప్డేట్ చెయ్యడం, నూడుల్స్ చెయ్యడం అంత సులభం! ఎలా? 'కెవైసిలో మార్పు లేని' లేదా 'కేవలం చిరునామాలోనే మార్పు ఉన్న' సందర్భంలో, ఈ క్రింది వాటిలో దేనిద్వారానైనా స్వీయ-ప్రకటన చేయవచ్చ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ఐడి/మొబైల్ నంబర్ ఆన్లైన్ బ్యాంకింగ్/ మొబైల్ బ్యాంకింగ్ ఎటిఎం బ్యాంక్ వారి బిజినెస్ కరెస్పాండెంట్స్ (బిసిలు) ఉత్తరం, మొదలైనవి కెవైసి వివరాలలో ఇతర మార్పులను నవీకరించండి ఆధార్ ఓటిపి ఆధారిత ఈ-కెవైసి వీడియో కెవైసి (అందజేసిన చోట) లేదా బ్యాంకు బ్రాంచిలో అప్డేట్ చెయ్యబడిన అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలను సమర్పించడం ద్వారా ఓవిడి: ప్యాస్పోర్ట్/ డ్రైవింగ్ లైసెన్స్ / వోటర్ ఐడి కార్డ్/ ఆధార్‌కార్డ్/ఎన్ఆన్ఇజిఏ జాబ్ కార్డ్/ నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) జారీ చేసిన ఉత్తరం కెవైసి ఇప్పుడు మరింత త్వరితమైనది, సులువైనది కెవైసిని బ్యాంక్- అధీకృత ఛానెల్స్ ద్వారా అప్ డేట్ చెయ్యండి. మీకు తెలుసా? ఒకబ్యాంకులో అప్ డేట్ చెయ్యబడిన కెవైసి, సివైకెసిఆర్ ద్వారా, మిగతా అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలలోనూ అప్డేట్ చెయ్యబడుతుంది. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా