మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడం కోసం ఎవరైనా మీకు సులభమైన డబ్బును అందజూపుతున్నారా? మనీ మ్యూల్గా మారకండి! మనీ మ్యూల్ అంటే, ఇతరుల తరఫున అక్రమంగా సంపాదించిన డబ్బును ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు బదిలీ చేసే వ్యక్తి. మీ బ్యాంక్ ఖాతా = మీ డబ్బు డబ్బును బదిలీ చేయడానికి మీ బ్యాంక్ ఖాతాను ఉపయోగించడానికి ఎవరినీ అనుమతించవద్దు. మీ బ్యాంక్ ఖాతా ద్వారా డబ్బును పొందడానికి లేదా పంపించడానికి ఇతరుల్ని అనుమతిస్తే మీరు జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. మీ బ్యాంక్ వివరాలు, ఓటీపీలు, లేదా పాస్వర్డ్లను ఏ ఒక్కరితోనూ ఎప్పటికీ పంచుకోవద్దు. మీ ఖాతాను కాపాడుకోండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. సులభంగా వచ్చే డబ్బు కోసం రిస్క్ తీసుకోవడం ఎప్పటికీ మంచిది కాదు. మరింత సమాచారం కోసం దయచేసి : https://rbikehtahai.rbi.org.in/telugu/index.html పై క్లిక్ చేయండి. ఆర్బిఐ అంటుంది - విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి! ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్