ఎప్పుడు AEPS ద్వార పేమెంట్ చేస్తున్నా కూడా 3 నియమాలను గుర్తుపెట్టుకోండి. (AEPS ఆధార్ ఎనేబిల్డ్ పేమెంట్ సిస్టమ్) ఈ నియమాలని తెలుసుకోండి మరియు మోసపోకుండా కాపాడుకోండి. నియమం 1 బిజినెస్ కరస్పాండెంట్స్ /ఆపరేటర్ యొక్క ఐడి గుర్తింపుని అడిగి వాటిని ధృవీకరించుకోండి నియమం 2 వేలిముద్ర స్కానింగ్ పరికరానికి ఏదైన అదనపు కాగితం/పారదర్శక ఫిల్మ్ ఇతరములు ఏవైన అతికించబడ్డాయేమో చెక్ చేసుకోండి నియమం 3 లావదేవీ స్లిప్‌ని కచ్చితంగా అడగండి మరియు ప్రతి AEPS లావాదేవీలు అనగా విఫలమైన లావాదేవీల వివరాలని సైతం తనిఖీ చేసుకోండి గుర్తుంచుకోండి, ఒకవేళ మీ అనుమతి లేకుండా లావాదేవీ జరిగిందని SMS అందితే గనకా, వెంటనే మీ బ్యాంక్ కి రిపోర్ట్ చేయండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్