నకిలీ లోన్ వెబ్సైట్లు / యాప్ మోసాలు (Fake loan websites / App frauds) మోసపూరిత విధానం (Modus Operandi) మోసగాళ్లు తక్కువ కాలపరిమితితో తక్షణ రుణాలు (instant loans) ఇచ్చే నకిలీ లోన్ యాప్లను సృష్టిస్తారు. ఈ యాప్లు రుణగ్రహీతలను మోసం చేస్తాయి మరియు చాలా ఎక్కువ వడ్డీ రేట్లను కూడా వసూలు చేయవచ్చు. అమాయక రుణగ్రహీతలను ఆకర్షించడానికి, మోసగాళ్లు "పరిమిత కాల ఆఫర్లు" (limited period offers) అని ప్రకటనలు ఇస్తారు మరియు ఒత్తిడి పద్ధతులను ఉపయోగించి అత్యవసరంగా నిర్ణయాలు తీసుకునేలా రుణగ్రహీతలను బలవంతం చేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Precautions) సదరు రుణదాత (lender) ప్రభుత్వం / నియంత్రణ సంస్థ (Regulator) / అధీకృత సంస్థలలో నమోదై (registered) ఉన్నారో లేదో సరిచూసుకోండి. భవిష్యత్తులో వారిని సంప్రదించడం కష్టం కాకుండా ఉండటానికి, రుణదాత తమ భౌతిక చిరునామా (physical address) లేదా సంప్రదింపు సమాచారాన్ని అందించారో లేదో తనిఖీ చేయండి. రుణదాత మీ క్రెడిట్ స్కోర్లను తనిఖీ చేయడం కంటే మీ వ్యక్తిగత వివరాలను సేకరించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటే జాగ్రత్తగా ఉండండి. లోన్ దరఖాస్తును ప్రాసెస్ చేయడానికి ముందే ఎలాంటి పేరున్న NBFC లేదా బ్యాంక్ ఎప్పుడూ డబ్బులు అడగదని గుర్తుంచుకోండి. నిజమైన లోన్ ప్రొవైడర్లు రుణగ్రహీతల పత్రాలు (documents) మరియు ఇతర ఆధారాలను ధృవీకరించకుండా ఎప్పుడూ డబ్బు ఇవ్వరు. ఈ NBFC-ఆధారిత లోన్ యాప్లు అసలైనవో కాదో సరిచూసుకోండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్