స్క్రీన్ షేరింగ్ యాప్ / రిమోట్ యాక్సెస్ ఉపయోగించి జరిగే మోసాలు మోసపూరిత విధానం (Modus Operandi) మోసగాళ్లు కస్టమర్‌ను ఒక స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని మోసం చేస్తారు. అటువంటి యాప్‌ను ఉపయోగించి, మోసగాళ్లు కస్టమర్ యొక్క మొబైల్ / ల్యాప్‌టాప్‌ను చూడగలరు / నియంత్రించగలరు మరియు కస్టమర్ యొక్క ఆర్థిక ఆధారాలకు (Financial credentials) యాక్సెస్ పొందుతారు. కస్టమర్ యొక్క ఇంటర్నెట్ బ్యాంకింగ్ / పేమెంట్ యాప్‌లను ఉపయోగించి అనధికారికంగా నిధులను బదిలీ చేయడానికి లేదా చెల్లింపులు చేయడానికి మోసగాళ్లు ఈ సమాచారాన్ని ఉపయోగిస్తారు. జాగ్రత్తలు (Precautions) మీ పరికరంలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురై, మీరు ఏదైనా స్క్రీన్ షేరింగ్ యాప్‌ను డౌన్లోడ్ చేయవలసి వస్తే, మీ పరికరం నుండి అన్ని పేమెంట్ సంబంధిత యాప్‌లను నిష్క్రియం చేయండి (Deactivate) / లాగ్ అవుట్ చేయండి. కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లో కనిపించే అధికారిక టోల్-ఫ్రీ నంబర్ ద్వారా మీకు సలహా ఇచ్చినప్పుడు మాత్రమే అటువంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోండి. కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఎవరైనా తన వ్యక్తిగత కాంటాక్ట్ నంబర్ ద్వారా మిమ్మల్ని సంప్రదిస్తే అటువంటి యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దు. పని పూర్తయిన వెంటనే, మీ పరికరం నుండి స్క్రీన్ షేరింగ్ యాప్ తొలగించబడిందని (Removed) నిర్ధారించుకోండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్