ఆన్లైన్ ఉద్యోగ మోసం (Online job fraud) మోసపూరిత విధానం (Modus Operandi) మోసగాళ్లు నకిలీ ఉద్యోగ అన్వేషణ వెబ్సైట్లను సృష్టిస్తారు. ఉద్యోగార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో ఈ వెబ్సైట్లలో తమ బ్యాంక్ ఖాతా / క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్‌ల సురక్షిత ఆధారాలను (credentials) పంచుకున్నప్పుడు, వారి ఖాతాలు హ్యాక్ చేయబడతాయి/ప్రమాదంలో పడతాయి. మోసగాళ్లు పేరున్న కంపెనీల ప్రతినిధులుగా నటిస్తూ, నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలను ఇస్తామని నమ్మిస్తారు. ఆ తర్వాత రిజిస్ట్రేషన్, తప్పనిసరి శిక్షణా కార్యక్రమం (training program), ల్యాప్‌టాప్ మొదలైన వాటి కోసం డబ్బు బదిలీ చేయమని ఉద్యోగార్థిని ప్రేరేపిస్తారు. జాగ్రత్తలు (Precautions) విదేశీ సంస్థల నుండి వచ్చే ఆఫర్లతో సహా ఏ ఉద్యోగ ఆఫర్ కోసమైనా, ముందుగా సదరు ఉద్యోగం ఇచ్చే కంపెనీ / దాని ప్రతినిధి యొక్క గుర్తింపు మరియు సంప్రదింపు వివరాలను (contact details) నిర్ధారించుకోండి. ఉద్యోగం ఇస్తున్నందుకు ఏ అసలైన (genuine) కంపెనీ కూడా ఎప్పుడూ డబ్బు అడగదని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. తెలియని ఉద్యోగ అన్వేషణ వెబ్సైట్లలో ఎటువంటి చెల్లింపులు చేయవద్దు. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్