ఆర్థిక లావాదేవీల విషయంలో తీసుకోవాల్సిన సాధారణ జాగ్రత్తలు సాధారణ జాగ్రత్తలు (General Precautions) ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు కనిపించే అనుమానాస్పద పాప్-అప్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ చెల్లింపులు చేసే ముందు ఎల్లప్పుడూ సురక్షితమైన పేమెంట్ గేట్‌వే (https:// - ప్యాడ్‌లాక్ గుర్తు ఉన్న URL) ఉందో లేదో తనిఖీ చేయండి. మీ పిన్ (PIN), పాస్వర్డ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్, సీవీవీ (CVV) మొదలైన వాటిని రహస్యంగా ఉంచండి. ఈ సమాచారాన్ని బ్యాంకులు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కూడా పంచుకోవద్దు. వెబ్సైట్లు, పరికరాలు లేదా పబ్లిక్ ల్యాప్‌టాప్‌లు/డెస్క్‌టాప్‌లలో కార్డ్ వివరాలను సేవ్ చేయవద్దు. టూ-ఫాక్టర్ అథెంటికేషన్ (Two-factor authentication) సౌకర్యం ఉన్న ప్రతిచోటా దానిని ఆన్ చేసుకోండి. తెలియని వ్యక్తుల నుండి వచ్చే ఈమెయిల్‌లను ఎప్పుడూ తెరవద్దు మరియు వాటికి స్పందించవద్దు. వీటిలో అనుమానాస్పద అటాచ్మెంట్లు లేదా ఫిషింగ్ లింక్‌లు ఉండవచ్చు. చెక్‌బుక్, కేవైసీ (KYC) పత్రాల ప్రతిలను (Copies) తెలియని వ్యక్తులతో పంచుకోవద్దు. పరికరం / కంప్యూటర్ భద్రత కొరకు (For device / computer security) క్రమ విరామాలలో (క్రమం తప్పకుండా) పాస్‌వర్డ్‌లను మార్చండి. మీ పరికరాలలో యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయండి మరియు అప్డేట్లు అందుబాటులో ఉన్నప్పుడల్లా వాటిని అప్డేట్ చేయండి. తెలియని యుఎస్బి (USB) డ్రైవ్‌లు/పరికరాలను ఉపయోగించే ముందు ఎల్లప్పుడూ స్కాన్ చేయండి. మీ పరికరాన్ని అన్‌లాక్ చేసి వదిలివేయవద్దు. నిర్దిష్ట సమయం తర్వాత పరికరం ఆటోమేటిక్‌గా లాక్ అయ్యేలా (Auto lock) కాన్ఫిగర్ చేయండి. మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో తెలియని అప్లికేషన్లు లేదా సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయవద్దు. పరికరాలలో పాస్వర్డ్లు లేదా రహస్య సమాచారాన్ని నిల్వ (Store) చేయవద్దు. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్