ఓటీపీ ఆధారిత మోసాలు (OTP based Frauds) మోసపూరిత విధానం (Modus Operandi) మోసగాళ్లు తాము ఎన్బీఎఫ్సీ (NBFC) ప్రతినిధులమని చెప్పుకుంటూ, ఎన్బీఎఫ్సీ లేదా బ్యాంక్ కస్టమర్ల రుణ ఖాతాలపై రుణాలు లేదా క్రెడిట్ పరిమితిని పెంచుతామని సందేశాలు (SMS/messages) పంపుతారు. అలాగే ఒక మొబైల్ నంబరులో తమను సంప్రదించమని కస్టమర్లను కోరతారు. కస్టమర్లు ఆ నంబర్లకు ఫోన్ చేసినప్పుడు, వారి ఆర్థిక వివరాలను సేకరించడానికి ఫారమ్‌లను నింపమని మోసగాళ్లు అడుగుతారు. ఆ తర్వాత వారు కస్టమర్లను ఒప్పించి లేదా భయపెట్టి ఓటీపీ (OTP) లేదా పిన్ (PIN) వివరాలను పంచుకునేలా చేస్తారు మరియు కస్టమర్ల ఖాతాల నుండి అనధికారికంగా డబ్బును బదిలీ చేసుకుంటారు. జాగ్రత్తలు (Precautions) ఓటీపీ (OTP), పిన్ (PIN) లేదా వ్యక్తిగత వివరాలను ఎట్టిపరిస్థితుల్లోనూ, మీ స్వంత స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సహా ఎవరితోనూ పంచుకోవద్దు. మీ ప్రమేయం లేకుండా ఎలాంటి ఓటీపీలు జనరేట్ కాలేదని నిర్ధారించుకోవడానికి మీ ఎస్ఎంఎస్ (SMS) మరియు ఈమెయిల్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. బ్యాంక్, ఎన్బీఎఫ్సీ (NBFC) లేదా ఈ-వాలెట్ ప్రొవైడర్ యొక్క సేవలను పొందడానికి లేదా ఉత్పత్తులు మరియు సేవల గురించిన సమాచారం, స్పష్టత కోసం ఎల్లప్పుడూ వారి అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సందర్శించండి లేదా నేరుగా బ్రాంచ్‌ను సంప్రదించండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్