మోసగాళ్ల ద్వారా రుణాలు ఇప్పిస్తామంటూ నకిలీ ప్రకటనలు మోసం చేసే విధానం నకిలీ ప్రకటనలు: మోసగాళ్లు చాలా తక్కువ వడ్డీ రేట్లు, సులభమైన వాయిదాల పద్ధతి లేదా ఎటువంటి షూరిటీ (హామీ) అవసరం లేదంటూ నకిలీ పర్సనల్ లోన్ ప్రకటనలను ఇస్తారు. నకిలీ ఈమెయిల్స్: బాధితులకు నమ్మకం కలిగించడానికి ప్రముఖ బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల (NBFCs) ఉన్నతాధికారుల పేర్లతో సరిపోలే నకిలీ ఈమెయిల్ ఐడీల నుండి ఈమెయిల్స్ పంపుతారు. ముందస్తు ఫీజులు: లోన్ కోసం సంప్రదించినప్పుడు ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ (GST), ఇంటర్సిటీ ఛార్జ్ లేదా ముందస్తు ఈఎంఐ (EMI) పేరుతో ముందుగానే డబ్బులు వసూలు చేసి, లోన్ ఇవ్వకుండా పరారవుతారు. నకిలీ వెబ్సైట్లు: ప్రజలు ఇంటర్నెట్లో లోన్ల కోసం వెతికేటప్పుడు కనిపించేలా నకిలీ వెబ్సైట్ లింక్‌లను సృష్టిస్తారు. జాగ్రత్తలు ఫీజు మినహాయింపు: అసలైన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు లోన్ ప్రాసెసింగ్ ఫీజును మీకు మంజూరైన లోన్ మొత్తం నుండి మినహాయించుకుంటాయి. అంతేగానీ, విడిగా ముందే నగదు రూపంలో అడగవు. ముందస్తు చెల్లింపులు వద్దు: లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కాకముందే ఏ బ్యాంకూ ముందస్తు ఫీజు అడగదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముందే డబ్బులు చెల్లించవద్దు. వివరాల ధృవీకరణ: తక్కువ వడ్డీ రేట్ల ఆఫర్లను నమ్మి అధికారిక మూలాల ద్వారా పూర్తిగా నిజానిజాలు తెలుసుకోకుండా ఎటువంటి డబ్బులు చెల్లించవద్దు లేదా మీ వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దు. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్