సిమ్ మార్పిడి / సిమ్ క్లోనింగ్ (SIM swap / SIM cloning) పనిచేసే విధానం (Modus Operandi) మోసగాళ్ళు కస్టమర్ యొక్క సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మోడ్యూల్ (SIM) కార్డ్‌ని పొందుతారు లేదా కస్టమర్ బ్యాంక్ ఖాతాకు అనుసంధానించబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కోసం నకిలీ సిమ్ కార్డ్‌ని (ఎలక్ట్రానిక్-SIMతో సహా) పొందవచ్చు. మోసగాళ్ళు అనధికారిక లావాదేవీలను నిర్వహించడానికి అటువంటి నకిలీ సిమ్‌పై వచ్చిన OTPని ఉపయోగిస్తారు. మోసగాళ్ళు సాధారణంగా టెలిఫోన్ / మొబైల్ నెట్వర్క్ సిబ్బందిగా నటిస్తూ కస్టమర్ నుండి వ్యక్తిగత / గుర్తింపు వివరాలను సేకరిస్తారు. సిమ్ కార్డ్‌ని 3G నుండి 4Gకి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయడం లేదా సిమ్ కార్డ్‌పై అదనపు ప్రయోజనాలను అందించడం వంటి ఆఫర్ల పేరుతో కస్టమర్ వివరాలను అడుగుతారు. జాగ్రత్తలు (Precautions) మీ సిమ్ కార్డ్‌కు సంబంధించిన గుర్తింపు ఆధారాలను (identity credentials) ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోకండి. మీ ఫోన్లో మొబైల్ నెట్వర్క్ యాక్సెస్ గురించి జాగ్రత్తగా ఉండండి. సాధారణ వాతావరణంలో మీ ఫోన్లో ఎక్కువ సమయం మొబైల్ నెట్వర్క్ లేకపోతే, మీ మొబైల్ నంబర్ కోసం ఎటువంటి నకిలీ సిమ్ జారీ చేయబడలేదని నిర్ధారించుకోవడానికి వెంటనే మొబైల్ ఆపరేటర్‌ను సంప్రదించండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్