ఆర్బీఐ బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ ద్వారామీ బ్యాంకింగ్ ఫిర్యాదులన్నీ పరిష్కరించుకోండి ఆర్బీఐ వారి బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ వద్దకు వెళ్లండి – వారు బ్యాంకింగ్‌లో థర్డ్ అంపైర్ వంటివారు . రిజర్వ్ బ్యాంక్ – సమగ్ర అంబుడ్స్‌మన్ పథకం (Integrated Ombudsman Scheme) ఆర్బీఐ నియంత్రణలో ఉన్న సంస్థలకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒకే వేదిక. ఆర్బీఐ నియంత్రణలో ఉన్న బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు (NBFCs), సిస్టమ్ పార్టిసిపెంట్లు మీ ఫిర్యాదును 30 రోజుల్లోగా పరిష్కరించకపోయినా, లేదా వారు అందించిన పరిష్కారం మీకు సంతృప్తికరంగా లేకపోయినా, మీరు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. మీ ఫిర్యాదును ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా దాఖలు చేయండి. ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ (CMS) పోర్టల్ ద్వారా: మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు. ఫిర్యాదు స్వీకరించినట్లు రశీదు పొందవచ్చు. మీ ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం 14448కు కాల్ చేయండి. ఫిర్యాదు నమోదు చేయడానికి: RBI CMS పోర్టల్ ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్