దివ్యాంగ పిల్లల అవసరాలకు అనుగుణంగా బాల్యారంభ ప్రేరణ కృత్యాలు (0-3 సం.లు) పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాల పిల్లల కోసం 140 కృత్యాల జాబితాను బాల్యారంభ ప్రేరణ కోసం నేషనల్ ఫ్రేమ్‌వర్క్ సూచిస్తుంది. ఇది పిల్లల అభిజ్ఞా, సామాజిక-భావోద్వేగ, భాష, శారీరక మరియు సృజనాత్మక అభివృద్ధికి సంపూర్ణ ప్రేరణను అందిస్తుంది. అయితే, అభివృద్ధిలో జాప్యాలను పరిష్కరించడానికి (ఉదా: ఒక పిల్లవాడు నడవడానికి లేదా మాట్లాడటానికి ఎక్కువ సమయం పట్టవచ్చు మరియు సూక్ష్మ చలన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లేదా కొత్త సమాచారాన్ని గ్రహించడంలో సహాయం అవసరం కావచ్చు) మరియు ఇతర వైకల్యాలు (ఉదాహరణకు, దృష్టి లోపం, వినికిడి లోపం, డౌన్ సిండ్రోమ్, లేదా సెరిబ్రల్ పాల్సి) సూచించిన కృత్యాలు క్రింది సూత్రాల ఆధారంగా రూపొందించబడ్డాయి: అభ్యాసం చేయడానికి ఏది బలోపేతం చేయాలి? ఉదా: మాటలు రావటంలో ఆలస్యం ఉన్నట్లయితే నోటి కండరాలను బలోపేతం చేయాలి. సరిచేయలేని వైకల్యం ఉన్నట్లయితే వేరే ఇంద్రియాలను ఉపయోగించడం. ఒక బహుఇంద్రియ విధానం, i.e. విజువల్ ఆడిటరీ కైనెస్తెటిక్ అండ్ టాక్టైల్ (VAKT) ఇది మెరుగైన అభ్యాసానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, అభినయ గీతాల ద్వారా ఒకే సమయంలో మాట్లాడటం (శ్రవణ), చేతి మరియు శరీర కదలికలు (కైనెస్తెటిక్) చేయడం జరుగుతుంది. చిత్రాలు (దృశ్య) మాట్లాడటం (శ్రవణ) మరియు చేతులతో సంబంధిత హస్తకళల కార్యకలాపాలు (స్పర్శ) చేయడం ద్వారా ఒక భావనను నేర్పండి. నమూనాలను నేర్పడానికి, కర్రలు, రాళ్ళు, బొమ్మలు, బ్లాక్స్ వంటి అందుబాటులో ఉన్న వస్తువులను ఉపయోగించండి. ఆపై కాగితం-పెన్సిల్ తో చేసే పనులకు వెళ్ళండి. ఉదా: అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల ఊహాశక్తిని నిమగ్నం చేయడానికి కథల పుస్తకాలను చదివి వినిపించాలి. పిల్లలు అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే, నిదానముగా వేలితో పదాలను అనుసరిస్తూ చదవండి. వినికిడి లోపం ఉన్నవారి కోసం ప్రకాశవంతమైన రంగుల చిత్రాలను, దృష్టి లోపం ఉన్నవారికి స్పర్శను ఉపయోగించి వినిపించండి. వినికిడి సమస్య ఉన్న పిల్లలు చూడటానికి చిత్రాలు, వీడియోలు మరియు వస్తువులను ఉపయోగించండి. ఉదా: తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గొప్ప వ్యక్తులు, అరుదైన జంతువులు, మొక్కలు, చారిత్రక ప్రదేశాలు, సంఘటనలు మొదలైన వాటి చిత్రాలు/ఛాయాచిత్రాలను వార్తాపత్రికలు, పత్రికలు, పుస్తకాలు మొదలైన వాటి నుండి చూపించండి. బాగా చూడలేని పిల్లల కోసం పాటలు, పద్యాలు, లాలిపాటలు, రేడియో, చప్పట్లు కొట్టడం, క్లిక్ చేయడం, సంగీత వాయిద్యాలు మొదలైన సంగీతం లేదా రికార్డింగుల వంటి ధ్వనులను ఉపయోగించండి. అభివృద్ధి జాప్యాలు ఉన్న పిల్లలు బిడ్డకు 3 సంవత్సరాలు వచ్చేవరకు, ప్రతి నెల నాలుగు కృత్యాలను కార్యాచరణ క్యాలెండర్లో పొందుపరచడం జరిగింది. ఈ కృత్యాలు వయస్సుకు అనుగుణంగా బిడ్డ చేరుకోవలసిన అభివృద్ధి మైలురాళ్ల ఆధారంగా ఎంపిక చేయబడ్డాయి. అయితే, కొంతమంది పిల్లలు ఒక మైలురాయిని చేరుకోవడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టవచ్చు, దీనినే 'అభివృద్ధిలో జాప్యం' అని పిలుస్తారు. ఆలస్యం అయిన పిల్లలకు మద్దతు ఇవ్వడానికి పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా సంరక్షకులు కృత్యాలను సవరించవచ్చు, ఇది వారి స్థాయికి తగిన వేగంతో అభివృద్ధి మైలురాయిని చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒక పిల్లవాడు క్యాలెండర్ వారి వయస్సు కోసం సిఫార్సు చేసిన కృత్యాన్ని చేయలేకపోతే, సంరక్షకులు వారి కంటే చిన్నపిల్లల కోసం సిఫార్సు చేసిన కార్యకలాపాలను ఎంచుకోవాలి. ఉదాహరణ 1: 14 నెలల వయస్సులో, పిల్లవాడు మద్దతు లేకుండా నడవలేకపోవడం వల్ల దొంగ –పోలీస్ (హైడ్ అండ్ సీక్) వంటి క్యాలెండర్లో సిఫార్సు చేయబడిన కృత్యాలను నిర్వహించలేకపోవచ్చు. అనుసరణ 1: అటువంటి సందర్భాలలో సంరక్షకుడు, ఆరు లేదా ఏడు నెలల వయస్సు గల పిల్లలకు సిఫార్సు చేయబడిన కృత్యాలను ఎంచుకోవాలి. 'ఇంటిని చేరుకోవడం, లోపలికి మరియు బయటికి రావడం మొదలైనవి'. దీనికి పిల్లవాడు ప్రాకుతూ నెమ్మదిగా వారి నడక సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఉదాహరణ 2: 20-25 నెలల వయస్సులో, ఇంకా మాట్లాడలేని పిల్లవాడు క్యాలెండర్లో వారికి సిఫార్సు చేసిన కృత్యాలలో, 'ఫోన్లో మాట్లాడటం వంటి వాటిలో' పాల్గొనలేకపోవచ్చు. అనుసరణ 2: సంరక్షకులు, అటువంటి సందర్భాలలో, క్యాలెండర్లో ఒక సంవత్సరం వయస్సు ఉన్న పిల్లల కోసం సూచించిన కృత్యాలను ఎంచుకోవాలి. వారు చేసే సంజ్ఞలను తిరిగి చేయవలసి ఉంటుంది. ఉదా: చర్యలను అనుసరించడం లేదా దాక్కోవడం మరియు కనుగొనడం మొదలైనవి ఉంటాయి. అదనంగా, సంరక్షకుడు ఈ చర్యను చాలాసార్లు పునరావృతం చేయడానికి ప్రయత్నించాలి. అలా చేసేటప్పుడు, పిల్లల ప్రతిస్పందనలకు ఓపికగా, శ్రద్ధగా ఉండండి. పిల్లలపై చిరాకు ప్రదర్శించకుండా, సానుకూల ప్రోత్సాహం ఇవ్వండి. వైకల్యాల యొక్క ప్రారంభ సంకేతాలు మరియు లక్షణాలు కలిగిన పిల్లలు అటువంటి సందర్భాలలో, పిల్లలు ఏ వయస్సు వారైనా, వారి సామర్థ్యాలకు అనుగుణంగా కృత్యాలను సవరించవచ్చు. ఈ మార్పు పిల్లవాడికి ప్రోత్సాహకంగా, ఆనందదాయకంగా, పెరుగుదల మరియు అభివృద్ధికి దోహదం చేసేలా నిర్మించుకోండి.వివిధ రకాల వైకల్యాలకు అనుగుణంగా కృత్యాలను సవరించే కొన్ని మార్గాలను దిగువ పట్టికలో పొందుపరచడం జరిగింది. వైకల్యం రకం ఇప్పటికే ఉన్న కార్యాచరణకు ఉదాహరణ సూచించిన సవరణ సూక్ష్మచలనం 7 నెలల పిల్లవాడికి 'బంతి వరకు చేరుకోవడం' సిఫార్సు చేయబడింది. అంగన్వాడీ కార్యకర్త పిల్లల చేతి పనితీరును మెరుగుపరచడానికి, పట్టుకోవడానికి, ఆడుకోవడానికి మృదువైన వస్తువులను (మట్టి, స్పాంజ్ బంతి వంటివి) ఉపయోగించవచ్చు. దృష్టిలోపం 12 నెలల పిల్లల కోసం ఇంటి గురించి తెలియచేయటం సిఫార్సు చేయబడింది. పిల్లల మిగిలిన ఇంద్రియాలను ప్రేరేపించడానికి, వారి పరిసరాలను గ్రహించడంలో సహాయపడటం కోసం, సంరక్షకుడు ఇంటిని మౌఖికంగా, వీలైనంత వివరంగా వివరించవచ్చు. వినికిడి లోపం సూచనలను అనుసరించటం అనేది 14 నెలల పిల్లల కోసం సిఫార్సు చేయబడింది సంరక్షకుడు కృత్యం యొక్క ప్రతి సూచన/దశను చాలాసార్లు పునరావృతం చేయాలి; అదే సమయంలో వారు ఏమి చెబుతున్నారో అనుసరించగలిగే పిల్లలకు పెదవి కదలికలను చదవడం నేర్పించాలి. ఒకరి నోటిని సూచించి, పిల్లవాడు నోటి కదలికలను గమనించేలా చేయండి. మాట్లాడటం మరియు భాషా నైపుణ్యాలు నటించే ఆట: ఫోన్ లో మాట్లాడటం అనేది 25 నెలల పిల్లవాడికి సిఫార్సు చేయబడింది సంరక్షకుడు నోటి కండరాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి కొన్ని వ్యాయామాలతో కృత్యాలను ప్రారంభించవచ్చు, అనగా ఫూత్కరించడం, బిగ్గరగా నవ్వడం, నోటి లోపల నాలుకను అటు ఇటు కదిలించడం, దవడ తెరవడం మరియు మూయడం మొదలైనవి.నాటకీకరణ: ఫోన్ లో మాట్లాడే కృత్యాన్ని నిర్వహిస్తున్నప్పుడు, సంరక్షకుడు తక్కువ పదాలతో ఉన్న చిన్న వాక్యాలను ఉపయోగించాలి. బిడ్డ సంరక్షకుడు మాట్లాడేది గమనించి మరియు నెమ్మదిగా పదాలను పునరావృతం చేయమని ప్రోత్సహించాలి. మేధోపరమైన మరియు అభివృద్ధి ఆలస్యం 16 నెలల పిల్లల కోసం సిఫార్సు చేయబడిన సూచనలను అనుసరించండి పిల్లలు సులభంగా అనుసరించడానికి వీలుగా సంరక్షకుడు సూచనలను సరళమైన దశలుగా విభజించవచ్చు. సంరక్షకుడు పిల్లలు గమనించడానికి, అనుకరించడానికి, నేర్చుకోవడానికి వీలుగా ప్రతి దశను ప్రదర్శించి చూపించాలి. తద్వారా పిల్లలలో స్వతంత్రత పెంపొందుతుంది. మూడు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల్లో అభివృద్ధిలో ఆలస్యం మరియు దివ్యాంగులైన పిల్లలకు మద్దతు ఇవ్వడంలో అంగన్వాడీ కార్యకర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పిల్లలలో వైకల్యాలు అభివృద్ధి చెందకుండా నిరోధించడానికి ప్రసవం ముందు, ప్రసవానికి కొన్ని రోజుల ముందు లేదా వెంటనే మరియు ప్రసవానంతర దశలలో తగిన చర్యలు తీసుకోవడం అనేది అత్యంత క్రిష్టమైన మరియు ప్రాథమిక అంశం. దీన్ని చేయడానికి ఒక కీలకమైన మార్గం ఏమిటంటే, ఇంట్లో, తల్లిదండ్రులతో మరియు అంగన్వాడీ కేంద్రం లేదా క్రెచ్ లో పుట్టినప్పటి నుండి మూడు సంవత్సరాలవరకు కార్యకర్తలతో బాల్యారంభ ప్రేరణ కృత్యాలను ప్రోత్సహించడం. అయితే, ఒక పిల్లవాడు వైకల్యంతో జన్మించినా లేదా తగినంత సంరక్షణ ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్నట్లయితే, అటువంటి సందర్భంలో, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క దివ్యాంగ ప్రోటోకాల్ లో పేర్కొన్నవిధంగా కమ్యూనిటీ వర్కర్ తప్పనిసరిగా 'స్క్రీనింగ్-ఇన్‌క్లూజన్-రిఫరల్' అనే కీలకమైన ప్రక్రియను అనుసరించాలి. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ