25 నెలల పిల్లల ప్రేరణ కృత్యాల క్యాలెండర్ ఇది నీలం రంగులో ఉందా లేదా వస్తువులు: ఏమీ లేవు. దశలు ఎరుపు రంగును పునః సమీక్షించడం ద్వారా ప్రారంభించండి. పిల్లలు ఎరుపు రంగు గుర్తించి, ఆ రంగులో ఉన్న వస్తువులను, వాని లక్షణాలను గుర్తు చేయండి. విడ సరిగా చెప్పగానే అది సరైన సమాధానం 'ఇది ఎరుపు రంగు' అని వారి విజయ్నాన్ని కలిసి జరుపుకోండి. నీల రంగులో ఉన్న వస్తువుల ఉదాహరణలు చెబుతూ, వేలితో ఆ వస్తువులను చూపిస్తూ నీలం రంగుని బిడ్డకు పరిచయం చేయండి. నీలం రంగుని సోంతమాట పదాలతో సరధాగా బిడ్డకు వివరించండి. రకరకాల వస్తువులను బిడ్డకు చూపిస్తూ అది నీలర్ రంగులో ఉందా లేదా అని అడగండి. బిడ్డ ప్రతిస్పందించేలా ప్రోత్సహించండి. ఎరుపు రంగపై బిడ్డకు గల అవగాహనను బలోపేతం చేస్తూ, సరైన సమాధానాన్ని గుర్తిండండి. సరైన సమాధానాల కోసం బిడ్డకు సానుకూల మద్ధతును అందించండి, వారికి సరైన సమాధానం చెప్పడంలో కష్టంగా అనిపిస్తే సున్నితంగా మార్గనిర్దేశం చేయండి. కృత్యం ప్రాధాన్యత: గతంలో నేర్చుకున్న అభ్యాసంపై ఆధారపడి, వరుస క్రమంలో రంగులు నేర్చుకోవడం అనే ప్రక్రియ ఆధారపడి ఉంటుంది. గతంలో నేర్చుకున్న రంగుని గుర్తు చేయడం ద్వారా పిల్లల్లో రంగుల భావనలపై సంపూర్ణ అవగాహన పెంపొందుతుంది. పైన మరియు క్రింద గురించి తెలుసుకోవడం వస్తువులు: చదువుకునే కుర్చీ, పరుపు లేదా సోఫా. దశలు ఒక సురక్షితమైన ప్రదేశంలో చదువుకునే కుర్చీ, పరుపు లేదా సోఫాను కానీ ఉంచండి. బిడ్డను వాటి మీదకి ఎక్కే విధంగా ప్రోత్సహించండి. అవసరమైతే సహాయం అందించండి. బిడ్డ వాటి మీద కి ఎక్కగానే ఆ విజయాన్ని సానుకూలమైన పదాలతో చిరునవ్వుతో కలిపి జరుపుకోండి. బిడ్డకు భద్రత గురించి నొక్కి చెబుతూ కిందకు దిగడంలో మార్గనిర్దేశం చేయండి. ఆత్మవిశ్వాసాన్ని మరియు సమన్వయాన్ని పెంపొందించేలా ఆ కృత్యాలను పునరావృతం చేయండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం పిల్లలకు సురక్షిత వాతావరణంలో శారీరక సవాలును అందిస్తుంది. శారీరక శ్రమ పట్ల సానుకూల వైఖరిని, సమన్వయాన్ని మరియు సాధించిన భావాన్ని పెంపొందిస్తుంది. ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించడం వస్తువులు: ఫోను లేదా బొమ్మ టెలిఫోన్. దశలు బిడ్డతో పాటు కూర్చుని ఒకటితో ఒకరు మాట్లాడుకోవడానికి 'ఒక ప్రత్యేక ఫోన్ తీసుకుందాం' అని చెప్పి ఫోను లేదా బొమ్మఫోన్ ని బిడ్డకు పరిచయం చేయండి. ఫోను ఎలా పట్టుకోవాలో బిడ్డకు చూపించి సంభాషణ ప్రారంభించాలి.. 'రింగ్.. రింగ్.. హలో బేబీ ఎం చేస్తున్నావ్' ?అని బిడ్డను అడగండి. సరళమైన పదబంధాలను ఉపయోగించి నటనా సంభాషణలో బిడ్డతో కలిసి పాల్గొనండి. 'నేను ఆడుతున్నాను' అని మీ బిడ్డను తిరిగి సమాధానం చెప్పేలా ప్రోత్సహించండి. వారి నటనాసంభాషణ గుర్తించడానికి సానుకూల పదాలను ఉపయోగించండి. బిడ్డతో మీరు: 'ఈ రోజు ఏమి చేసావో వినటం నాకు చాలా ఇష్టం' "నువ్వు ఫోన్ చాలా బాగా మాట్లాడుతున్నావు" అని చెప్పండి. కృత్యం ప్రాధాన్యత: తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య అనుబంధం మరియు కమ్యూనికేషన్ పెంపొందుతుంది. పిల్లలు తమ భావాలు తాము వ్యక్తీకరించడానికి, పంచుకోవడానికి, సృజనాత్మకతకు ఈ ఫోన్ సంభాషణ పిల్లలకు సరదాగా అనిపిస్తుంది. ఆకారాలను సరి పోల్చటం వస్తువులు: కాగితం లేక అట్ట ముక్క, క్రేయాన్స్ లేక ఇతర రంగులు. దశలు రెండు కాగితాలు లేదా అట్టముక్కలపై త్రిభుజం, వృత్తం, చతురస్రాన్ని గీయండి. ఒక కాగితం లోని ఆకారాలను కత్తిరించండి. కత్తిరించిన ఆకారాలను, మొదటి కాగితంపై ఉన్న ఆకారాలపై ఉంచడం ద్వారా ఆ రెండిటిలో ఉన్న ఆకారాలను సరిపోల్చమని బిడ్డను అడగండి. బిడ్డ ఆకారాలను సరిపోల్చుతున్నప్పుడు వాటి పేర్లను చెప్పండి. బిడ్డలు ఎలా సరిపోల్చాలో చూపించడం ద్వారా ఇతర ఆకృతులను సరి పోల్చే సామార్ధ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టండి. బిడ్డను 'సొంతంగా ప్రయత్నించమని' ప్రోత్సహించండి. వారి సృజనాత్మకతను మరియు కృషిని అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: చిన్నచిన్న పజిల్స్ పరిష్కరించడం ద్వారా పిల్లలలో ఆలోచనాకోశం మెరుగుపడుతుంది. ఆకారాల పేర్లు, 'పైన' వంటి పదాలను ఉపయోగించడం వలన పదాలు మరియు పదబంధాలు నేర్చుకోవడం జరుగుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ