ఇది పసుపు రంగులో ఉందా లేదా? వస్తువులు: ఏమీ లేవు. దశలు ఎరుపు మరియు నీలం రంగులను పునఃసమీక్షించడం ద్వారా ప్రారంభించండి. పిల్లలకు వాటి రంగులలో ఉన్న వస్తువుల లక్షణాలను గుర్తు చేయండి. బిడ్డకు పసుపు రంగును పరిచయం చేయండి. ఉదా: చుట్టుపక్కల/పసుపు రంగులో ఉన్న వస్తువులను చూపించండి. పసుపు రంగును సానుకూల పదాలతో సరదాగా బిడ్డకు వివరించండి. వివిధ రకాల పసుపు రంగులో ఉన్న వస్తువులను చూపించి ఇది పసుపు రంగులో ఉందా అని బిడ్డను అడగండి.ప్రతిస్పందించడానికి బిడ్డను ప్రోత్సహించండి. ఎరుపు, నీలం రంగుల గురించి బిడ్డకు ఉన్న అవగాహనను బలోపేతం చేయండి. వారు ఎరుపు, నీలం రంగుల గురించి చెప్పిన సమాధానాన్ని గుర్తించండి. గతంలో నేర్చుకున్న ఎరుపు, నీలం రంగులను పునఃసమీక్షించి సరైన సమాధానం బిడ్డ చెప్పనప్పుడు 'నిజమే, ఇది ఎరుపు', 'ఇది నీలం' అని చెప్పండి. కృత్యం ప్రాధాన్యత: గతంలో నేర్చుకున్న అభ్యాస పునాదిపై, వరుస క్రమంలో నేర్చుకునే రంగుల కృత్యం ఆధారపడి ఉంటుంది. గతంలో నేర్చుకున్న వాటిని తిరిగి అడగటం వలన రంగుల భావనల గురించి బిడ్డకు చక్కటి అవగాహన కలుగుతుంది. ఇంద్రియ ఆట (Sensory play) వస్తువులు: ఇసుక లేక మట్టి, కప్పులు, బకెట్లు, పాత్రలు. దశలు ఇసుక లేదా మట్టితో ఒక ఆట స్థలాన్ని ఏర్పాటు చేయండి. ఇసుక లేదా మట్టి బదిలీ చేయడానికి కప్పులు లేదా బకెట్లను బిడ్డకు అందించండి. ఇసుకను లేదా మట్టిని ఒక పాత్ర నుండి మరొక పాత్రలో వేయడానికి ప్రోత్సహించండి. ఇసుక లేదా మట్టి యొక్క స్పర్శ, ఆకృతి, అనుభూతులను బిడ్డ వివరించేలా చూడండి. బిడ్డను వివిధ రకాల పద్ధతులతో ఇసుక లేదా మట్టిని తీయడం, పోయడం చేయనివ్వండి. మట్టితో, ఇసుకతో చిందరవందరగా ఉన్న ప్రాంతాన్ని, బిడ్డతో కలిసి ఆ పదార్థాలను తాకి ఆడుకునే సమయాన్ని ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: రకరకాల పదార్థాలను తాకడం ద్వారా ఇంద్రియ గ్రహణ అనుభూతి కలుగుతుంది. పదార్థాలు తీయడం, పోయడం ద్వారా సూక్ష్మ కండరాల అభివృద్ధి జరుగుతుంది. ఆడుకునేటప్పుడు సృజనాత్మకంగా, ఊహించుకోవడానికి దోహదపడుతుంది. మీ బాల్యం గురించి కథ చెప్పండి వస్తువులు: ఏమీ లేవు. దశలు సౌకర్యవంతమైన మరియు హాయిగా ఉండే ప్రదేశంలో మీ బిడ్డతో కలిసి కూర్చోండి. మీ బాల్యం గురించి సాధారణమైన మరియు ఆసక్తికరమైన కథను బిడ్డతో పంచుకోండి. మీరు చెప్పే కథ, బిడ్డకు సజీవంగా కళ్ళ ముందు కదిలేలా చేయడానికి హావభావాలను, స్వరాలను ఉపయోగించి వ్యక్తీకరించండి. బిడ్డ ప్రశ్నలు అడగడానికి, ఆలోచనలు మీతో పంచుకోవడానికి ప్రోత్సహించండి."వారు మరొక కథను వినాలనుకుంటున్నారా?" అనే ప్రశ్నను అడగటం ద్వారా కథను ముగించండి. కృత్యం ప్రాధాన్యత: తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. ఊహాశక్తిని పెంచుతుంది. భాషాభివృద్ధి పెరగడానికి దోహదపడుతుంది. కలిసి నృత్యం చేద్దాం వస్తువులు: సంగీతం, రేడియో. దశలు రేడియో నుండి సంగీతాన్ని వినిపించండి. బిడ్డ రెండు చేతులు పట్టుకుని, ఇద్దరూ కలిసి నృత్యం చేయండి. సంగీతానికి అనుగుణంగా తల, కాళ్ళు మరియు చేతులు లయబద్ధంగా కదిలించేలా బిడ్డను ప్రోత్సహించండి. నృత్యాన్ని దినచర్యగా లేదా సంగీత ధ్వనులను అనుసరిస్తూ నృత్యం చేసేలా చూడండి. ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులు కూడా పాల్గొనేలా చేసి అందరూ కలిసి సంతోషకరమైన నృత్య వేడుకను నిర్వహించండి. కృత్యం ప్రాధాన్యత: శారీరక చలనాలు మరియు సమన్వయాన్ని పెంపొందిస్తుంది. లయ మరియు సంగీతం పట్ల అవగాహన మెరుగుపరుస్తుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ