రంగుల పునశ్చరణ మరియు ఆకుపచ్చ రంగును కనిపెట్టుట కావలసిన వస్తువులు: ఏమీ లేవు. దశలు ఎరుపు, నీలం మరియు పసుపు రంగులను గుర్తుచేస్తూ ఆటను ప్రారంభించండి. ఆకుపచ్చ రంగులో ఉన్న వస్తువులను చూపిస్తూ ఆకుపచ్చ రంగు గురించి వివరించండి. ఆకుపచ్చ రంగును అనుకూల పదాలతో సరదాగా బిడ్డకు వివరించండి. వివిధ రకాల వస్తువులను చూపిస్తూ "ఇది ఆకుపచ్చ రంగులో ఉందా?" అని బిడ్డను అడగండి. బిడ్డ స్పందించే విధానాన్ని ప్రోత్సహించండి. బిడ్డ గతంలో నేర్చుకున్న రంగులను గుర్తుచేస్తూ వారు చెప్పే సమాధానాలను అంగీకరించండి. కృత్యం ప్రాధాన్యత: గతంలో నేర్చుకున్న రంగుల భావనల గురించి సంపూర్ణ అవగాహన కలుగుటకు ఇది దోహదపడుతుంది. వేగం మరియు నిదానం కావలసిన వస్తువులు: ఏమీ లేవు. దశలు మీ బిడ్డను మీతో వేగంగా మరియు నిదానంగా పరిగెత్తుతూ పోటీ పడమని అడగండి. ఒక ప్రారంభ రేఖ దగ్గర నుండి ఒకటి, రెండు, మూడు అని అంకెలు లెక్కిస్తూ 'వెళ్ళు' అని పోటీని మొదలుపెట్టండి. మీరు పరిగెత్తేటప్పుడు నిదానం అని అరుస్తూ బిడ్డ వేగంలో మార్పు జరిగిందో లేదో గమనించండి. నెమ్మది, వేగం అని మార్చి మార్చి పదాలు చెబుతూ వేగం వైవిధ్యాల గురించి బిడ్డతో చర్చించండి. మీరు ఎన్నిసార్లు వేగంగా పరిగెత్తారు, ఎన్నిసార్లు నెమ్మదిగా పరిగెత్తారు లెక్కించండి. ఆట గురించి బిడ్డతో చర్చించండి మరియు ఆదేశాలు వినడం యొక్క ప్రాముఖ్యతను బిడ్డకు ప్రత్యేకంగా తెలియజేయండి. కృత్యం ప్రాధాన్యత: ఇది బిడ్డకు వినడం, ఆదేశాలను అనుసరించడం మరియు బావోద్వేగ, చర్య నియంత్రణను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. తండ్రిలా ప్రవర్తించండి కావలసిన వస్తువులు: తండ్రి జుట్టు, దుస్తులు, ఒక పాత్ర, చెంచా. దశలు అమ్మ చేసే వివిధ పనుల గురించి బిడ్డతో మాట్లాడండి. బిడ్డను అమ్మలాగా, అమ్మ వేసుకునే దుస్తులు, బట్టలు వేసుకోనివ్వండి. స్నానం వంటివి చేస్తున్నట్లు నాన్న పాత్ర లాగా అభినయం చేయండి. వంట పాత్రలతో వండుతున్నట్లు నటించండి. ఒక చెంచా తీసుకొని పదార్థాలు పాత్రలో కలియబెడుతున్నట్లు తిప్పండి. రుచికరమైన పదార్ధాన్ని వండినట్లు రుచి చూసినట్లు నటించండి. ఇటువంటి ఊహాజనితమైన ఆటలో బిడ్డతో కలిసి పూర్తిగా నిమగ్నమై సరదాగా ఆస్వాదించండి. కృత్యం ప్రాధాన్యత: బిడ్డను ఊహాజనితమైన మరియు సృజనాత్మకమైన ఆటలాడటానికి ప్రోత్సహిస్తుంది. ఇది సంరక్షకులకు, బిడ్డకు మధ్య బంధాన్ని బలపరుస్తుంది. వస్తువులు మరియు వాటి ఉపయోగాలు కావలసిన వస్తువులు: ఏమీ లేవు. దశలు పిల్లలకు తెలిసిన మూడు లేదా నాలుగు వస్తువుల గురించి ఆలోచించండి. ఒక్కొక్క వస్తువును బిడ్డకు చూపిస్తూ వాటి పేర్లను అడగండి. ప్రతి వస్తువు యొక్క ఉపయోగం గురించి బిడ్డకు వివరించండి (ఉదాహరణకు: కప్పును చూపిస్తూ కప్పును నీళ్లు తాగడానికి ఉపయోగిస్తామని చెప్పండి). వస్తువుల పేర్లు వాటి ఉపయోగాలను మరలా చెప్పేలా బిడ్డను ప్రోత్సహించండి. ప్రతి వస్తువు గురించి అవగాహన పెంపుదల మరియు పదజాలం అభివృద్ధి చెందేలా బిడ్డతో చర్చించండి. కృత్యం ప్రాధాన్యత: వస్తువుల పేర్లను చెప్పించడం ద్వారా పిల్లలలో పదజాలం మెరుగవుతుంది. వస్తువులు, వాటితో చేసే పనులు మరియు ఉపయోగాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ