నన్ను కనుగొనడానికి ఆధారాలు (Hide and Seek Game) వస్తువులు: ఏమీ లేవు. దశలు: బిడ్డను దొంగ – పోలీస్ ఆట ఆడటానికి ఆహ్వానించండి. మీరు అంకెలు లెక్కించేటప్పుడు బిడ్డను కనిపించకుండా దాక్కోమని చెప్పండి. బిడ్డను వెతుకుతూ, "నాకు తలుపు దగ్గర నీ నవ్వులు వినపడుతున్నాయి," "నువ్వు ఎక్కడున్నావో ఆధారం తెలిసిపోయింది!" అంటూ బిడ్డ కోసం వెతకండి. మీరు వెతకడం గురించి వివరణాత్మక భాషను ఉపయోగించండి. బిడ్డను కనిపెట్టగానే మీ ఉత్సాహాన్ని బిడ్డతో కలిసి జరుపుకోండి. ఆటలో పాత్రలు మార్చుకుని, మీరు దాక్కోండి, మిమ్మల్ని కనిపెట్టమని బిడ్డకి చెప్పండి. మీరు దాక్కున్న ఆధారాలు కనిపెట్టేలా బిడ్డను ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: సమస్య పరిష్కార నైపుణ్యాలు అభివృద్ధి చేస్తుంది. ఆడుకునే సమయంలో స్వీయ నియంత్రణతో మరియు సమానాన్ని ప్రోత్సహిస్తుంది. ఆధారాలు ఇచ్చే క్రమంలో భాషాభివృద్ధి జరుగుతుంది. మట్టి కళాఖండం (Clay Artwork) వస్తువులు: బయట దొరికే మట్టి ముద్ద లేక మెత్తటి మట్టి. దశలు: ఇంటి బయట దొరికే మట్టి ముద్ద లేక మెత్తటి మట్టి తీసుకోండి. బిడ్డతోపాటు కూర్చుని వేళ్ళతో మట్టిలో ఎలా గీయాలో చూపించండి. బిడ్డను సొంతంగా తన వేళ్ళతో మట్టిలో చిత్రాలు గీయటానికి, కొత్తవి సృష్టించడానికి ప్రోత్సహించండి. ఇద్దరూ కలిసి మట్టిలో చిత్రాలు గీస్తున్నపుడు వాటి ఆకారాలు, గీతలు మరియు నమూనాల గురించి బిడ్డతో మాట్లాడండి. తన వేలితో గీస్తూ మట్టిలో ప్రయోగాలు చేయడానికి బిడ్డకు అనుమతినివ్వండి. తన చేతులతో చేసిన మట్టి కళాఖండాలను బిడ్డతో కలిసి ఉత్సాహంగా జరుపుకోండి. కృత్యం ప్రాధాన్యత: మట్టి ఆకృతి మరియు దాని స్పర్శ ద్వారా బిడ్డలో ఇంద్రియగ్రహణం మెరుగుపడుతుంది. వేలితో గీయటం ద్వారా సూక్ష్మ కండరాల అభివృద్ధి మరియు సృజనాత్మకత పెరుగుతుంది. కలిసి పాడటం మరియు నవ్వడం (Singing and Laughing Together) వస్తువులు: ఏమీ లేవు. దశలు: మీకు ఇష్టమైన నర్సరీ పద్యాన్ని ఎంచుకోండి. నర్సరీ పద్యాన్ని ఉత్సాహమైన స్వరంతో బిడ్డకు పాడి వినిపించండి. చప్పట్లు కొట్టడానికి, కదలడానికి లేక సాధారణమైన పనులతో పాల్గొనటానికి బిడ్డను ప్రోత్సహించండి. వీలైతే మీతో కలిసి పాడమని బిడ్డను ఆహ్వానిస్తూ, నర్సరీ పద్యాన్ని మరలా పాడండి. దీనిని సంతోషకరమైన మరియు పరస్పర అనుభవంగా బిడ్డ అనుభూతి చెందేలా చూడండి. కృత్యం ప్రాధాన్యత: భాషాభివృద్ధి మెరుగుపడటం, బిడ్డకు సంరక్షకులకు మధ్య అనుబంధం ఏర్పడుతుంది. శ్రావ్యమైన మరియు ప్రాసతో కూడిన పద్యాలవల్ల పిల్లల్లో అభిజ్ఞా నైపుణ్యం పెంపొందుతుంది. నేను ఏ జంతువును? (Guess the Animal) వస్తువులు: ఏమీ లేవు. దశలు: పిల్లి వంటి జంతువును ఎంచుకుని, దాని లక్షణాల గురించి బిడ్డతో మాట్లాడండి. ఉదా: పిల్లికి మీసాలు మరియు పొడవైన తోక ఉంటుంది అని బిడ్డకు వివరించండి. బిడ్డకు పిల్లి మీసాలు చూపించడానికి మీ చేతులను ఉపయోగించండి. చూపించే జంతువుకు సంబంధించిన ధ్వనులను చేసి బిడ్డకు చూపించండి ఉదా: పిల్లిలా 'మ్యావ్' అని ధ్వని చేయండి. బిడ్డతో కలిసి నేలమీద కూర్చుని, మీరు ఎంచుకున్న జంతువులా నటించి దాని కదలికలను అనుకరించండి. బిడ్డను మీరు చేసే ధ్వనులను, పనులను అనుకరించమని ప్రోత్సహించండి. కృత్యం ప్రాధాన్యత: జంతువులను వర్ణించడం వలన పిల్లలలో భాషాభివృద్ధి మెరుగుపడుతుంది. జంతువు లాగా నటించడం మరియు వాటిలా ధ్వనులు చేయడం వలన ఇంద్రియ గ్రహణాభివృద్ధి జరుగుతుంది. వీటివలన పిల్లల్లో ఊహాత్మక ఆట మరియు సృజనాత్మకత పెరుగుతుంది. ఆధారాలు: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ