పరిమాణాలను పోల్చడం వస్తువులు: మూడు వేర్వేరు పరిమాణం గల ఆకులు లేదా కర్రలు. దశలు మూడు వేర్వేరు పరిమాణాల్లో ఉన్న ఆకులను లేదా కర్రలను తీసుకోండి.ప్రతి పరిమాణాన్ని వివరించడానికి పెద్ద, మధ్యస్థ మరియు చిన్న వంటి పదాలను ఉపయోగించండి.మీరు చెప్పిన వెంటనే, వివిధ పరిమాణ పదాలను, మీరు చెప్పినట్లుగా బిడ్డను తిరిగి చెప్పమని అడగండి.ఏదైనా ఒక పరిమాణాన్ని చెప్పి, బిడ్డను సంబంధిత పరిమాణం గల ఆకును చూపించమనండి.బిడ్డ పరిమాణాలను సరిగా గుర్తించినప్పుడు వారిని అభినందించండి. కృత్యం ప్రాధాన్యత: పరిమాణానికి సంబంధించిన పదజాలాన్ని అభివృద్ధి చేస్తుంది. పరిశీలన మరియు భాషా నైపుణ్యాలను పెంచుతుంది. దారంతో ప్రయోగాలు వస్తువులు: జల్లెడ, రంగురంగుల నూలు లేదా తీగ. దశలు చదునైన ఉపరితలంపై జల్లెడను స్థిరంగా ఎలా పట్టుకోవాలో చూపించండి.పై నుండి ప్రారంభించి రంధ్రాల గుండా నూలును ఎలా దారంపోవాలో బిడ్డకు నేర్పించండి.బిడ్డ తన చేతులతో రంధ్రాల గుండా నూలు వేయడానికి మార్గ నిర్దేశం చేయండి. బిడ్డకు సూక్ష్మకండరాల చలన నైపుణ్యాలు పెరిగేలా ప్రోత్సహించండి.బిడ్డ దాన్ని రంధ్రాల గుండా విజయవంతంగా వేయగానే అభినందించండి.ఈ ఆటను మరింత సరదాగా మార్చడానికి రకరకాల నమూనాలను మరియు రంగుల దారాలను ఉపయోగించండి. కృత్యం ప్రాధాన్యత: ఈ కృత్యం వల్ల పిల్లల్లో సూక్ష్మ కండరాల అభివృద్ధి మరియు చేతి - కంటి సమన్వయం పెరుగుతుంది. రంగుల కోసం వెతుకుట వస్తువులు: వివిధ రంగుల్లో ఉన్న వస్తువులు, ఆకు, తలుపు, మేజోళ్ళు మరియు గడ్డి. దశలు ఒకే రంగులో ఉన్న రెండు వస్తువులను కనుగొనమని బిడ్డకు చెప్పండి. ఉదా: ఆకుపచ్చని ఆకు మరియు తలుపు.బిడ్డకు వస్తువును చూపించి వాటి రంగును వర్ణిస్తూ వాటి పేరును చెప్పండి. ఉదా: ఆకుపచ్చని ఆకు.మరిన్ని ఒకే రంగు గల వస్తువును గుర్తించడానికి బిడ్డకు సహాయపడండి. వారు గుర్తించగానే ప్రోత్సహించండి. ఉదాహరణకు మేజోళ్ళు మరియు గడ్డి.ఏదైనా ఒక రంగును ఇద్దరూ కలిసి ఒకేసారి పలికి ఈ ఆటను రంగులు వెతికే సరదా ఆటగా మార్చండి. కృత్యం ప్రాధాన్యత: రంగులు గుర్తించడం, పదజాలం అభివృద్ధి జరుగుతుంది. నేర్చుకోవడం అనేది సరదాగా మారి కొత్త అంశాలు నేర్చుకోవడంలో నిమగ్నమవుతారు. కలిసి నృత్యం చేద్దాం వస్తువులు: మ్యూజిక్ ప్లేయర్ లేదా రరేడియో. దశలు: రేడియో నుండి సంగీతాన్ని వినిపించండి.బిడ్డ చేతిని పట్టుకుని ఇద్దరు కలిసి నృత్యం చేయండి.బిడ్డను లయకు తగినట్లుగా తలను, చేతులను మరియు కాళ్ళను కదలిస్తూ నృత్యం చేయమని ప్రోత్సహించండి.దినచర్యలో నృత్యం చేసేలా రూపొందించుకోండి.సంతోషకరమైన నృత్య వేడుకలో పాల్గొనడానికి ఇతర కుటుంబ సభ్యులను ఆహ్వానించండి. కృత్యం ప్రాధాన్యత: శారీరక కృత్యం, సమన్వయాన్ని కలుగజేస్తుంది.. కుటుంబ అనుబంధము మరియు అందరూ కలిసి ఆనందంగా గడపడంతో పాటు కండరాల చలన అభివృద్ధి జరుగుతుంది. ఆధారం: మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ