కీళ్లనొప్పులు ఆయుర్వేదం అతిపురాతన భారతీయ వైద్యశాస్త్రం. ఇందులో జీవితానికి సంబంధించి చర్చించని విషయాలు లేవంటే అతిశయోక్తి కాదు. ‘కీళ్లనొప్పులు’ ప్రస్తుత కాలంలో అతిచిన్న (30-40) వయసులోనే మొదలవుతున్నాయి. ప్రస్తుత జీవన విధానంలో అనేక మార్పులు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు, సరియైన సమయంలో భోజనం చేయకపోవడం, ఫాస్ట్ఫుడ్స్ ఎక్కువగా తినడం, పోషక విలువలు కలిగిన ఆహారం తినకపోవడం సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే దినచర్యలో సరైన వ్యాయామం, సరియైన సమయంలో నిద్రపోకపోవడం, (స్వప్న విపర్యం అనగా పగలు నిద్రించడం, రాత్రి ఎక్కువగా మేల్కొని ఉండటం వంటివి) కూడా సామాన్య కారణాలుగా చెప్పవచ్చు. అలాగే మానసికంగా ఎక్కువగా ఆలోచించటం, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా ఈ కీళ్ల నొప్పులకు సామాన్య కారణాలుగా పరిగణించవచ్చు. ఈ కీళ్ల నొప్పులను ఆయుర్వేదశాస్త్రంలో మూడు విధాలుగా వర్ణించారు. సంధివాతం – Oesteo arthritis ఆమవాతం – Rheumatoid arthritis వాతరక్తం – Gout సంధి వాతం (Oesteo arthrities) సంధివాతాన్ని ఆస్టియో ఆర్ధరైటిస్‌గా ఆయుర్వేదం పరిగణిస్తుంది. ఇక్కడ ముఖ్యంగా త్రిదోషపరంగా చూసినట్లయితే సంధులలో వాత ప్రకోపం జరుగుతుంది. తద్వారా కీళ్లలో నొప్పి, వాపు, కదిలినప్పుడు కీళ్లనుండి శబ్దాలు (Crepites) ఉంటాయి. ముఖ్యంగా సంధులలో (సైనోవియల్ ఫ్లూయిడ్) శ్లేషక కఫం తగ్గుతుంది. సంధివాతంలో కదలికల వలన నొప్పి ఎక్కువ అవటం, విశ్రాంతి ఉంటే నొప్పి తగ్గటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమస్య 50-60 సంవత్సరాల మధ్య వయసు వారికి వస్తూ ఉంటుంది. పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తూంటుంది. ఈ సమస్యకు ప్రత్యేక కారణాలు: మధుమేహం, స్థూలకాయం, సోరియాసిస్ వంటి వ్యాధులు ఉన్నవారికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆహారంలో పోషకవిలువల లోపం వలన కూడా (విటమిన్ డి, కాల్షియం, ప్రొటీన్) ఈ వ్యాధి వస్తుంది. జీవన విధానంలో కొన్ని రకాలైన మార్పుల వలన ప్రధానంగా ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, అధిక బరువులు తలపైన లేదా వీపుమీద మోయటం ఎక్కువగా కంప్యూటర్స్ ముందు కూర్చోవటం… ఇలాంటివి కూడా ఈ సమస్యకు కారణం అవుతాయి. ఆమ వాతం (Rheumatoid arthritis) రుమటాయిడ్ ఆర్ధరైటిస్‌ని ఆమవాతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు. ముఖ్యంగా ఆమం, వాతం అనే రెండు దోషాల ప్రభావం వల్న ఈ సమస్య వస్తుంది. మానసిక ఒత్తిడి వలన ఎక్కువగా ఆలోచించటం, ఎక్కువగా విచారించటం, కోపం వలన, సరియైన ఆహార నియమాలు పాటించకపోవడం వలన, వ్యాయామం లేకపోవటం వలన, జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయకపోవటం లాంటి కారణాల వల్ల ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా ఈ విధమైన కీళ్ల సమస్యలలో ఎక్కువగా వాపు (Swelling), తీవ్ర వేదన (Pain), కొద్దిపాటి జ్వరం (Mild Temp) కీళ్లు బిగుసుకుపోవటం (Stiffness), ఆకలి మందగించటం, మలబద్దకం (Constipation) లాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి. ఈ వ్యాధి అన్ని కీళ్లలో వస్తుంది (Including small joints). వాత రక్తం (Gout) Goutను వాతరక్తంగా పరిగణిస్తాం. ఇది మధ్యవయసు వారిలో ఎక్కువగా వస్తూంటుంది. కారణాలు: ఎక్కువగా మద్యపానం, అధిక మాంస సేవనం (హై ప్రొటీనిక్ ఆహారం) ఎక్కువగా పులుపు, ఉప్పు, మసాలాలు ఆహారపదార్థ సేవన, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఉండే ఆహారపదార్థాలు తినటం వలన అలాగే వీటితోపాటు శారీరక శ్రమ చేయకపోవటం, ఎక్కువ సమయం ద్విచక్ర వాహనాలపై ప్రయాణించటం, ఎక్కువ దూరం నడవటం వీటన్నిటివలన వాతం, రక్తం ఈ రెండు దుష్టి చెంది వాత రక్తంగా సమస్య ఏర్పడుతుంది. క్లినికల్‌గా చూసినట్లయితే ఈ సమస్యలో యూరిక్ ఆసిడ్ లెవెల్స్ రక్తంలో పెరుగుతాయి. లక్షణాలు: ఎరుపు, వాపు, నొప్పితో కూడిన కాలిబొటన వేలు నుండి ప్రారంభమై, తర్వాత మిగిలినటువంటి కీళ్లకు వ్యాపిస్తుంది. దీనిలో కీళ్లనొప్పులతో పాటు పైన చర్మం రంగు కూడా మారుతుంది. ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు ఆయుర్వేద శాస్త్రంలో… నిదాన పరివర్జనం ఔషధ సేవన ఆహార విహార నియమాలు ఈ మూడు పద్ధతుల ద్వారా ఈ వ్యాధులకు పూర్తిగా చికిత్స చేయవచ్చు. నిదాన పరివర్జనం: వ్యాధి కారణాలను తెలుసుకుని, వాటికి దూరంగా ఉండటం. ఉదాహరణకు పగలు నిద్రపోవటం, రాత్రి మేల్కొనటం వంటి కారణాలను విడిచిపెట్టటం. ఆహార విహార నియమాలు: ఆహారం సరైన టైమ్‌కి తినటం, వ్యాధి స్వభావాన్ని బట్టి పోషక విలువలు కలిగిన ఆహారం తినటం, తగు వ్యాయామం, సరైన టైమ్‌కి విశ్రాంతి లాంటి నియమాలు పాటించడం. ఔషధ సేవన: ఔషధ సేవన విషయానికి వస్తే, ఇందులో రెండు పద్ధతులున్నాయి. ఎ) శమనం బి) శోధన ం శమనం: అనగా వ్యాధి దోషాలను బట్టి అభ్యంతరంగా ఔషధాలను సేవించటం. శోధనం: అంటే పంచకర్మ. పంచకర్మలలో స్నేహకర్మ, స్వేదకర్మ (పూర్వకర్మలు) తరువాత వమన, విరేచన, వస్తి (ప్రధాన కర్మలు) తరువాత పశ్చాత్ కర్మలు చేయించవలసిన అవసరం ఉంటుంది. ఇవికాక అభ్యంగ, శిరోధార, కటివస్తి, గ్రీవవస్తి, బానువస్తి, పత్రపోటలీ, వాలుకాస్వేదం మొదలగు బాహ్యచికిత్సలు కూడా అవసరాన్ని బట్టి ప్రయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ డి.హనుమంతరావుఎం.డి (ఆయుర్వేద),స్టార్ ఆయుర్వేద,సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్,విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటకph: 99599 114 66 / 99089 111 99www.starayurveda.com పులిపిర్లు ఇబ్బంది పెడుతుంటే… పులిపిరికాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభాలో ప్రతి వందమందిలోనూ కనీసం 10-15 మందికి చర్మంపైన పులిపిరులు కనిపిస్తుంటాయి. పులిపిరికాయలను ఉలిపిరి కాయలనీ, వార్ట్స్ అనీ సాధారణ పేర్లతో పిలుస్తుంటారు. పులిపిరులకు ప్రధాన కారణం వైరస్ (హ్యూమన్ పాపిలోమా వైరస్). ఎక్కువగా యుక్త వయస్కుల్లో కనిపిస్తాయి. మగవారికంటే మహిళల్లో కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. పులిపిరి కాయలు చూడటానికి చర్మపురంగులో కాని, కాస్తంత ముదురు గోధుమ రంగులో కాని బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడేచోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా, మెడపైనా, చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. పులిపిరులను చికిత్స చేయడానికి మామూలుగా లేఖనం (స్క్రేపింగ్), దహనం (బర్నింగ్), ఛేదనం (కటింగ్), ఫ్రీజింగ్ మొదలైన చికిత్సా పద్ధతులను వాడుతుంటారు. ఐతే ఈ పద్ధతులు పులిపిరుల పునరావృతాన్ని నిరోధించలేవు. పైగా ఈ చికిత్సా పద్ధతులవలన ఏర్పడిన మచ్చలు మరింత ఇబ్బందిని కలిగిస్తాయి. అందుకే వీటి చికిత్స కంటే శాశ్వతనివారణ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో పులిపిరులకు సంబంధించి ఆయుర్వేద గృహ చికిత్సలను, నివారణ పద్ధతులనూ సంక్షిప్తంగా తెలుసుకుందాం. పులిపిరులను ఆయుర్వేదంలో ‘చర్మకీల’ అంటారు. వీటికి సంబంధించిన వివరణలు ఆయుర్వేద సంహితా గ్రంథాల్లో క్షుద్రవ్యాధులు వివరించే అధ్యాయాల్లో లభిస్తాయి. క్షుద్రవ్యాధులు అంటే అల్పమైన లక్షణాలు, పురోగతి, తీవ్రతలు కలిగిన వ్యాధులని అర్ధం. పులిపిరులు చాలావరకూ ‘స్వయం అంతాలు’గా ఉంటాయి. అంటే చాలామటుకు ఏ చికిత్సా తీసుకోకపోయినప్పటికీ వాటంతట అవే సమసిపోతాయన్నమాట. అయితే కొంతమందిలో మాత్రం వాటంతట అవి తగ్గవు. పైగా పులిపిరులు నిరంతరమూ సాంక్రామిక లక్షణాలు కలిగిన వైరస్‌లను విడుదల చేస్తుండటం వలన వీటి సంఖ్య, పరిమాణాలు పెరిగే అవకాశముంది. ఇలాంటి సందర్భాలలో చికిత్స తీసుకోవాలి. పులిపిర్లను కలిగించే వైరస్లు శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలను కలిగించటానికి 1-8 నెలలు పట్టవచ్చు.పులిపిర్లను ప్రధానంగా మూడు రకాలుగా విభజించవచ్చు. కామన్ వార్ట్స్ (చేతివేళ్ళ చుట్టూ వస్తాయి), ప్లాంటార్ వార్ట్స్ (పాదాల మీద వస్తాయి), ఫ్లాట్ వార్ట్స్ (ముఖంమీద, మెడమీద వస్తాయి), జననాంగాలమీద వచ్చేవి జనైటల్ వార్ట్స్. అవి వేరే కోవకు చెందుతాయి. సూచనలు చర్మం తేమగా ఉంటే పులిపిర్లను కలిగించే వైరస్లు పెరగటానికి, జీవించి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మాన్ని, ముఖ్యంగా పాదాలను, చేతులను, మెడను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. చెమటతో తడిసిన సాక్సులను, దస్తీలను ప్రతిరోజూ మార్చి వాడాలి. వాడబోయే ముందు వీటిని తడి ఆరిపోయేలా ఎండలో బాగా ఆరబెట్టాలి.పులిపిరులను కలిగించే వైరస్లు గాయమైన చర్మం నుంచి శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి కనుక గాయాలూ, దెబ్బలూ కాకుండా చూసుకోవాలి. కరచాలనం వంటి అలవాట్లు మానుకోవాలి. పులిపిరులు ఏర్పడిన చర్మాన్ని పదేపదే స్పర్శించకూడదు. పులిపిరి వచ్చిన చోట వాటర్ ఫ్రూఫ్ స్టిక్కింగ్ టేప్‌ని రెండు మూడు పొరలుగా అతికించాలి. ఆరున్నర రోజులు అలాగే ఉంచి టేప్ తొలగించాలి. 12 గంటలపాటు గాలిని తగలనిచ్చి మళ్లీ ఆరున్నర రోజులపాటు టేప్‌ని అతికించాలి. దీంతో వార్ట్స్ శుష్కించిపోయి ఊడి వచ్చేస్తాయి. టేప్ కారణంగా గాలిచొరబడని వాతావరణం ఏర్పడటంవల్ల వైరస్ నశిస్తుంది. గృహ చికిత్సలు వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి. ఉల్లిపాయను సగానికి కోసం మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది. పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి. కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.రావిపట్టను కాల్చి మసిచేసి సమంగా కొత్త సున్నం, వెన్న కలిపి పైకి పూయాలి. లేదా కొత్త సున్నాన్ని తమలపాకు రసంతో సహా కలిపి నూరి పులిపిరులపైన పూయాలి. పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేపనూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్లమీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. పులిపిరులు మొండిగా తయారై ఇబ్బంది కలిగిస్తుంటే వైద్య సలహా మేరకు కాశీసాది తైలాన్ని పైపూతకు, వాతారి గుగ్గులు అనే మందులను లోపలకూ నిర్ణీత కాలంపాటు వాడాలి. డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్muralimanoharch@hotmail.comరక్ష ఆయుర్వేదిక్ సెంటర్,స్టేట్‌హోం ఎదుట సారథీ స్టూడియోరోడ్,అమీర్‌పేట, హైదరాబాద్-73 నల్లేరు గొప్ప ఔషధం! ‘నల్లేరుమీద బండి’లా జీవితం సాగిపోతోంది అని, మెత్తగా సాపీగా జీవితం వుండటాన్ని ఉపమించే సామెత వాడుకలో వుంది. వజ్రవల్లీ, చతుర్థార, అస్థి సంధాన అని సంస్కృతంలో పేరు. హిందీలో ‘హడ్ జోడ్’గా పిలువబడే నల్లేరు, విరిగిన ఎముకలు చాలా త్వరితంగా అతుక్కోవడానికి ఉపకరించే ప్రాచీన మహౌషధి. దీనిని భావమిశ్రుడు తన ‘భవప్రకాశ’ గ్రంథంలో వివరించారు. ‘సిసస్ క్వాడ్రాంగులా’ లాటిన్ నామధేయముగల నల్లేరును, గ్రామీణంలో వడియాలు, పచ్చళ్లు చేసుకొని ఆహార పదార్థంగా వినియోగించుకుంటారు. దీనిలో విటమిన్‘సి’, కెరోటిన్ ఎ, స్టెరాయిడల్ ధాతువు, కాల్షియం అధిక మొత్తంలో వున్నాయని పరిశోధకులు గుర్తించారు. కార్టిజోన్ దుష్ఫలితాలను నిలువరించి దాని యాంటీ ఎనబాలిక్ గుణాన్ని సాంద్రతను తగ్గించి, ఎనబాలిక్ ఓషధంగా పరిగణించే ‘డ్యూరాబొలిన్’కంటె ఉత్తమ గుణం ఈ ‘నల్లేరు’లో వున్నాయని పరిశోధకులు ధృవీకరించారు. అస్థ్ధితువు వేగంగా ప్రవృద్ధమయేందుకు నల్లేరు విశేషంగా దోహదం చేస్తుంది. విరిగిన ఎముకలు అతుక్కోడానికి అవసరమయే ‘మ్యూకోపాలిసాక్రైడ్స్’ దీనిలో విశేషంగా వున్నాయి. ఇవి రక్తము ద్వారా కణజాలములో కలిసి వృద్ధి చెందడానికి దోహదం చేస్తుంది. నల్లేరు యొక్క సాంకేతిక నామం CISSUS QUADRA GULARIS లేక VITUS QUADRANGU LARIS. ఆంగ్లములో DEVILS BACK BONE అంటాఠు. దక్షిణ భారతంలో మరియు శ్రీలంకలో ఎక్కువగా లభ్యమవుతుంది. విరిగిన ఎముకలు అతుక్కోవడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అస్థిసంహార అని కూడా పిలుస్తారు. ఇది సాధారణంగా 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. దీని కాండం చతురస్రాకారంలో వుంది. 8-10 సెంటీమీటర్ల దగ్గర ‘గణుపు’ వుంటుంది. ఆ గణుపు దగ్గర వేరు లేక తీగల వంటి CLIMBING ROOTS వస్తాయి. ఆకులు కూడా ఆ గణుపు దగ్గరే వస్తాయి. దీని కాండం ఓషధ ప్రయోగానికి ఉపయోగిస్తుంది. తుంచితే జిగురు వస్తుంది. హిందీలో ‘హడ్జోడ్’గా పిలుస్తారు. దీనిలో ఎక్కువ శాతం కెరోటినాయిడ్స్, కాల్షియం, విటమిన్ సి, కాల్షియమ్ ఆక్సలేటర్ వంటి రసాయనాలు లభ్యమవుతాయి. ఈ ఓషధి ఘనసత్వం ఊబకాయం తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించడంలో బాగా ఉపయోగిస్తుంది. కొన్ని సందర్భాలలో ఊహించని విధంగా అనుకోకుండా మేలును చేకూర్చే వస్తు సముదాయం మన పక్కనే వుందని గమనించకుండా వుండి ఎవరో చెబితే ‘మహౌషధి’ అది ఇతరులు చెప్పినపుడు ఆశ్చర్యమవుతుంది. అటువంటి మహౌషధి నల్లేరు. CORTISOL వాడకంవలన ఏర్పడే ఉపద్రవాలలో ఒకటయిన ఎముకల సాంద్రత తగ్గటం, దీనిని నివారించే గుణం దీనిలో వుంది. ఎముకలలో దృఢత్వం కలిగించడమే కాకుండా ప్రక్కన వుండే కండరాలకు శక్తిని చేకూర్చుతుంది. ఇదికాక దీనిలో నొప్పి నివారణ గుణం వుండటం విశేష లక్షణం. మనం తరచుగా వాడే ఆస్పిరిన్ బ్రూఫెన్ మందులకు సరిసమానంగా నొప్పి నివారణ గుణం నల్లేరులో వున్నదని పరిశోధనల ద్వారా తేలింది. ప్రకృతి ప్రసాదించి విశేషగుణాలు కలిగిన నల్లేరును సమాదరించకపోవడం విచారకరం. 100 గ్రాముల ఫైటోకెమికల్స్ను, 267 ఎం.జిల కెరోటిన్, 398 మిల్లీ గ్రాముల విటమిన్ సి, ఇది కాకుండా ఎముక సత్వరం అతుక్కోడానికి ఉపకరించే గుణం కూడా వుంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఇటువంటి ఔషధ గుణాల మొక్క అవసరం గమనించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రోత్సాహంతో, దక్షిణ భారతంలో, శ్రీలంకలో అధికంగా లభించే ‘సిసస్ క్వాడ్రాంగులా’ను అనేక సంస్థలు పరిశోధనలు చేపట్టి ఆశ్చర్యకర ఫలితాలను వెల్లడించారు. జంతు పరిశోధనలో దీనిని ఇచ్చిన తరువాత 21 రోజులలో విరిగిన ఎముక యొక్క రెండు చివరలు అతుక్కుని వుండటం ఎక్స్‌రేల ద్వారా గమనించారు. కార్టిలేజ్‌లో, ఆస్టియోబ్లాస్ట్ కణాలలో మార్పును కూడా గమనించారు. యూసిబోన్ (ఫర్మాన్జా ఇండియా), బొకామో (గుఫిక్), యూనియన్, 4 డఉ-డ (AIRAN PHARMA), నల్లేరు (AGRIGOLD) ASTHI SANDH పేర్లతో మొదలయిన కంపెనీలు వివిధ బ్రాండ్లతో మార్కెట్లో నల్లేరును ప్రవేశపెట్టారు. శాస్ర్తియ పరిశోధక అంశాలు పుష్కలంగా వుండటంతో అనతికాలంలోనే ప్రసిద్ధమైనాయి. సమతౌల్యంలేని ఆస్టియో క్లాస్టులు (ఎముకల శైథిల్యానికి కారణమయిన కణాలు) ఆస్టియో బ్లాస్టులు (ఎముకల తయారీకి కారణమయిన కణాలు) ఆస్టియో పోరోసిస్ అనే వ్యాధికి కారణమవుతాయి. ఇది ఎక్కువగా మెనోపాజ్ స్ర్తిలలో ఋతుక్రమం ఆగిపోవడం సమయంలో కాల్షియం తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ లోపం కూడా తోడవడం ఆస్టియో పోరోసిస్ ఉపద్రవం అధికమవుతుంది. ఈ నల్లేరులో వుండే పోషక ఎనబాలిక్ గుణంవలన నల్లేరు వాడకం ఆస్టియో పోరోసిస్ను నివారించవచ్చు. ఎటువంటి దుష్ఫలితాలు దీనిలో లేవని పరిశోధకులు వెల్లడించారు. ‘లాక్షాదిగుగ్గులు’ ప్రసిద్ధమైన మందు. దీనిలో ముఖ్యమయిన ఓషధి వజ్రవల్లీ (నల్లేరు), నొప్పిని తగ్గించి, వాపును తగ్గించే చాలా సాధారణ ఔషధం. ఎముకలకు మిత్రుడైన నల్లేరును మీ ఇంటికి ఆహ్వానించండి. చిన్న పిల్లలలో సెరిబ్రల్ పాల్సీతో మెడ నిలపలేనప్పుడు నల్లేరు, వివిధ మూలికల మిశ్రమం మెడకు లేపనంగా వాడితే మంచి ఉపయోగం. అదేవిధంగా వెన్ను వంకరకు ఈ లేపనంతో వెన్ను దృఢంగా ఉంటుంది. -డాక్టర్ డి. శ్రీరామమూర్తి B.A.M.Sdrmurthy9@yahoo.comPhone: 040- 23741020, 9885297983 మలబద్ధకం (Constipation).. ప్రమాదకరం నిర్ణీత సమయంలో క్రమబద్ధంగాలేక, కష్టతరమైన మలవిసర్జనను మలబద్ధకం (Constipation) అంటారు. ఇది వ్యాధి కాదు లక్షణం మాత్రమే. చిన్నపిల్లలో, 60 సంవత్సరాలు పైబడిన వారిలో దీనిని ఎక్కువగా గమనించవచ్చు. వీరు తీసుకొనే ఆహారం తక్కువ పరిమాణంలో వుండటం మూలకారణం. వారంలో మూడుసార్లు మాత్రమే మలవిసర్జన జరగడం, మలవిసర్జన సమయంలో బాధ కలిగి వుండటం, సంపూర్తిగా మలవిసర్జన కలగకపోవడం మలబద్దకంగా పరిగణించాలి. గతంలో చిన్న పిల్లలకు సెలవు రోజుల్లో విరేచన కార్యక్రమం కొన్ని ఇళ్ళల్లో విధిగా ఉండేది. శిశువులలో ‘ఉగ్గు’ సంప్రదాయంగా వుండేది. ఆ అలవాట్లు ఇపుడు పూర్తిగా మారిపోయాయి. తరచు ఆసుపత్రి సందర్శన అలవాటు అయింది. శిశువులలో 4-5 సార్లు ద్రవంగా మలవిసర్జన వుంటుంది. కొందరిలో స్తన్యం తీసుకోగానే విరేచనం అవుతుంది. ఫార్ములా పాలు తీసుకొనే శిశువులలో తక్కువ సార్లు అయ్యే అవకాశం వుంది. రెండవ సంవత్సరంలో రోజుకు రెండుసార్లు, నాలుగవ సంవత్సరం వచ్చేప్పటికి ప్రతిరోజు ఒక్క పర్యాయం మాత్రమే మలవిసర్జన వుంటుంది. అనేక వ్యాధులకు మూలకారణం మలబద్ధకం. పెద్దప్రేగు ద్వారా విసర్జితం కావాల్సిన మలం పరిమితకాలానికి మించి అక్కడ నిల్వ ఉన్నప్పుడు అందులోని ద్రవపదార్థాలు పెద్దప్రేగు గోడల్లోకి పీల్చబడతాయి. దానితో మలంలోని ద్రవం పాలు తగ్గడంతో మలం తన మృదుత్వాన్ని కోల్పోయి మలబద్ధకం ఏర్పడుతుంది. అంతేకాక మలంలోని మరలా రక్తప్రసరణలో కలవడంవలన రక్తప్రసరణ వ్యవస్థ కలుషితం కావడం, మూత్రపిండాల మీద భారం పడటం జరుగుతుంది. దానితో అనేక వ్యాధులకు అది మూలకారణం అవుతుంది. ప్రస్తుత నాగరిక సమాజంలో పాలు, పాల ఆధారిత పదార్థాలు, నూడుల్సు, కేకులు, పిజ్జాలు, జంక్‌ఫుడ్ పదార్థాలు తినడం సర్వసాధారణమయింది. వీటిలో పీచు పదార్థాలు తక్కువ. జీర్ణం అయ్యాక మిగిలిన పదార్థాన్ని చిన్న ప్రేగులోంచి పెద్దపేగులోకి ముందుకు నెట్టివేయడానికి ఆహారంలోని పీచు పదార్థం ఉపకరిస్తుంది. అందులోబాటులో ఉండే ఆహార పదార్థాలు ఆహారపు అలవాట్లు ఆయా ప్రాంతాలను బట్టి వేరువేరుగా ఉంటాయి. పల్లె ప్రాంతాలలో నివసించే వారిలో గతంలో దంపుడు బియ్యం, ముడిగోధుమలు, ఇతర ఆహార ధాన్యాలు, జొన్నలు, సజ్జలు, వరిగలు, కర్రలు వాడకం విరివిగా వుండేవి. వాటిలో వుండే పీచు కణాలు మలం ఫ్రీగా వెడలటానికి వీలు వుండేది. వాత పిత్త కఫ దోషముల ప్రకోప ప్రాధాన్యతలతో, వాతమువలన మలము గట్టిపడి బాధ కలిగించును. అపాన వాత ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. పిత్తదోష ప్రాధాన్యతలో మలద్వార మంటతో కూడి మలబంధము వుంటుంది. కఫ దోష ప్రకోపంలో జిగట, బంకతో కూడి (Mucus) వుంటుంది. ఆమ్ల దోషము కూడి పిచ్ఛిలముగా వుంటుంది.నిర్థారణసాధారణ పరీక్షల ద్వారా అనగా సాధారణ రబ్బరు తొడుగుతో మలద్వార పరీక్ష, మలంలో రక్తము కూడి (Occuct blood), Sigmoidoscopy, ద్వారా కొన్ని విషయాలు తెలుస్తాయి. ప్రేగులలో ఏమైనా అడ్డంకులు (intestinal Obstruction) వున్నాయేమో, హైపోథైరాయిడజమ్, ఎలక్ట్రోలైట్ ప్రొఫైల్ తేడా, రక్తంలో కాల్షియం శాతం అధికంగా వుండటం కొలొనోస్కోపి వంటి పరీక్షల ద్వారా మూలకారణాన్ని నిర్థారించుకొనవచ్చును. ఇవికాక రోగి ఆహారపు అలవాట్లు, ఇతర మందుల వాడకం, శారీరక శ్రమ, నిద్ర వ్యక్తిగత హాబీలు కొంతవరకు కారణమవుతాయి. బేరియం ఎనిమా ద్వారా ఎక్స్‌రే కూడా నిర్థారణకు తోడ్పడుతుంది. చికిత్స మూలకారణం, ఉద్ధృతి, సమయము స్పష్టంగా తెలిస్తే చికిత్స సులువుగా వుంటుంది. ఆహారపు అలవాట్లు జీవన సరళి ఇందుకు బాగా ఉపకరిస్తాయి. కోష్ఠశుద్ధికి నెలలో ఒకసారి (ద్రవ ఆహారంతో) ఉపవాసం బాగా ఉపయోగపడుతుంది. రాత్రివేళ పడుకోబోయేముందు గ్లాసు పాలలో బ్రాహ్మీఘృతం, లేక ఇందుకాంతఘృతం 1 టీస్పూనును కలిపి తీసుకొంటే లేక వేడినీటితోనైనా తీసుకొంటే శ్రోతస్సు శుద్ధి అయి మలబద్ధకం నివారించబడుతుంది. విరేచన క్రియ ఆయుర్వేద శాస్తర్రీత్యా, క్రూరకోష్ఠము మద్యమ కోష్ఠము, మృదుకోష్ణము అనిమూడు రకాలుగావుంటుంది. వారి వారి వ్యక్తిగత ప్రవృతిని బట్టి ఓషధుల నిర్ణయం వుంటుంది. కొందరిలో త్రిఫలాచూర్ణము, స్వాదిష్ట విరేచన చూర్ణము, పంచసకార చూర్ణము, త్రివృతాది లేహ్యము, రోజా పుష్పలేహ్యం బాగా ఉపయోగపడతాయి. వస్తిక్రియ అనువాసన వస్తి, నిముషలలేక కషాయ వస్తి బాగా ఉపయోగిస్తుంది. సాధారణ బలహీనత వున్నపుడు బృంహణవస్తి ఉపయోకరం. విరేచనగణ ద్రవ్యములతో కూడిన స్నేషము ఒక నెలపాటు ప్రతిరోజు వర్థమాన పద్ధతిలో ఘృతముతో 2-4-6 చెంచాల చొప్పున తీసుకొంటే తప్పక మంచి ఫలితమిస్తుంది. శరీరంలో ఎలక్టొలైట్ స్థితిని పరిగణనలోకి తీసుకొనవలసి వుంటుంది. త్రిఫల చూర్ణముతో రెండు చెంచాల నేయిని కల్పుకొని తీసుకోవడం, అలోవిరా జ్యూస్ రెండు చెంచాల చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకోవడం ఉపయోగం. ముడిబియ్యం (దంపుడు బియ్యం, ముడి గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన ఆహార పదార్ధాలు, తాజాకూరలు, ఆకుకూరల వంటివి తీసుకొనే వారిలో ఈ సమస్య చాలా తక్కువ. బియ్యం తవుడు, గోధుమ తవుడులలో పీచు పదార్థం ఎక్కువ కాబట్టి మిగతా ఆహార పదార్థాలతో కలిపి రోజూ మూడు టీస్పూన్ల తవుడు తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చును. ప్రతిరోజు రెండు చెంచాల ముడి మెంతులు నమలకుండా మంచి నీటిలో తీసుకొనవలెను. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటంవలన మృదు విరేచనకారిగా పనిచేస్తుంది. సునాముఖి ఆకుల చారు (రసం)తో కలిపి తీసుకొంటే ప్రయోజనం వుంటుంది. పండ్లలో పీచు పదార్థం అధికంగా వుండే బొప్పాయి, బత్తాయి, నారింజ, పనస, ద్రాక్ష, జామ మొదలయిన వాటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ఏదైనా ఒక ప్రక్రియను శరీర సాత్మ్యతను గుర్తించి కనీసం నెల రోజులు ఆచరించాలి. ఆమవాలము (రుమాటిజమ్) రోగులలో మలబద్ధకం అధికంగా వుంటుంది. వీరు రోజూ 2 చెంచాల చొప్పున ఆముదం (Castor oil) మంచి ఫలితాన్నిస్తుంది. దీనికితోడు గంధర్వ హస్తాది కషాయము, సుఖవిరేచనవటి, రోజా పుష్పలేహ్యం, తివృత్లేహ్యం, మృదువిరేచనకారిగాను, ఇచ్ఛ్భాదిరసం, ఎరండ తైలం తక్షణ విరేచనకారిగాను వుంటుంది. - డాక్టర్ డి. శ్రీరామమూర్తి, B.A.M.Sdrmurthy9@yahoo.comPhone: 04023741020, 9885297983 క్యారెట్‌తో మేధో వికాసం! పిల్లల మేధోవికాసానికి ఆకుకూరలు, పండ్లు ఎంతగానో దోహదపడతాయన్న విష యం మనకందరికీ తెలిసిందే! అధిక పోషక విలువలున్న ఏ ఆహారపదార్థమైనా పిల్లల ఎదు గుదలకు, మేధోవికాసానికి తోడ్పడతాయి. పిల్లల మేధో వికాసానికి క్యారెట్ ఎంతో మంచిదంటున్నారు డాక్టర్లు. సాధారణంగా క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతంమంది ఇష్టపడరు. మరి కొంతమంది క్యారెట్‌ను పచ్చి గా తినేందుకు ఇష్టపడతారే కానీ, వండి తే మాత్రం ఇష్టప డరు. క్యారెట్లు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కల్గిస్తాయనీ, ఇందు లోని అధిక క్యాలరీలు పిల్లలు శారీర కంగా, మానసి కంగా ఎదిగేలా చేయడమే కాక మేధో వికాసానికి ఎంతో తోడ్పడతాయని వైద్యులు చెబుతున్నారు. వండితే తినేందుకు ఇష్టపడని ఈ క్యా రెట్లను సలాడ్ల రూపంలోనూ, జ్యూస్‌ల రూపం లోనూ తీసుకోవచ్చుననీ, ఇలా తీసుకు న్నట్ల యితే మంచి పోషకవిలువలు, ఆరోగ్యం లబి ్థస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇంతే కాక క్యారెట్లో విటమిన్ ఃఎః ఉంటుంది. ఃఎః విటమిన్ వల్ల కంటిచూపుకు ఎంతో మేలు కల్గుతుంది. క్యారెట్‌ను అధికంగా తింటే కంటిజబ్బులు కూడా మటుమాయమవు తాయి. అధిక పోషక విలువలుండటం వల్ల క్యారెట్లో రోగ నిరోధక శక్తి కూడా అధికంగానే ఉంటుంది. ఇందులోని రోగ నిరోధకశక్తి వలన కఠినమైన మొండి రోగాలు, దీర్ఘ వ్యాధులకు సైతం చెక చెప్పవచ్చునంటు న్నారు డాక్టర్లు. క్యారెట్ ప్రకృతి సిద్ధమైన సహజ ఔషధంగా కూడా పనిచేస్తుంది. క్యారెట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల శరీరం ఎంతో చైతన్యవంతమవుతుంది. కాలిన గాయాలతో బాధపడేవారికి పచ్చి క్యారెట్ రసం గానీ, దాని పిప్పిగానీ కాలిన చోట రాసినట్లయితే, గాయం త్వరగా మానడమే కాక, చల్లగా ఉంటూ కాలిన గాయం బాధ నుంచి తాత్కాలిక ఉపశమనాన్ని కూడా కల్గిస్తుంది. కాలిన గాయాలు త్వరగా మానేందుకు దోహదపడు తుంది. అంతే కాక కాలిన గాయాల మచ్చలు కూడా క్యారెట్ రసం పూయడం వల్ల త్వరగా మానిపోతాయి. ఇక చిన్నారులు ఈ క్యారెట్ జ్యూస్‌ను కొన్ని వారాలపాటు సేవించినట్లయితే వారికి కడుపునొప్పి సమస్య ఉండనే ఉండదు. ఎందుకంటే క్యారెట్ చిన్నారుల కడుపుల్లో ఉండే నులిపురుగులు మలం ద్వారా బయటికి వెళ్ళేందుకు దోహదపడుతుంది. క్యారెట్ జ్యూస్‌లోని పీచు పదార్థం ప్రేవుల గోడలను శుభ్రం చేసి, మలినా లను బయటికి పంపించివేస్తాయి. అలాగే ఉదరకోశం, పిత్తం, వాతం, కఫం లాంటి సమస్యలకు కూడా క్యారెట్ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. ఇక ఈ క్యారెట్‌ను క్రమం తప్పకుండా ఆహారంతోపాటు తీసు కుంటే, ఇందులోని అధిక కేలరీలు చిన్నారుల మేధోవికాసానికి ఎంత గానో దోహదపడతాయని పలు సర్వేలు పేర్కొన్నాయి. క్యారెట్‌ను తీసు కోవడం వల్ల, దాని ప్రభావం మెదడుపై పనిచేసి, మెదడును ఉత్తే జపర్చడమే కాక, ఆలోచనాశక్తి కూడా పెరిగేలా చేస్తుందంటు న్నారు నిపుణులైన వైద్యులు. పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, ఇంటర్వ్యూ లకు వెళ్ళేవారు క్యారెట్ జ్యూస్‌ను తీసుకున్నట్లయితే, అది మంచి ఉత్ప్రేరకంగా పని చేసి, వాళ్ళను ఎంతో ఉత్సాహంగా, ఉత్తే జంగా ఉండేలా చేస్తుంది. క్రీడాకారులు కూడా ఆటల్లో రాణించేందుకు క్యారెట్‌జ్యూస్‌ను సేవిస్తుంటారు. ఇది వారికి ఓ మంచి టానికలాేగా ఉపయోగ పడుతుంది. రక్తహీనతకు కూడా క్యారెట్ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. క్యారెట్‌తోపాటు కాస్త తేనెను కలిపి పిల్లలకు ఇచ్చినట్లయితే వారి చర్మం కాంతివంతంగా తయారవు తుంది. దీర్ఘకాలిక రోగాలను సైతం క్యారె ట్లోని యాంటీ యాక్సిడెంట్స్ నయం చేస్తాయి. శరీరంలోని మృతకణాలను తిరిగి యాక్టివేట్ చేయ డం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. శరీరంలోని మృతకణాలు తిరిగి జీవం పోసుకోవాలంటే క్యారెట్ జ్యూస్ తప్పక సేవించాలి. ఇంకా ఈ క్యారెట్ల జ్యూస్ వల్లా, క్యారెట్‌ను పచ్చిగా అలాగే తినడం వల్లా నోటి అల్సర్ నివారణ సాధ్య మవుతుంది. క్యారెట్, టవెూటా, బత్తాయి పండ్ల రసాలను సమపాళ్ళలో తీసుకుని రెండు నెలల పాటు క్రమం తప్పకుండా వాడి నట్లయితే, నోటి అల్సర్నున పూర్తిగా నివారించవచ్చు. ఇంతే కాక నిద్రలేమి కి కూడా క్యారెట్ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. అందుకనే చిన్నారులకు రాత్రి పడుకోబోయే ముందు ఓ గ్లాస్ క్యారెట్ జ్యూస్ ఇచ్చి నట్లయితే వారు ఎంతో హాయిగా చక్కగా నిద్రిస్తారు. మంచి ఆహారం, మంచి నిద్ర పిల్లల మేథోవికాసానికి, భౌతిక వికాసా నికి ఎంతో దోహదపడతాయన్న విషయం అందరికీ తెలిసిందే. క్యారెట్ తినడం వల్ల మంచి పోషక విలువలు దేహానికి లభించి, మంచి ఆరోగ్యం చేకూరుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. మరి ఇంత మేలు చేసే, ఇన్ని ఔషధ గుణాలున్న క్యారెట్‌ను అమ్మతో చెప్పి చేయించుకుంటారు కదా బాలలూ! ఈ రోజు పిల్లలకు క్యారట్ పెట్టాం కదా అని వదిలేయక, క్రమం తప్పకుండా ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో క్యారెట్‌ను మీ చిన్నారులకు పెడితే, వారి ఆరోగ్యం పదికాలాలపాటు చక్కగా వర్ధిల్లుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.-బాలప్రభ డెస్క్ అంతా మన మంచికే! అనగనగా ఒక రాజు. ఆ రాజు పేరు విక్రమ సింహుడు. అతడు పరాక్ర మానికి పెట్టింది పేరు. అతడి ప్రధాన మంత్రి ఆదిత్యుడు. అతడు సత్య సంపన్ను డు, పరిపాలనా దక్షుడు, శివభక్తుడు, ఆస్తి కుడు. ఏమి జరిగినా ‘అంతా మన మం చికే’ అని భావించేవాడు. విక్రమ సింహునకు ఓ సోదరుడు. అతడి పేరు వనవీరుడు. మహా జిత్తుల మారి. అన్నను ఎలా పడగొట్టాలా అని ఎపðడూ పన్నాగాలు పన్నుతూ ఉండే వాడు. రహస్య కుట్రలు పన్నేవాడు. అత డికి ఎపðడూ సింహాసనాన్ని ఎలా ఆక్ర మించాలా అనేదే ధ్యాస. సింహాసనాన్ని కాజేయాలనే దురాశ. ఓ పర్యాయం విక్రమసింహుని వ్రేలు ప్రమాదవశాత్తూ తెగిపోయింది. దీని గురించి తన ప్రధానమంత్రి ఆదిత్యునితో చెబితే, యథా ప్రకారం ‘అంతా మన మం చికే ప్రభూ’ అన్నాడాయన. దాంతో రాజు కు చిర్రెత్తుకొచ్చింది. ఒళ్ళు మండిపోయింది. మనస్సు చివుక్కుమంది. అలా అంటాడేమి టని తోక తొక్కిన త్రాచులా బుసకొడుతూ ‘ఈ ప్రధాన మంత్రిని కారాగారంలో తోసే యండి’ అని ఆజ్ఞాపించాడు. రోజులు గడుస్తున్నాయి. సోదరుడు వనవీరునితో వేటకై అడవికి బయల్దేరాడు విక్రమసింహుడు. అది చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి. అలాం టి అడవిలో ప్రవేశించారు ఒకరి వెనుక మరొకరు. అపðడు ఓ భయంకర సింహం గర్జిస్తూ మార్గమధ్యంలో ఎదురైంది. రక్షిం చుకోవడానికి మరోమార్గం లేక వెంటనే అసంకల్పితంగా నేలపై నిశ్చలంగా పడుకు న్నాడు రాజు. సింహం రానే వచ్చింది. వ్రేలు లేని చేతిని పసిగట్టి, అదో జీవం లేని దేహమని గుర్తించి వెళ్ళిపోయింది. అపðడ ర్థమైంది రాజుకు, తన తెగిపోయిన వ్రేలే తనని కాపాడిందని. వెనకన వస్తున్న సోదరుడు వనవీరుడు, పరివారం తన కోసం వెతుకుతూ వస్తారని ఎదురు చూసిన రాజుకు నిరాశే మిగి లింది. అది నడి రాత్రి. సైనికులు చలి మంట కాచుకుంటూ పరుషంగా మాట్లాడు కుంటున్నారు. తననూ, తన ప్రధానమంత్రి ని చంపేందుకు వనవీరుడు చేసే కుట్రను మాటల్లో విన్నాడు రాజు. ఇక క్షణమా లోచించక వెంటనే సైన్యాధ్యక్షుణ్ణి పిలిచి, ‘ఆ సైనికుల్ని బంధించండి’ అన్నాడు. అంతే ఆయన, అనుచరులతో కలిసి, మెరుపు వేగంతో వనవీరుణ్ణీ, అతని అను చరులను బంధించాడు. తిరిగొచ్చిన రాజు కారాగారాన్ని తెరి పించి మంత్రి ఆదిత్యున్ని విడుదల చేసి హర్షాతిరేకంతో కౌగలించుకున్నాడు. తన తపðను మన్నించమని ప్రాధేయపడి, ఘనం గా కానుకలిచ్చి సన్మానించాడు మంత్రిని. అపుడు రాజు మాట్లాడుతూ, ‘మంత్రి వర్యా! అంతా మన మంచికే అంటావు కదా! మరి నిన్ను కారాగారంలో బంధిం చాము, నీ కేమి మంచి జరిగింది అని ప్రశ్నించాడు. అపðడు మంత్రి వినయం గా, ‘రాజా! నేను శివభక్తుడ్ని, ఆయనకు దేవాలయం నిర్మించాలనుకున్నాను, తగి నంత ధనం లేక ఆ పని వాయిదా వేస్తూ వచ్చాను. మీరు నన్ను కారాగారంలో బంధించబట్టి, మీ తపðను తెలుసుకుని నాకు ఘనంగా కానుకలిచ్చి సత్కరించారు. మీరిచ్చిన ఈ కానుకలతో నేను శివాల యాన్ని కట్టించొచ్చు’ ఆ విధంగా నాకూ మంచే జరిగింది అన్నాడు. కావున బాలలూ, ఏది జరిగినా ‘అంతా మన మంచికే’ అని ముందడుగేయాలి. ప్రతికూల ఫలితాలు వస్తే భయపడరాదు. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరు గుతుందని ఈ కథ చెబుతోంది కదా! ఫాస్ట్ ఫుడ్స్ వద్దు..పండ్లే ముద్దు..! పిల్లలు సాధారణంగా రోజూ ఒకేరకమైన ఆహార పదార్థాలు తినీ, తినీ విసుగుచెంది, ఫాస్ట్ ఫుడ్స్‌పై మక్కువ చూపిస్తుంటారు.ఫాస్ట్ ఫుడ్స్ తినేటపðడు బాగానే ఉంటాయి కానీ, పిల్లలు వీటికి అలవాటు పడ్డారంటే భవిష్యత్తులో ఎన్నో సమస్య లను ఎదుర్కోవాల్సి వస్తుం దని హెచ్చరిస్తున్నారు వైద్యు లు. బేకరీలు, ఫాస్ట్ ఫుడ్స్ సెంటర్లలో లభించే చిప్స్, సవెూసాలు పేస్ట్రీలు లాంటి పధార్థాలు పిల్లల నోటికి రుచిగా అన్పించి పదే పదే వాటిని తినేందుకు ఇష్టపడ తారు. ఇలా వారు రోజూ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, అవి వారి జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని కలుగజేసి, అనేక అనర్థాలకు దారి తీస్తాయని చెబు తున్నారు వైద్యులు. ఈ ఫాస్ట్ ఫుడ్స్‌కు అలవాటు పడిన పిల్లలు తరచూ అనారోగ్య సమస్యలకు గుర వడమే కాక, వారిలో క్రమేణా ఊబకాయం వచ్చే అవకాశం కూడా ఉంటుందంటున్నారు వైద్యులు. డీప్ ఫ్రై చేసే పదార్థాలలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయనీ, వాటి శాతం శరీరంలో అధి కమైతే భవిష్యత్తులో గుండెపోటు రావడం కూడా ఖాయమంటున్నారు వైద్యులు. ఫాస్ట్ ఫుడ్స్ అపðడ పðడు తీసుకుంటే ఫర్వాలేదు కానీ, రోజూ వాటికి అలవాటు పడితే ఊబకా యంతో పాటు, గుండెపో టుకు కూడా గురికాక తప్ప దని వైద్యులు హెచ్చరిస్తు న్నారు. ఫాస్ట్ ఫుడ్స్ కంటే పిల్ల లకు సీజనల్‌గా వచ్చే పం డ్లనన్నింటినీ పిల్లలకు పెడితే మంచి పోషకవిలు వలు చేకూరి, అన్నిట్లో చురుకుగా ఉంటారని పేర్కొంటున్నారు వారు. రోజూ క్రమం తప్పక లంచ్, డిన్నర్ తర్వాత ఒక అరటిపండును తీసుకోవడం ఎంతో మంచిదని, ఫాస్ట్ ఫుడ్స్ కంటే పండ్లే మంచి ఆహారపదార్థాలని వైద్యులు తేల్చి చెబుతున్నారు. మైగ్రెయిన్ తలనొప్పికి ఆయుర్వేద పరిష్కారాలు మైగ్రెయిన్ అనేది తరచూ వచ్చే తలనొప్పి. రక్తనాళాలు, నరాలు మెదడుకు చెందిన సెరటోటిన్, నార్ ఎడ్రినలిన్ వంటి జీవరసాయన పదార్థాల్లో చోటుచేసుకునే మార్పువల్ల వస్తుంది. ఇందులో క్లాసిక్ మైగ్రెయిన్, కామన్ మైగ్రెయిన్ అని రెండు రకాలున్నాయి. ఏడాదికి రెండు మూడు సార్లే వస్తుంది. సాధారణంగా దీనితో ప్రాణహానీ ఉండదు. అయితే తలనొప్పి తీవ్రత హెచ్చుస్థాయిలో ఉండటంతో బాధితుల రోజువారి పనులకు ఆటంకం కలుగుతుంది. దీనితో నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ఆయుర్వేదంలో వివరించిన అర్ధావభేదం (తల సగభాగంలో నొప్పి), అనంతవాతం (తరచూ తలనొప్పి తిరగబెడుతుండటం) అనే వ్యాధుల వర్ణన మైగ్రెయిన్ వ్యాధి లక్షణాలతో సరిపోతుంది. కారణాలు మైగ్రెయిన్ తలనొప్పికి స్పష్టమైన కారణాలు తెలియవు. అయితే వాతావరణపరమైన అంశాలు, జన్యుపరమైన సమస్యలు మొదలైనవాటిని కొన్నిటిని వైద్య శాస్తవ్రేత్తలు కారణాలుగా భావిస్తున్నారు. ఆయుర్వేదంలో ‘అసాత్మేంద్రియార్థ సంయోగం’ అనేదాన్ని ఒక ప్రధాన హేతువుగా చెప్పారు. చూపు, రుచి, వాసన, స్పర్శ వంటి జ్ఞానేంద్రియ విధులు అసహజమైన రీతిలో జరిగినప్పుడు తలనొప్పి వస్తుంది. వీటిని గమనించి తగినచర్యలు తీసుకోవడం ద్వారా మైగ్రెయిన్ తగ్గించుకోవచ్చు’. మైగ్రెయిన్ బయటపడడానికి ముందు తలలో కొన్ని మార్పులు జరుగుతాయి. ముందుగా శరీరాంతర్గతమైన లేదా వాతావరణపరమైన అంశం ప్రేరకంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ దీనికి ప్రతిస్పందించి విద్యుదావేశాన్ని మెదడంతా పరుచుకునేలా చేస్తుంది. విద్యుత్ చర్యవల్ల మెదడులోని కణజాలాలు కొన్నిరకాల జీవరసాయనాలను విడుదల చేస్తాయి. వీటివల్ల రక్తనాళాలు ఉబ్బిపోయి పటిష్టతను కోల్పోతాయి. వీటి గోడల నుండి ప్రేరకపదార్థాలు తప్పించుకొని మెదడు అడుగుకు చేరుకొని అక్కడ ఉండే నొప్పిగ్రాహక కేంద్రాలను చేరుకొని తలనొప్పికి కారణమవుతాయి. ఇది మైగ్రెయిన్ ప్రాప్తించే విధానాన్ని తెలిపే ఒక ప్రతిపాదిత సిద్ధాంతం (హైపోథిసిస్). లక్షణాలు మైగ్రెయిన్ తలనొప్పి సాధారణంగా మూడు దశలుగా వస్తుంటుంది. మొదటిది హెచ్చరిక దశ. రెండవది ఆరా లేక పూర్వరూపదశ. మూడవది పూర్తిస్థాయి రూపదశ. మొదటిదశ మైగ్రెయిన్‌కు ముందు హెచ్చరికపూర్వకమైన లక్షణాలతో మొదలవుతుంది. మానసిక స్థితిలోను, మూడ్‌లోను మార్పు రావటం, నీరసం, కడుపుబ్బరింపు, కండరాలు పట్టేసినట్లు ఉండటం, ఆవలింతలు, ఆహారపదార్థాలపట్ల మితిమీరిన వ్యామోహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలనొప్పికి కొన్ని గంటల ముందు ఈ లక్షణాలు కనిపిస్తాయి. రెండవ దశ ఆరా. ఇది మైగ్రెయిన్‌కు ముందు పూర్వరూపాలతో కనిపించే స్థితి. దీని లక్షణాలు పావుగంట నుంచి అరగంట వరకూ కొనసాగుతాయి. కళ్ళముందు మెరుపులు మెరిసినట్లు ఉండటం, తాత్కాలికంగాను, పాక్షికంగాను చూపు కోల్పోవటం, మాట్లాడలేకపోవటం, కాళ్ళూ చేతుల్లో బలహీనత ప్రాప్తించటం, ముఖంలోనూ, చేతుల్లోనూ తిమ్మిర్లుగానూ అవిశ్రాంతంగానూ, ఆరాటంగాను అనిపించటం, అయోమయం ఆవహించటం ఇవన్నీ మైగ్రెయిన్‌కు ముందు కనిపించే లక్షణాలు. అలా కనిపించడం మొదలైన తరువాత, దాదాపు గంట వ్యవధిలో అసలైన మైగ్రెయిన్ లక్షణాలు కనిపించడం మొదలెడతాయి. మైగ్రెయిన్‌లో సాధారణంగా తలలో ఒక పక్కనే నొప్పి వస్తుంది. అందుకే దీనిని ఆయుర్వేదంలో అర్ధావభేదం అంటారు. కొన్ని సందర్భాల్లో రెండు పక్కలా రావచ్చు. తలనొప్పి తీవ్రాతి తీవ్రంగా వస్తుంది. నొప్పి లక్షణం పొడుస్తున్నట్లూ (థ్రాబింగ్) ఉబుకుతున్నట్లూ (పల్లేటింగ్) ఉంటుంది. కదలికతో తలనొప్పి ఎక్కువవుతుంది. అనుబంధ లక్షణాలుగా వాంతులు, వికారం ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నీళ్ల విరేచనాలు కూడా కావచ్చు. కాంతినీ శబ్దాలనూ సహించలేకపోవటం మైగ్రెయిన్ ప్రధాన లక్షణం. కండరాల నొప్పులు, సలుపులు ఉంటాయి. తల తిరుగుతున్నట్లూ కళ్లు తిరిగి పడిపోతున్నట్లూ అనిపిస్తుంది. ఉపశయ, అనుపశయాలు కొన్నిరకాల ఆహార పదార్థాలు. మైగ్రెయిన్ ఎక్కువ చేస్తాయి. వీటిని ఎవరికి వారు గుర్తించుకుని వాటికి దూరంగా ఉండాలి. మెడిటేషన్, మొక్కలను పెంచటం, వ్యాయామం, నడక, మసాజ్, ఆటలు, సంగీతం, పెంపుడు జంతువులతో గడపటం, లలితకళలు – ఇవన్నీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహకరిస్తాయి. కొంతమంది నిద్రలో పళ్ళు నూరటం, దవడకండరాలను బిగించటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయటంవల్ల కండరాలు బిగుసుకుపోయి తలనొప్పి ప్రారంభమవుతుంది. రిలాక్సేషన్ ప్రక్రియల ద్వారా ఈ అలవాటు నుంచి క్రమంగా బయటపడాలి. గాఢమైన వాసనలను పీల్చకూడదు. ముఖ్యంగా పర్ఫ్యూమ్స్, సెంట్లు, అత్తర్లు వంటి కృత్రిమ సుగంధ ద్రవ్యాల నుంచీ దూరంగా ఉండాలి. సాధారణంగా మైగ్రెయిన్ వచ్చి తగ్గిన తరువాత రక్తంలో చక్కెర మోతాదు తగ్గిపోయి నీరసం వస్తుంటుంది. ఆయుర్వేద చికిత్స, సూచనలు తలనొప్పి కేంద్రీకృతమైన ప్రదేశంలో ఐస్ నీళ్ళతో తడిపిన చల్లని గుడ్డను లేదా మంచుగడ్డలు చుట్టిన మూటను ప్రయోగించాలి. దీనివల్ల వ్యాకోచించిన రక్తనాళాలు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. తలనొప్పి మొదలైన వెంటనే ఒక చీకటి గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. మహాచందనాది తైలం వంటివాటితో తలను, కణతలను, అరికాళ్ళను సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. నిద్రపోవటానికి ప్రయత్నించాలి. మైగ్రెయిన్‌లో నస్యకర్మవల్ల చక్కని ఫలితం కనిపిస్తుంది. లక్షణ తీవ్రత, ప్రాబల్యాలను బట్టి సరైన ఔషధ సిద్ధతైలాన్ని నిర్ణయించి ముక్కుద్వారా ప్రయోగించటం నస్యకర్మలోని ప్రధాన ప్రక్రియ. దీనివల్ల తలలోని దోషాలు సమస్థితిలోకి వచ్చి నొప్పి తగ్గుతుంది. ధార చికిత్స కూడా తలనొప్పి తగ్గుతుంది. మానసిక వత్తిడి ఎదురైనప్పుడు చాలా మందికి నుదురు ప్రాంతంలో చెమట పడుతుంది. కొంతమంది టెన్షన్ తగ్గించుకోవడానికి గాని, ఆలోచనలకు పదును పెట్టుకోవడానికి గాని నుదురు రుద్దుకుంటారు. దీనినిబట్టి నుదురు అనేది టెన్షన్‌ని బయట పడేసేందుకు తోడ్పడే ముఖ్యమైన ప్రదేశమని మనకు అర్థమవుతుంది. ఆయుర్వేద ‘ధరా చికిత్స’తో ఈ ప్రదేశాన్ని శక్తివంతం చేయవచ్చు. ఔషధ సిద్ధ తైలాన్ని నుదురుమీద ధారగా పడేలా చేయటం దీనిలో ప్రధాన ప్రక్రియ. ఈ చికిత్స మైగ్రెయిన్‌లో అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఒత్తిడి కారణంగా వచ్చే సైకోసొమాటిక్ వ్యాధుల్లో అత్యంత ఉపయోగకారి. మైగ్రెయిన్‌లో సువర్ణ సూర్తావర్తి, సూతశేకరరసం, దశమూలారిష్టం, గోదంతి భస్మం, ప్రవాళపిష్టి, గుడూచి సత్వం వంటి ఔషధాలు అనేకం నమ్మకంగా పనిచేస్తాయి. వీటిని వైద్య సలహాను అనుసరించి వాడుకుంటే తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. గృహచికిత్సలు: తిప్పతీగ స్వరసాన్ని రెండు చెంచాలు మోతాదుగా, తేనెతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి. అలాగే, ఆవు నెయ్యిలో కుంకుమ పువ్వును వేసి ఒక్కో ముక్కు రంధ్రంలో రెండేసి చుక్కల చొప్పున వేసుకుని బలంగా పీల్చాలి. నుదురుకు, కణతలకు చందన లేపాన్ని (మంచి గంధం పేస్టును) రాసుకోవాలి. - డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్muralimanoharch@hotmail.com యునానితో… అన్ని వ్యాధులు నయం యునాని అనేది ఒక దేశం పేరు. ప్రస్తుతం ఆ దేశాన్ని గ్రీకుగా పిలుస్తు న్నారు. చాలా సంవత్సరాల క్రితం మనిషికి సంబంధించిన వైద్యం, విద్య ఇలా ప్రతి ఒక్కటి గ్రీకు నుంచే మొదలయ్యాయి. వైద్యానికి తండ్రిగా పిలవబడే హెప్సోక్రేట్ (బొక్రాత్) చాలా రకాల రోగాల గురించి కనుక్కొన్నారు. అవి క్లినికల్ పిక్చర్స్, సిమ్టమ్స్,వీటికి సంబంధించిన సైంటిఫిక్ యునాని వైద్యం. ఈ ఆధునిక కాలంలో వైద్య రంగంలో అన్ని రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆధునిక వైద్యంలో 50 శాతం రోగాలకు పూర్తిగా వైద్యం లేదు. మనం జీవితాంతం ఆ మందులు వాడినా వ్యాధులు తగ్గకుండా కొంతకాలానికి ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆ మందులని మనం వాడకుండా ఉండలేకపోతున్నాము. దీనికి కారణం ఈ కాలపు బిజీ జీవితాలలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవటం, ఇంకా మనకు ఏ ఆహారం తీసుకుంటే మన ఆరోగ్యానికి శ్రేష్ఠమో తెలీదు. ఒకవేళ తెలిసినా ఇప్పుడు వస్తున్న ఆహార పదార్థాలు మనకు రసాయనాలు కలపి రావటం వల్ల మనకు చాలా విటమిన్ల లోపాలు కలుగుతున్నాయి. ప్రత్యేక వన మూలికలతో వైద్యం… కొన్ని రోగాలకు ఇంగ్లీష్ వైద్యంలో పూర్తిగా వైద్యం లేదు. కానీ అన్ని రకాల వ్యాధులకు యునాని మందులు ఉన్నాయి. ఈ మందులతో ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. యునాని వైద్యంతో ఈ క్రింది వ్యాధులను నయం చేయవచ్చు. రకరకాల గుండె జబ్బులు. రక్తంలో క్రొవ్వు పదార్థాలు పెరగటం. అన్ని రకాల పక్షవాతములు. దమ్ము రోగం(ఎలర్జీ). డయాబెటిస్. 12 రకాల కీళ్ల వ్యాధులు . క్యాల్షియం తగ్గడం వల్ల ఎముకలు బలహీ నపడటం. లైంగిక వ్యాధులు . పిల్లలు పుట్టకపోవడం. హెచ్ఐవి. సౌందర్యం కొరకు- కలర్ ఫెయిర్‌నెస్, బ్యూటీ కేర్. చర్మానికి సంబంధించిన వ్యాధులు : మొటిమలు రావటం, స్కిన్ఎలర్జీ, జటు ్టరాల టం, చుండ్రు, చర్మ వ్యాధులు. మూత్ర పిండాల లో రాళ్లకు ఆపరేషన్ లేకుండా వైద్యం. కాలేయానికి సంబంధించిన వ్యాధు లుః హెపటైటిస్, పచ్చ కామర్లు, హై బ్లడ్ ప్రెషర్. అర్షమొలలు. - డాక్టర్ ఎ.యం.ఖాన్,బి.యం.యం.ఎస్, ఎం.డి(ఉస్మానియా) .ఫోన్‌నెం: 9849077149, 9391015878 పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ‘సంజీవని’ మొక్కలు రాత్రనకా పగలనకా పంట పొలాల్లో తిరిగే రైతన్నలు తరచుగా పాము కాటుకు గురవుతుంటారు. అలాంటి సందర్భాల్లో సంజీవనిలా పని చేసే కొన్ని ఔషధ మొక్కలు చేరువలోనే ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో వాటిని ఉపయోగించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు అనేకం. ఈ నేపథ్యంలో పాము కాటు నుండి ప్రాణాలు కాపాడే ఔషధ మొక్కలు, వాటిని ఉపయోగించే విధానం గురించి కృష్ణా జిల్లా జి.కొండూరు మండల వ్యవసాయాధికారి డాక్టర్ జి.రమేష్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. ఆ వివరాలు…ప్రపంచంలో మూడు వేల రకాల పాములు ఉన్నప్పటికీ వాటిలో సుమారు 350 రకాలు మాత్రమే విషపూరితమైనవి. వీటిలో కట్లపాము, తాచుపాము, రాచనాగు, రాటిల్పాము, సముద్ర సర్పం, రక్తపింజర అతి ప్రమాదకరమైనవి. వీటిలో తాచుపాము, నాగుపాము, కట్లపాము కాటేస్తే వాటి విషం నేరుగా కేంద్ర నాడీ మండలం, ఊపిరితిత్తులపై పని చేస్తుంది. హృదయ స్పందన ఆగి అప్పటికప్పుడే మరణం సంభవిస్తుంది. రక్తపింజర విషం ఎక్కువగా రక్తనాళాలపై ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు చిట్లి నోటి నుండి రక్తం వస్తుంది. రక్తనాళాల్లో రక్త ప్రసరణ ఆగిపోతుంది. రక్తం గడ్డకట్టడం వల్ల కాటుకు గురైన వ్యక్తి మరణిస్తాడు. ఎలా గుర్తించాలి? పాము కాటు శరీరం పైన పడిందా లేక బట్టల పైన పడిందా అన్న విషయాన్ని ముందుగా పరిశీలించాలి. శరీరం పైన కాటు వేస్తే ఎన్ని గాట్లు పడ్డాయో చూడాలి. తాచుపాము, కట్లపాము, రక్తపింజర కాటేస్తే రెండు గాట్లు పడతాయి. అంతకంటే ఎక్కువ గాట్లు కన్పిస్తే అది సాధారణ పాముగా గుర్తించవచ్చు. ఏం చేయాలి? కాటు వేసిన శరీర భాగం నుండి ఇతర భాగాలకు రక్తప్రసరణ జరగకుండా పై భాగాన రబ్బరు లేదా తాడు లేదా గుడ్డతో గట్టిగా కట్టాలి. దీనివల్ల విషం త్వరగా గుండెకు చేరకుండా నివారించవచ్చు. దీంతో పాటు పాము కాటుకు గురైన వ్యక్తి నడవడం, పరిగెత్తడం వంటి పనులు చేయకుండా విశ్రాంతి తీసుకునేలా చూడాలి. ఔషధ మొక్కలు ఇవే నేటి ఆధునిక యుగంలో ఔషధ మొక్కల్ని వాడడం మొరటు వైద్యంగా కన్పించవచ్చు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా వీటిని ఉపయోగిస్తే రోగిని బతికించుకునే అవకాశాలు మెరుగుపడతాయి. తులసి, గాడిద గడప, పొగాకు, మారేడు, నేల వేము వంటి మొక్కలు ఈ కోవకు చెందినవే. తులసి మొక్కలు అందరికీ అందుబాటులో ఉండేవే. పాము కరిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే పావు కిలో తులసి ఆకుల్ని బాగా నమిలి మింగాలి. పొలాల్లో కలుపు మొక్కగా పెరిగే గాడిద గడప వేరును మెత్తగా నూరి పాము కరిచిన చోట ఉంచి కట్టు కట్టినా ప్రయోజనం ఉంటుంది. దీంతో పాటు రెండు చెంచాల వేరు పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి తాగించాలి. పచ్చి పొగాకు అందుబాటులో ఉన్నట్లయితే దాని రసం తీసి తాగించాలి. ఎండు పొగాకు ఉంటే దానిని నీటిలో నానబెట్టి సారం దిగేంత వరకూ బాగా నలిపి వడకట్టి తాగించాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగిస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారు. పొగాకును మెత్తగా నూరి పాము కాటు వేసిన చోట ముద్దగా కట్టినా మంచి ఫలితం ఉంటుంది. మారేడు ఆకుల్ని మెత్తగా నూరి రసం తీసి రోగితో తాగిస్తే పాము కాటు నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక అన్ని ప్రాంతాల్లో కన్పించే నేల వేము మొక్కను మెత్తగా నూరి గ్లాసు నీటిలో కలిపి రోగితో తాగించాలి. ఈ విధంగా అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగించాలి. ఔషధ మొక్కల్ని ఉపయోగించిన తర్వాత రోగిని ఆసుపత్రికి తీసికెళ్లి అవసరమైన చికిత్స చేయించాలి. వంట గదిలో దొరికేవి కూడా… వంట గదిలో దొరికే పసుపు, మిరియాలు, వెల్లుల్లి, నిమ్మకాయ సైతం పాము కాటుకు సంజీవనిలా పని చేస్తాయి. నాణ్యమైన పసుపు కొమ్ముల్ని పొడి చేసి రెండు చెంచాల పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి అరగంటకు ఒకసారి చొప్పున నాలుగైదు సార్లు తాగిస్తే రోగి కోలుకుంటాడు. అలాగే 100 గ్రాములు తెల్ల మిరియాలను పొడి చేసి కషాయం కాచి వడపోసి రెండు మూడు సార్లు తాగించినా ఫలితం ఉంటుంది. 20 వెల్లుల్లి పాయల్ని నూరి పాలలో కలిపి తాగిస్తే ప్రాణాపాయం నుండి రోగి బయటపడతాడు. అదే విధంగా నిమ్మకాయలోని 10-15 గింజల్ని మెత్తగా నూరి నీటిలో కలిపి తాగించవచ్చు. ఇవి కూడా… ఈశ్వరి, ఉడుగ, విషముష్టి, పొడపత్రి మొక్కలు కూడా పాము కాటు నుండి ప్రాణాలు కాపాడేవే. అరుదుగా లభించే తీగ జాతి మొక్క ఈశ్వరి వేరును అరగదీసి పాము కరిచిన చోట పూయాలి. ఆ తర్వాత రెండు చెంచాల పొడిని అర గ్లాసు మంచి నీటిలో కలిపి తాగించాలి. ఉడుగ (దీనినే నట్లాడుగ, అంకోలం అని కూడా పిలుస్తారు) మొక్క వేరును మెత్తగా నూరి పొడి చేసి నీటిలో కలిపి తాగించవచ్చు. దీనిని వాడినప్పుడు వాంతులు అయినప్పటికీ రోగి త్వరగా కోలుకుంటాడు. విషముష్టి లేదా నాగముష్టి వేర్లను పొడి చేసి రోగి చేత తినిపించినా ఫలితం ఉంటుంది. అలాగే పొడపత్రి ఆకు కషాయాన్ని కూడా తాగించవచ్చు. ఈ విధంగా ఆసుపత్రికి తీసికెళ్లడం సాధ్యం కాని అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం చేయకుండా మనకు అందుబాటులో ఉండే ఔషధ మొక్కల్ని ఉపయోగించి రోగి ప్రాణాలు కాపాడవచ్చు. తేలు, మండ్రగబ్బ, తేనెటీగలు, కందిరీగలు వంటివి కుట్టినప్పుడు కూడా ఈ మొక్కల్ని ఉపయోగించి రోగికి ఉపశమనం కలిగించవచ్చు. ఇలా చేయకూడదు పాము కరిచిన వెంటనే ప్రాణం పోతుందనే భయంతో పరిగెత్తితే విషం మరింత వేగంగా గుండెకు చేరి ప్రాణాలు త్వరగా పోయే ప్రమాదం ఉంది. పాము కరిచిన చోట పెద్దగా గాయం చేసి విషాన్ని నోటితో పీల్చి ఉమ్మేయడం కూడా మంచిది కాదు. దీనివల్ల గాయం మరింత పెద్దదై విషం చర్మంలోకి, చుట్టుపక్కల ఉన్న కణాల్లోకి వ్యాపించి త్వరతిగతిన గుండెకు చేరుతుంది. వెల్లుల్లి ఒక ఆరోగ్య రక్షా కవచం మనలో చాలామందికి జలుబు ముక్కు దిబ్బడ, జ్వరం వస్తూ వుంటాయి. వాళ్ళు వెల్లుల్లి రోజూ ఆహారంలో తీసుకుంటే వ్యాధినిరోధశక్తి పెరిగి తరచుగా వచ్చే స్థితిని తగ్గిస్తుంది. అందువల్ల అరచెమ్చా నేతిలో వేయించిన రెండు వెల్లుల్లి పాయలను క్రమం తప్పకుండా రోజు తినడం మంచిది. నీ ముఖం, శరీరం, వర్చస్సు ఆకర్షణీయంగా వుండాలంటే రెండు వెల్లుల్లి పాయలరసం అరగ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి తీసుకోండి. దీని వలన రక్తం శుభ్రపడుతుంది. దేహకాంతి పెరుగుతుంది. అపుడు చాక్లెట్లు మసాలావస్తువులు తినకూడదు. ఒళ్ళు తగ్గాలనుకుంటున్నారా, సగం నిమ్మ కాయ రసంతో, కొంచెం వేడినీళ్ళు కలిపి అందులో రెండు చిన్నవెల్లుల్లి పాయలని కలిపి ఉదయం సాయంత్రం తీసుకుంటుంటే క్రమంగా ఒళ్ళు తగ్గుతుంది. అలా మూడు నెలలు తీసుకోండి చాలు. కాని ఆ సమయం లో కొవ్వు పదార్థాలు, పగటినిద్ర మానేయండి. కొంచెం సేపు నడవండి. చెవిపోటు వస్తే వేడి చేసిన వెల్లుల్లిరసం నాలుగు చుక్కలు చెవిలో వేయండి. కడుపుతో వున్నప్పుడు రోజు ఒక వెల్లుల్లిని పాలతో తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతాడు. రోజూ రెండు వెల్లుల్లిపాయలను క్యాన్సర్ వున్నవాళ్ళు తీసుకుంటే, క్యాన్సర్ కణాలు తిరిగి గడ్డకట్టడం దూరమవుతుంది. మోకాళ్ళు నొప్పులు వున్నవాళ్ళు వెల్లుల్లి రసం ఎనిమిది చుక్కలు అరగ్లాసుపాలలో కలిపి తీసుకుంటే చాలా మంచిది. వెల్లుల్లి నూనెగా, చుక్కల మందుగా రసాయనిగా ఆయింట్‌మెంట్‌గా వాడతారు. వెల్లుల్లి, గుండెజబ్బులు రాకుండా, రక్తవాహికలో కొవ్వు చేరకుండా శరీరంలో సహజరక్షణశక్తి తగ్గకుండా ఉంచుతుంది. అని నిర్ధారించారు వైద్యులు. క్యాన్సర్ వ్యాధి నుండి వెల్లుల్లి రక్షణనిస్తుంది. వెల్లుల్లిలో అత్యవసర విటమిన్లు మినరల్స్ ఉంటాయి. ఎబిసిడిఇ విటమిన్లు జర్మేనియం వున్నాయి. ఇది శరీర రక్షణ శక్తిని పెంచి శరీరంలో వున్న మలినాలను బయటకు పంపేందుకు సహాయపడుతుంది. అనేక పరిశోధనల్లో తేలిందేమంటే పాత వెల్లుల్లి వండికాని వండకుండా కాని తీసుకుంటే గుండెజబ్బులురావని వచ్చినవాళ్ళకి గుండెని కాపాడే చక్కటి మందు. పాతవెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వంటబట్టేశక్తి వుండటం వల్ల గుండె జబ్బులోను శరీరపు గాయాలు మానేశక్తిని పెంపొందించటంలో చాలా సహాయపడుతుంది. వెల్లుల్లిని మితంగా వాడకూడదు. కొంతమందికి వేడి చేస్తుంది. కొంతమందికి చర్మంపై దద్దుర్లు వస్తాయి. అలాంటప్పుడు వెల్లుల్లి వాడకాన్ని తగ్గించండి. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి. ఉసిరితో ఎంతో మేలు ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలను తొలిగిస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. బలాన్ని ఇచ్చే బాదం బలవర్ధకమైన ద్రవ్యం బాదం పప్పు. ఇది ఖరీదైనదైనా, అంతకంటే ఖరీదు ఉండే టానిక్‌లతో పోలిస్తే మా త్రం చౌకైనదే అని చెప్పవచ్చు. బాదం పప్పు శరీర ఆరోగ్యానికీ, మానసిక ఆ రోగ్యానికీ మంచిది. పోషకాహారంగానే గాకుండా కొన్ని అనారోగ్యాలను పోగొట్టడంలో కూడా బాదం ప్రయోజనకరమైన ద్రవ్యం. ఎలా వాడితే మంచిది? వీటిని నేరుగా అలాగే వాడే కంటే, ఒక పూట నీళ్ళలో బాగా నానబెట్టి, పైన ఉన్న పొరలాంటి తొక్కను తీసేసి, ముద్దగా నూరి వాడడం మంచిది. ఇలా చే యడం వల్ల బాదం పప్పు సరిగ్గా అరిగి శరీరానికి వంటబడుతుంది. బాదంపాలు బాదంతో పాలు తయారు చేసుకోవచ్చు. బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వారకూ కలపాలి. బలవర్ధకం కూడా. ఆవు పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ ఆహారం అందుతుంది. మంచి టానిక్ బాదంలో ఉన్న ఖనిజ లవణాల వలన ఇది మంచి టానిక్‌గా పనిచేస్తుంది. కొత్త రక్తకణాలు తయారయ్యేలా చేస్తుంది. శరీరంలోని మెదడు, గుండె, కా లేయం, నరాలు, కండరాలు, మనసు అన్నీ సక్రమంగా పని చేయడంలో బా దం చాలా సహాయపడుతుంది. రక్తహీనత ఉన్నవారు ప్రతి రోజూ పరిమితం గా బాదం తినడం వలన రక్తవృద్ధి జరుగుతుంది. రోజూ రాత్రి 10-15 బా దం పప్పులు తినడం వలన సాఫీగా విరేచనం అవుతుంది.చర్మవ్యాధుల్లో బాదం నూనెను పైపూతగా వాడవచ్చు. వీర్యవృద్ధికి బాదం సాయపడుతుంది. కొన్ని సూచనలు ఇందులో కొవ్వు ఎక్కువ కనుక లావుగా ఉన్న వారు ఎక్కువగా తినకపోవడం మంచిది. తొక్క తీసి తింటే మంచిది. భోజనం చేయగానే తినకూడదు. పిల్లలకు పరిమితంగా బాదం పప్పు ఇచ్చినట్లయితే, ఆరోగ్యంగా ఉంటారు. డాక్టర్ గాయత్రీదేవిఆయుర్వేద వైద్యనిపుణులుఆరోగ్యపీఠం, మోతీనగర్హైదరాబాద్ఫోన్ నెం. 98488 30055 పీచులో ఉందిలే మజా పీచు చేసే మేలు ఈనాటి ఫాస్ట్ తరానికి తెలీదు. వృద్ధాప్య తరానికి తెలుస్తుంది. ఉదయానే్న మోషన్ అవక వాళ్లెంత ఇబ్బంది పడ్తారో… అసలు పీచు పదార్థం తీసుకొన్నవాళ్ళకు ఆహారం జీర్ణమవడమేకాదు చర్మానికి కాంతి కూడా వస్తుంది. * నూడిల్స్, పిజ్జాలు, బర్గర్లు, కెంటకీ చికెన్లు… వీటిలో పీచుపదార్థం ఏదీ ఉండదు. నోటికి టేస్ట్… ప్రేవులకు రెస్ట్. ఉదయానే్న మలబద్దకం.. పీచు ఎక్కువ తింటే జీర్ణశక్తిలో ఎలాంటి లోపాలు కలుగవు. ప్యాకేజ్ ఆహారాన్ని పక్కన బెట్టండి. ఇవి ఫైబర్‌ని నాశనం చేస్తాయి. * పూర్వం బీరకాయ కూర చేసేటప్పుడు, బీరకాయ తొక్కు వృథా పోనిచ్చేవారు కారు. తొక్కు పచ్చడి ఉండేది… కేలరీలకు కేలరీలు. ఫైబర్‌కి ఫైబర్. * పీచు పదార్థములు తినడం కష్టం కాదు. అదో అలవాటుగా చేసుకోవాలి. వినడానికి, చూడటానికి ఎబ్బెట్టుగా ఉన్నా ఆచరించి తీరాల్సిన నిజాలవి. వేరుశెనక్కాయలు తింటున్నారనుకోండి.. తొక్కలు పారేస్తారు కదా! నాల్గైదు కాయలు గింజలతో సహా నమిలి మింగండి. ఏ కూరగాయకూ తొక్కును సాధారణంగా తీయకండి. * ముడిబియ్యం ఎక్కువ వాడండి * మైదా పిండికంటె చపాతీ పిండి, మొక్కజొన్న పిండి, జొన్నపిండిని బాగా వాడండి. * రాగి అన్నం, జొన్న అన్నం, ఇలా వెరైటీ ట్రై చెయ్యండి. ముదురు కూరగాయలు తినడం అలవాటు చేసుకోండి. * బీన్స్, బక్రా, పొట్టు ధాన్యాలు, ఓట్స్, ధాన్యంతో తయారయిన బ్రెడ్ వీటిల్లో పీచు అధికమోతాదులోనే ఉంటుంది. * రోజూ పీచు 25 గాములు తప్పనసరిగా తినాలి. అప్పుడే మనకు జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ పీచు పదార్థం మనం తీసుకోకపోతే అనారోగ్యం పలుకరిస్తుంది. * 35 గ్రాముల పీచు తింటే… మీకు కోవాన్‌క్యాన్సర్ 40 శాతం తగ్గినట్టే అంటున్నారు పీచు నిపుణులు. డా. కె. సంధ్యారాణి పొట్ట ఉబ్బరించిందా? పేగుల్లో తయారయ్యే గ్యాస్ ప్రమాదం కలిగించదు. కాని మహా ఇబ్బందని, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గాని, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గాని, మొదటిసారి జీవిత భాగస్వామితో గడిపే ఏకాంత సమయాల్లో గాని గ్యాస్ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించి ఉదరంలో నొప్పిని కలిగిస్తున్నప్పుడు దానిని ఆయుర్వేద పరిభాషలో ‘ఆధ్మానం’ అనే పేరుతో పిలుస్తారు. కాగా మలద్వారం నుంచి విడుదలయ్యే గ్యాస్‌ని అపానం (ప్లాటస్) అనే పేరుతో వ్యవహరిస్తారు. ప్రతివారిలోనూ గ్యాస్ తయారవుతూనే ఉంటుంది. సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్ విడుదల చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బంధింపబడి తీవ్రస్థాయిలో కడుపునొప్పిని కలిగించే అవకాశం ఉంది. మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణావల్ల అదనంగా గ్యాస్ తయారవటమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్, మిథేన్ వంటి వాయువులు ఉంటాయి. గ్యాస్ తయారవటం అనేది సహజమైన శారీరక క్రియ. కనుక దానిని అడ్డుకోలేక పోయినప్పటికీ, కొన్ని చిన్న, చిన్న గృహ చికిత్సల ద్వారా ఆహార వ్యవహారాల్లో మార్పులు, చేర్పుల ద్వారా గ్యాస్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు. లక్షణాలు గ్యాస్ సమస్య కలిగినవారికి సంకల్పంతోగాని, అసంకల్పితంగా గానీ గ్యాస్ విడుదలవుతుంటుంది. గ్యాస్ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్లు, ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృతం కాకుండా త్వరిత గతిన మారుతుంటుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్లు అనిపించవచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా గాని లేదా గాల్‌స్టోన్స్ నొప్పిగా గాని భ్రమకలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్లు బిర్రుగా అనిపించడం గ్యాస్ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్లు మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్లు కనిపించటం కూడా గ్యాస్ లక్షణమే. కారణాలు *మాట్లాడేటప్పుడు గాని, ఆహారాలను మింగేటప్పుడు గాని గాలిని మింగటం; ఆందోళనగా ఉన్నప్పుడుగాని ఉధ్విగ్నంగా ఉన్నప్పుడు గాని గాలిని అసంకల్పితంగా మింగటం *ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం; చూయింగ్‌గమ్ వంటి వాటిని అదే పనిగా నమలటం; స్ట్రాతో ద్రవహారాలను తాగటం. *ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం. *పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలూ, ఈసబ్గోల్ వంటి తంతుయుత పదార్థాలూ అరగకపోవటం. *సోడా, బీర్, శీతలపానీయాలు తదితర గాలినిండిన కార్బనేటెడ్ పానీయాలను తీసుకోవటం. *ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్, క్రాన్స్ వ్యాధి, అల్సరేటివ్ కోలైస్). *యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి). *విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గాని వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి). *మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).పాలలోని ల్యాక్టోజ్ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్ ఇంటాలరెన్స్). *గోధుమల్లోని గ్లూటెన్ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం(గ్లూటెన్ ఇంటాలరెన్స్). *ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్గమ్స్, సుగర్ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్, మ్యానిటాల్ వంటి పదార్థాలు గిట్టకపోవటం). ఇవన్నీ గ్యాస్ తయారవడానికి ప్రధాన కారణాలు. వీటిమీద అవగాహన ఉంటే గ్యాస్‌ని నిరోధించుకోవచ్చు. ఆయుర్వేద చికిత్సలు, సూచనలు ఆహార విధానం గ్యాస్‌ని కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ అందిరోనూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్ నొప్పినీ కలిగించవు. చాలా మందిలో గ్యాస్ కలిగించే ఆహారాలను అధ్యయనకారులు గుర్తించారు. అవి: చిక్కుళ్లు, ఉల్లిపాయ, క్యాబేజి, క్యాలీఫ్లవర్, యాపల్స్, జల్లించని గోధుమపిండి, కోడిగుడ్డు, శనగపిండి వంటకాలు తదితరాలు. వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి. పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడిగాని, లేదా వేడి వేడి పుదీనా కషాయం గాని తీసుకోవాలి. పుదీనాలో ఉండే మెంథాల్ (పిప్పర్మింట్) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటిగాని, రిఫ్లక్స్ గాని ఉంటే పుదీనాలోని మెంథాల్ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది. జీవన విధానం ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో, ఎక్కువ సార్లు తీసుకోవాలి. బబుల్గమ్ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పడుగు గాని, గాభరాగా ఉన్నప్పుడు గాని, హడావిడిగా ఉన్నప్పుడు గాని తినవద్దు. ఆహారాన్ని ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి. ఔషధ విధానం *ఉదర కండరాల మీద టర్పెంటైన్ ఆయిల్‌ని వేడిచేసి ప్రయోగించి ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. దీనితో ఉదరకండరాల్లో స్తబ్దత తగ్గి ప్రేగుల కండరాలు వదులవుతాయి. ఫలితంగా గ్యాస్ తప్పించుకొని ఉపశమనం లభిస్తుంది. * వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి అరచెంచాడు పుచ్చుకోవాలి. * అవసరమైతే వాముతో తయారైన అజమోదార్కం అనే ఔషధాన్ని కూడా మోతాదుకు రెండు పెద్ద చెంచాలు చొప్పున తీసుకోవచ్చు. * ఇంగువను దోరగా వేయించి, పొడి చేసుకొని పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో, మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు. *జీలకర్ర (2 భాగాలు), శొంఠి (4 భాగాలు), ఉప్పు (1 భాగం), శంఖభస్మం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) (2 భాగాలు) వీటన్నింటినీ మెత్తగా నూరి, నిష్పత్తి ప్రకారం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిశ్రమాన్ని అరచెంచాడు మోతాదుగా వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి. *ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి. *వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకొని సైంధవ లవణం కలిపి నూరి ఉదయ, సాయంకాలాలు పుచ్చుకోవాలి. *నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతినిత్యం భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకొని తింటుండాలి. *త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసరికాయ వలుపు), త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) వీటి చూర్ణాన్ని సమ భాగాలుగా తీసుకుని కలిపి కషాయం తయారు చేసుకొని తాగాలి. *నల్లజీలకర్ర (కలౌంజి) గింజలు (4 భాగాలు), శొంఠి (2 భాగాలు), నల్ల ఉప్పు (1 భాగం), శంఖభస్మం (1 భాగం) నిష్పత్తిలో తీసుకొని దంచి పొడిచేయాలి. ఈ మిశ్రమాన్ని 3-6 గ్రాముల మోతాదుగా పుచ్చుకోవాలి. * నింబూపానకం: 6 భాగాలు నిమ్మరసానికి 5 భాగాలు పంచదార కలిపి పానకం తయారు చేసుకోవాలి. దీనిని 2 చెంచాల మోతాదుగా, నీళ్ళతో కలిపి పుచ్చుకోవాలి. డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్ వృద్ధాప్యంలోనూ ఆరోగ్యంగా… ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుంటే వృద్ధాప్యంలో అయినా చలాకీగా ఉండవచ్చు. అక్టోబర్ వృద్ధుల మాసం. ప్రతి సంవత్సరం ఈ నెల మొదటి తారీకును ప్రపంచ వయోధికుల లేదా వృద్ధుల దినంగా పాటిస్తున్నారు. ఆయుర్వేదం వృద్ధులు జీవించినంత కాలం ఆరోగ్యవంతం గా, వ్యాధులకు దూరంగా బతికేందుకు తోడ్పడుతుంది. ఈ శాఖను ఆయుర్వేదంలో జర చికిత్స అంటారు. అంటే వృద్ధాప్య థెరపీ. దీనికి రసాయన అనే మరో పర్యాయపదం కూడా ఉన్నది. అంటే వ్యాధి నిరోధక, స్వయం సంరక్షక చర్యలు అని అర్ధం. ఆయుర్వేదం ప్రకారం 70 ఏళ్ళు దాటిన సంవత్సరానికి వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ నలభై దాటినప్పటి నుంచే వృద్ధాప్య లక్షణాలు ప్రారంభం కావడం నేటి అనుభవం. శక్తి, బలం క్షీణించి, జీవితాన్ని చురుకుగా గడపలేకపోతారు. ఈ దశలో వ్యక్తిని అలసట, నిస్సత్తువ ఆవరిస్తాయి. భౌతిక, మానసిక కార్యకలాపాలు కుంటుపడతాయి. జ్ఞాపకశక్తి, మేధస్సు క్షీణించడం ప్రారంభమై వ్యాధులు త్వరగా ప్రభావితం చేస్తుంటాయి. ఆయుర్వేదం ప్రకారం రస, రక్త, మాసం, మేధస్, అస్థి, మజ్జ, శుక్ర ధాతులతో కూడినది మానవ శరీరం. శరీరంలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఈ ధాతువులు క్షీణిస్తాయి. ఈ ధాతువులలో సారంతరగిపోవడంతో రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు త్వరగా సంక్రమించే సున్నితమైన ఆరోగ్య పరిస్థితులు ఏర్పడతాయి. వృద్ధాప్యంలో ఈ ధాతువుల సామర్ధ్యాన్ని పెంచలేం కానీ వాటిని సంరక్షించి పునరుజ్జీవింపచేయవ చ్చు. రసాయన చికిత్స లాభాలను ఆయుర్వేద గ్రంథాలు సవివరంగా పే ర్కొంటాయి. జీవితాన్ని పొడిగించడం, జ్ఞాపకశక్తిని పెంచడం, ఇన్ఫెన్లు, వ్యాధులు రాకుండా నిరోధక శక్తిని, మనస్సును యవ్వన స్థితిలో ఉంచేం దుకు సాయపడడం, వ్యక్తి ఛాయతో పాటు గొంతును మెరుగుపరచడం ద్వారా సమాజంలో గౌరవనీయంగా జీవించేందుకు, సంపూర్ణ ఆరోగ్యా న్ని సాధించేందుకు ఈ ప్రత్యేక చికిత్స అభివర్ణిస్తుంది. ఆయుర్వేదం వృద్ధాప్య సమస్యలను గుర్తించడమే కాదు అటువంటివి సంభవించకుండా నిరోధించే చికిత్సలను రూపొందించింది. వృద్ధాప్య సమస్యలు: అశక్తత, నిస్సత్తువ, వ్యాధులు, మరణం పట్ల భయం అన్నవి వృద్ధాప్యంలో ప్రధానంగా కనుపించే సమస్యలు. వయోధికులలో కనుపించే ఇతర సమస్యలు-కేంద్ర నరాల వ్యవస్థ, మెదడు: పక్షవాతం, సయాటికా, అల్జీమర్స్ వ్యాధి, పార్కిన్సన్స్ వ్యాధి, మూర్ఛ, న్యూరోసిస్, సైకోసిస్, మానసిక సమస్యలు, నిద్రలేమి.గుండె, రక్త నాళాలు: ఆంజినా పెక్టోరిస్, హృదయదమని లోపాలు, హైపర్టెన్సివ్ గుండె జబ్బులు, గుండెపోటు, గుండెకు సంబంధించిన ఇతర సమస్యలే కాకుం డా జన్యుపరమైన, జీవక్రియా సంబంధ సమస్యలైన మైలాయిడ్ లుకేమియా. కాలేయం, పిత్తాశయ సమస్యలు: తీవ్రమైన హెపటైటిస్, పిత్తాశయంలో రాళ్ళు, సిరోసిస్. జీర్ణాశయ సమస్యలు: మలబద్ధకం, ఊబకాయం, చక్కెర వ్యాధి ఊపిరితిత్తులు: బ్రాంకైటిస్, ఎంఫిసీమా, ఆయాసం వంటి సమస్యలు కీళ్ళు: రుమెటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, ఆస్టియో పొరాసిస్, సొరియాటిక్ ఆర్థరైటిస్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. మూత్రవాహిక: పురుషులలో ప్రోస్ట్రేట్ గ్రంధి పెరగడం, నెఫ్రైటిస్, చక్కెర వ్యాధి వల్ల రీనల్ సమస్యలు రావడం వంటిపలు సమస్యలు వస్తాయి. చర్మం, కండరాలు: సొరియాసిస్, హెర్పిస్, డెర్మటోసెస్, జుట్టు, గోళ్ళ వ్యాధులు, మోటార్ న్యూరాన్ వ్యాధివల్ల సంక్రమించే రోగాలు ఉంటాయి. వినాళగ్రంధి (ఎండోక్రైన్ గ్లాండ్స్): హైపో, హైపర్ థైరాయిడిజమ్, నపుంశకత్వం, స్ర్తీ, పురుషులలో మెనోపాజ్ సిండ్రోమ్ తదితర సమస్యలు. ఇంద్రియాలు : చత్వారం, గ్లకోమా, పాక్షిక లేదా పూర్తి చెవుడు, మెనీర్స్ సిండ్రోమ్, వెర్టిగో వంటివి సంభవిస్తాయి. సులువైన చర్యల ద్వారా వృద్ధాప్యాన్ని, దానికి సంబంధించిన వ్యాధులను నిరోధిం చడం సాధ్యమని ఆయుర్వేదం చెప్తుంది. సరళమైన, నిరాడంబర జీవనమే దాని రహస్యం. ఆయుర్వేదం ప్రకారం ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యాలే వ్యాధిరహిత జీవితాన్ని గడిపేందుకు మూలమైన స్తంభాలు. మితాహారం శరీర జీవసంబంధ ప్రక్రియను క్రమబద్ధం చేస్తుంది. మితాహారం, నిరాడంబర జీవనశైలే వ్యాధి రహిత సుదీర్ఘ జీవితానికి మంత్రం. జీవనశైలి విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి ఆయుర్వేదంలో నిర్దిష్టంగా పేర్కొన్నారు. అది ఒక ప్రత్యేకశాఖగా ఉంది.సంపూర్ణాహారాన్ని తీసుకొని, క్రమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ తన మాటలలో, చేతలలో సమతులంగా ఉంటూ, కోరరానివి కోరకుండా, నిజాయితీగా, క్షమాబుద్ధితో పెద్దల ఎడల గౌరవంతో జీవించే వారికి ఎటువంటి వ్యాధులు సంక్రమించవు. పంచకర్మతో పాటుగా జీవన శైలిలో మార్పులతో పాటు అనేక ఆయుర్వేద మందుల తయారీని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తాయి. వృద్ధాప్య సంరక్షణలో ఉపయోగపడే మొక్కలు: ఆముదం: ఆముదం విరేచనకారి అని అందరికీ తెలుసు.అయితే వృద్ధాప్య సమస్యలను నిరోధించడం, చికిత్స చేయడంలో ఈ మొక్కకున్న ఉపయోగాలు కొద్ది మందికే తెలుసు. ఆముదం వేరును నాలుగు భాగాల నీళ్ళలో అది ఒక వంతు వచ్చే వరకు మరిగించి రోజూ తీసుకుంటే వృద్ధాప్యంలో వచ్చే వాత సంబంధ వ్యాధులను నిరోధించవచ్చు. 8-10 ఆముదం గింజలను పొట్టుతీసి 200 మిల్లీలీటర్ల పాలు, 50 గ్రాముల బెల్లం వేసి మరిగించి, ప్రతి రోజూ సాయంత్రం ఈ పాయసాన్ని తీసుకుంటే వృద్ధాప్య సంబంధమైన ఆర్థరైటిస్ సమస్యలను నివారించవచ్చు. గోధుమపిండిలో స్వచ్ఛమైన ఆముదాన్ని కలిపి చపాతీలు చేసుకొని తింటే డయాబెటిస్, ఆర్థరైటిస్ సమస్యలే కాక మలబద్ధకం కూడా తగ్గుతుంది. తామరపువ్వు: వృద్ధులకు అత్యంత ఉత్తమమైన టానిక్ ఇది. అనేక ప్రాంతాలలో ప్రజలు అందుకే తామర కాడలను కూరలాగా చేసుకుంటారు. తామరాకును విస్తరిగా ఉపయోగిస్తారు. ఇది కణాలను సంరక్షిస్తుందని జపాన్‌లో చేసిన పరిశోధనలలో రుజువైంది. తామర రేకులు కొలస్ట్రాల్‌ను తగ్గించడమే కాక గుండె, మెదడుకు రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి. ఏలక్కాయి: వృద్ధాప్య సమస్యలకు సంబంధించిన అన్ని ఆయుర్వేద మందులలో దీనిని సాధారణంగా ఉపయోగిస్తారు. ఇది మంచి ఆంటాసిడే కాక వాయుహరి కూడా. జీర్ణక్రియను పెంచడమే కాక అసిడిటీ, కళ్ళె వంటి వ్యాధులలో ఉపశమనాన్ని ఇస్తుంది. ఉసిరికాయ: ఆరోగ్యాన్ని పెంపొందించే, వయసును నిరోధించే మూలిక ఇది. కొలెస్ట్రాల్ వల్ల వచ్చే గుండె వ్యాధుల, రక్త ప్రసరణ సమస్యల బారి నుంచి కాపాడుతుంది. చలికాలంలో అవసరమైన కేలరీ డైట్ సప్లిమెంట్‌ను అందిస్తుంది. తులసి: రోగనిరోధక శక్తిని పెంచడమే కాక చలికాలంలో వచ్చే జలుబు, దగ్గులను తగ్గిస్తుంది. కరక్కాయ: ఆయుర్వేదం ప్రకారం వ్యాధులను, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో అత్యున్నతమైన మందు ఇది. కరక్కాయపొడి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇది అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. అలాగే పైల్స్ వంటి వ్యాధులను తగ్గించడంలో ఇది గొప్పగా పని చేస్తుంది. త్రిఫల: ప్రాచీన విజ్ఞానం ప్రకారం ఇది ఉత్తమమైన వయో నిరోధక చికిత్స. అయితే దీనిని వివిధ రుతువుల్లో వివిధ పదార్ధాలతో కలిపి తీసుకోవాలి. వర్ష రుతువులో – సైంధవ లవణంతో కలిపి శరత్ రుతువు – పంచదారతో కలిపి హేమంత రుతువు – శొంఠితో కలిపి శిశిర రుతువులో – పిప్పళ్ళతో కలిపి వసంత రుతువు – తేనెతో కలిపి గ్రీష్మ రుతువు – బెల్లంతో కలిపి తానికాయ: ఇది త్రిఫలాలలో ఒకటి. దీనిని మలబద్ధకం, విపరీతమైన కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు, లివర్, స్ల్పీన్ సమస్యల్లోనూ, కంటి వ్యాధులు, బాలనెరుపుకు ఉపయోగిస్తారు. తిప్ప సత్తు: రోగనిరోధక శక్తిని కాపాడడంలో పెంచడంలో ఇది ప్రముఖమైనది. వాత తత్వం ఉన్నప్పుడు నెయ్యితో కలిపి, పిత్త తత్త్వంలో పటిక బెల్లం, కఫ తత్వం ఉన్నవారు తేనెతో కలిపి తీసుకోవాలి. గౌటీ ఆర్థరైటిస్‌లో ఆముదంతో కలిపి తీసుకోవాలి. మలబద్ధకం ఉన్నప్పుడు బెల్లంతో కలిపి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు అల్లం పొడితో కలిపి తీసుకోవాలి. మండూక పర్ణి: దీనిని మందుగా కన్నా కూడా ఆహారంగా మన దేశంలో ఎక్కువగా తీసుకుంటారు. దీనికి ఒత్తిడిని తగ్గించే, జ్ఞాపక శక్తిని పెంచే లక్షణాలు ఉన్నాయి. అల్జిమీర్స్ వంటి వ్యాధులలో ఉపయుక్తం. అతిమధురం: పిల్లలలో వచ్చే జలుబు, దగ్గులకు దీనిని చిట్కా వైద్యంగా వాడుతుంటారు. నోటి అల్సర్లకు ఇది మంచి మందు. వృద్ధాప్యంలో శ్వాసకోశ సమస్యలకు మంచి మందని చరకుడు అభిప్రాయపడ్డాడు. గలిజేరు: ఇది గ్రామాలలో దొరికే మూలిక. దీనిని ఆహారంగా తీసుకోవచ్చు. దీనివేర్లలో పొటాషియం నైట్రేట్ అధికంగా ఉంటుంది. మూత్ర నాళ సంబంధ సమస్య, కొన్ని గుండె సంబంధ వ్యాధు చికిత్సలో ఉపయోగపడుతుంది. పిప్పళ్ళు: ఇది జీర్ణప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఆర్థ్రైటిస్, మలబద్ధకం వంటి వాటిలో ఉపశమనాన్ని ఇస్తుంది. జీడి గింజలు: ఇది అత్యుత్తమ పునరుజ్జీవనిగా ఉపయోగపడుతుంది. దీనిలో కాన్సర్ నిరోధక శక్తిని ఇటీవలి అధ్యయనాలు వెల్లడించాయి. టిష్యూల నిర్మాణంలో, వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడటం వల్ల దాని గింజలను వృద్ధాప్య సంబంధిత సమస్యలను నివారించేందుకు సూచిస్తారు. వృద్ధాప్యంలో వచ్చే కీళ్ళ నొప్పులను తగ్గించేందుకు ఇంట్లోనే చేసుకుని వాడదగ్గ కషాయం: మెంతులు: 100 గ్రా, జీలకర్ర : 50 గ్రా, మిరియాలు – 05 గ్రామూడింటిని కొద్ది నేతిలో వేయించి పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఒక చెంచా పొడిని తీసుకొని ఒక గ్లాసు పాలలో వేసి దానిని కొద్ది సేపు మరగించి రోజుకు ఒకటి రెండు సార్లు తీసుకోవాలి. ఒక వారం రోజులలోనే తేడా కనుపిస్తుంది. ఉపశమనం కలిగే వర కూ ఎన్ని రోజులైనా దీనిని తీసుకోవచ్చు. ఆరోగ్యానికి మేలు చేకూర్చే ఉసిరి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఉసిరి ఎంతగానో ఉపయోగ పడుతోంది. ఉసిరి ఎక్కువగా ఆయుర్వేద మందుల్లో వినియోగిస్తారు. ఉసిరిలో అధిక శాతం ప్రోటీన్లు ఉంటాయి. యాపిల్ కంటే మూడు రెట్ల ప్రోటీన్లు ఉసిరిలో ఉంటాయని వివిధ గ్రంథాల్లో పేర్కొన్నారు. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా ఉసిరిలో పోషకాలున్నాయని వైద్యులు చెప్తుంటారు. ఉసిరిలో యాంటీవైరల్, యాంటి మైక్రోబియల్ గుణాలున్నాయి.రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరం లో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పనిచేస్తుంది.అదేవిధంగా అలసటను దూరం చేయడంలో ఉసిరికి ఉన్న శక్తి ఇంకే పండ్లలో లభించదు.వంద గ్రాముల ఉసిరిలో 900 మి.లీ.గ్రాముల ‘సి’ విటమిన్, 7.05 నీరు, 5.09 శాతం చక్కెర పోషకాలున్నాయి. ఉసిరితో ఎంతో మేలు : ఉసిరి కాలేయ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణ సంబంధసమస్యలను తొలిగిస్తుంది. ఉదరంలో రసాయనాలను సమతుల్యపరుస్తూ శరీరాన్ని చల్లబరుస్తుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉసిరి కీలకంగా పనిచేస్తుంది. హృద్రోగం, మధుమేహం రాకుండా నివారిస్తుంది. మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్ ‘సి’ శరీరాన్ని ఎండ వేడిమి నుంచి కాపాడుతుంది. కేశ పోషణలో ఉసిరి ప్రాముఖ్యత చాలా ఉంది. చుండ్రు, కేశ సంబంధిత ఇతర సమస్యలకు ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒంటి బరువు… వదిలించుకోండిలా అన్నివర్గాలకు చెందిన ఆహారాలను తీసుకుంటుండాలి. ఒకే రకం ఆహారానికే పరిమితం కాకూడదు. దీనినే షడ్రసోపేతమైన ఆహారం అంటుంది ఆయుర్వేదం. ఆహారంలో పిండి పదార్థాలను 60 శాతం, మాంసకృత్తులు 20 శాతం, కొవ్వు పదార్థాలు 20 శాతం ఉండేలా చూసుకోవాలి. ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. మాంసాహారులైతే ఎర్రని మంసానికి బదులు తెల్లని మాంసం ఎంచుకోవాలి. అంటే మేక, గొర్రె, పోర్క్, బీఫ్‌కు బదులు చర్మం తొలగించిన కోడి, చేపల మాంసం తినాలి. గుజ్జు కలిగిన తియ్యని పండ్లు, డ్రైఫ్రూట్స్ బదులు రసం కలిగిన తాజా పండ్లు తీసుకోవాలి. ఆహార పదార్థాలను ఫ్రై (నూనెలో వేయించటం) చేసే బదులు రోస్ట్ (నిప్పుల మీద వేడి చేయటం) చేయాలి. ఎక్కువ నూనెను వాడాల్సిన వంట పాత్రల బదులు మూకుడు, ఓవెన్, నాన్‌స్టిక్ ఫ్రయింగ్ ప్యాన్, ప్రెషర్ కుక్కర్ వంటివి వాడాలి. కూల్ డ్రింక్స్, టీ, కాఫీ తాగే బదులు మినరల్ వాటర్, బబుల్ వాటర్, డైట్ డ్రింక్స్ తీసుకోవాలి. వడ్డనకు పెద్ద గరిటెలు, వెడల్పాటి ప్లేట్లు వాడే బదులు చిన్నసైజ్ టేబుల్ స్పూన్లు, చిన్నప్లేట్లు వాడాలి. నెమ్మదిగా తినాలి ఆత్రంగా, గబగబా తింటే ఎంత తిన్నారో, ఏమి తిన్నారో తెలియక ఎక్కువ తినే అవకాశం ఉంటుంది. కనుక నెమ్మదిగా ప్రతి ముద్దనూ నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి. దీంతో లాలాజలం విడుదలై ఆహారం బాగా జీర్ణమవుతుంది. ఒకవేళ నెమ్మదిగా తినలేకపోతే అలవాటయ్యేంతవరకూ స్పూన్‌తో తినాలి. ప్రతి ముద్దకూ చెంచాను కంచంలో విడిచిపెట్టి మళ్లీ తీసుకుంటూ ఉండాలి. ఆహారం తినేటప్పుడు చక్కని ఆహ్లాదకరమైన సంగీతం వింటూ తింటే నెమ్మదిగా తినడం అలవాటవుతుంది. దీంతో తిన్న ఆహారం పూర్తిగా పచనం చెంది శక్తిగా మారుతుంది. వేళ పట్టున తక్కువ మొత్లాల్లో తినాలి బయట ఫంక్షన్లకూ, రెస్టారెంట్లకూ వెళ్ళేటప్పుడు చాలామంది పార్టీలో ఎలానూ తినాల్సి వస్తుంది కదా అనుకొని ఇంట్లో ఏదీ తీసుకోరు. అయితే బరువు పెరగకుండా ఉండాలంటే పార్టీలకు వెళ్ళబోయేముందు ఇంట్లో మజ్జిగన్నం వంటివి తిని వెళ్లాలి. దీంతో పార్టీలో తిన్నప్పటికీ పేగులు ఎక్కువగా స్వీకరించవు. అలాగే రోజువారీగా తేలికగా ఉండే లఘు ఆహారాన్ని తింటూ ఉండాలి. ఉపవాసాలుండకూడదు. లెక్క ప్రకారం తినాలి. వీలైతే ‘్ఫడ్ డైరీ’ రాయాలి. తినేటప్పుడు వేరే పనిమీద దృష్టిపెట్టకూడదు. మాట్లాడుకుంటూ, టీవీ చూస్తూ, చదువుతూ తినకూడదు. ఆహారాన్ని పెద్దమొత్తాల్లో తక్కువసార్లు కాకుండా చిన్నమొత్తాల్లో ఎక్కువసార్లు తీసుకోవాలి. ప్రధాన ఆహారపు వేళల మధ్యలో చిరుతిండ్లు తినకూడదు. అయితే, అవసరమనుకుంటే ద్రాక్షపండ్లు, జామపండ్లు వంటివి తినవచ్చు. ఇవి మలనిర్హణ సజావుగా జరగడానికి సహకరిస్తాయి. మధ్యాహ్నం పూట తీసుకునే ఆహారం ఎక్కువగానూ, రాత్రి పూట తీసుకునే ఆహారం అల్పమోతాదులోనూ ఉండాలి. తేనెను వాడితే మంచిది తేనె తీసుకుంటే స్థూలకాయంలో చక్కని ఫలితం కనిపిస్తుంది. కాకపోతే ఏడాది కాలంపాటు నిల్వ ఉంచిన పాత తేనెను వాడాలని ఆయుర్వేదం సూచిస్తుది. పాత తేనెకు రూక్షం (స్నిగ్దత్వాన్ని తగ్గించటం), గ్రాహ (ద్రవరూపస్రావాలను ఎండిపోయేలా చేయటం), లేఖనం (కొవ్వును గీరేసి వదులయ్యేలా చేయటం), కఫ హరం (శే్లష్మాన్ని తగ్గించడం) అనే గుణాలు ఉంటాయి. ప్రతిరోజూ ఉదయం గ్లాసు గోరువెచ్చని నీళ్ళకు రెండు చెంచాలు తేనెను చేర్చి తీసుకోవాలి. తేనెను నీళ్లకుచేర్చి తీసుకోవటంవల్ల వ్యాయామ సమయంలో నీరసం రాకుండా ఉంటుంది. అవసరమైతే ఈ విశ్రమానికి చెక్క నిమ్మరసం కూడా చేర్చి తీసుకోవచ్చు. శూకధాన్యం మంచిది యవగోధుమలు, బార్లి, ఓట్స్ వంటి వాటిని శూకధాన్యం (సిరియల్స్) అంటారు. వీటిల్లో అధిక మొత్తాల్లో పీచు పదార్థం ఉంటుంది. ఇది కొవ్వును పేరుకుపోకుండా చేస్తుంది. పీచు పదార్థం శక్తిని నిలకడగా విడుదలయ్యేలా చేస్తుంది. నీటిని పీల్చుకుంటుంది కాబట్టి అంత త్వరగా ఆకలి వెయ్యదు. పీచువల్ల మల, మూత్రాల నిర్హరణ సజావుగా జరుగుతుంది. అలాగే ఫైబర్ కొలెస్టరాల్‌ను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పాత బియ్యం హితకరం ఏడాదిపాటు పాతబడిన బియ్యాన్ని వాడుకుంటే స్థూలకాయంలో హితకరంగా ఉంటుంది. అయితే మరీ పాత బియ్యం వాడితే శోథ(వాపు) వస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బియ్యాన్ని నేరుగా కాకుండా కృతాన్నం రూపం తీసుకోవాలి. ఉడికించిన బియ్యానికి పప్పు, కాయగూరలు వంటివి చేర్చడాన్ని కృతాన్నం అంటారు. కొత్త బియ్యం వాడితే కఫం పెరిగి లావెక్కుతారు. కనుక స్థూలకాయులు వాడకూడదు. మేలు చేసే ఆహారాలు తీసుకోవాలి శమీధాన్యంలో (పప్పుదినుసుల్లో) మాంసకృతులు, పీచు అధికంగా ఉంటాయి. పెసర్లు లఘువుగా ఉంటాయి కనుక మంచివి. అలాగే ఉసిరి, పొట్ల, ఆకుకూరలు అన్నీ మంచివే. శొంఠి, పిప్పళ్లు, మిరియాలు వంటివి హితకరంగా ఉంటాయి. జీలకఱ్ఱ, ధనియాలు, సోంపు గింజలు, ఏలక్కాయలు, అల్లం, దాల్చిన చెక్క వంటివి ఆహారంలో ఎక్కువగా ఉపయోంచాలి. అయితే మినుములు గురువుగా ఉంటాయి కనుక స్థూలకాయులు వాడకూడదు.వేడినీళ్ళతో అద్భుతం- వేడినీళ్లు తాగితే సన్నబడతారు. వేడినీళ్ళ స్నానమూ మంచిదే. స్థూలకాయులు చన్నీళ్లు వాడకూడదు.ఆహారానికి ముందు నీళ్లు తాగాలి- ఆహారానికి ముందు 2 గ్లాసులు నీళ్లు తాగితే సన్నబడతారని ఆయుర్వేద సంహితా గ్రంథంలో అష్టాంగ హృదయం చెబుతుంది. ఆహారం తీసుకున్న వెంటనే మంచినీళ్ళు తాగితే లావెక్కుతారు కనుక కనీసం అరగంట వరకూ ఆగాలి. మజ్జిగ మేలు చేస్తుంది మజ్జిగ తేలిగా ఉంటుంది. అలాగే ఊబ శరీరాన్ని ఎండిపోయేలా చేస్తుంది. మజ్జిక తీపి, పులుపు, వగరు రుచులు కలిగి ఉంటుంది. ఈ రుచులు ఉండటంవల్ల ఇది త్రిదోషహరంగా పనిచేస్తుంది. పులుపువల్ల వాతం, తీపివల్ల పిత్తం, కషాయంవల్ల కఫం తగ్గుతాయి. మజ్జిగను వాతాధిక్యతలో (నొప్పులు, గ్యాస్ ఉన్నప్పుడు) సైంధవ లవణంతోను, పిత్త్ధాక్యతలో (మంటలు, జీర్ణక్రియా సమస్యలు ఉన్నప్పుడు) మిశ్రీతోను, కఫాధిక్యతలో (జలుబు వంటివి ఉన్నప్పుడు) త్రికటుచూర్ణంతోను తీసుకోవాలి. అయితే మజ్జిగను వెన్న తీసి మాత్రమే వాడాలి.చింతనతో స్థూలకాయ చింత దూరం శరీరంలో అధికంగా కొవ్వు చేరకుండా ఉండాలంటే అనుక్షణం చింత (ఆలోచన) చేయాలని ఆయుర్వేదం చెబుతుంది. బాధ్యతారహితమైన జీవన విధానంవల్ల స్థూలకాయం సిద్ధిస్తుంది. వ్యాయామం చేయటం అవసరం స్థూలకాయం రాకుండా ఉండాలంటే ప్రతినిత్యం అర్ధశక్తిగా వ్యాయామం చేయాలని ఆయుర్వేదం సూచిస్తుంది. యోగాసనాలు, సైక్లింగ్, నడక, ప్రాణాయామం, ఈత, క్రీడలు, జిమ్, ఎయిరోబిక్స్ వంటి వాటిల్లో ఏది అనువుగా వుంటే దానిని ఎంచుకొని సాధన చేయాలి. వ్యాయామం తరువాత చన్నీళ్లు తాగవద్దు చాలామంది వ్యాయామం చేసిన తరువాత అలుపు తీర్చుకునేందుకు చన్నీళ్ళు తాగుతుంటారు. అయితే, చన్నీళ్ళుగాని, లేదా తలపానీయాలుగాని జీవక్రియను ఆలస్యం చేసి స్థూలకాయానికి కారణమవుతాయి. అవసరమైతే వేడినీళ్ళనుగాని లేదా వేడిగా తయారుచేసిన శొంఠి కషాయం వంటి మూలికాపానీయాలను గాని తాగవచ్చు. ఆరోగ్యకరమైన దాంపత్య జీవితం ముఖ్యం నిద్ర, ఆహారం, మైథునం అనే మూడు స్తంభాలు మనిషి శరీరాన్ని ముక్కాలిపీటలాగా నిలబెడతాయని అంటుంది ఆయుర్వేదం. స్తంభాల ఎత్తులో హెచ్చుతగ్గులుంటే ఏ విధంగా మంటపం నిలబడదో అదేవిధంగా మనిషి శరీరం కూడా పతనమవుతుంది. కనుక వీటిని పరిమితంగా ఆస్వాదించాలి. మైథునంవల్ల ఉదాసీనత దూరమై చలాకీతనం వస్తుంది. బరువు నియంత్రణలో ఉంటుంది. - డాక్టర్ చిరుమామిళ్ల మురళీమనోహర్ ఆధారము: వైద్యం