మధుమేహ వ్యాధిగ్రస్తులకు నమూనా ఆహార పట్టిక ఆహారాన్ని తమ ఆహారపు అలవాట్ల ప్రకారం ఆయా భోజన సమయాల్లో తీసుకోవచ్చు భోజనంలో తప్పకుండ పచ్చి కూరగాయ ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి మీగడ తీసిన పాలతో చేసిన పెరుగు (1 చిన్న కప్పు) లేదా మజ్జిగ (1 గ్లాసు) మాంసాహారులు ఈ క్రింద వాటిలో ఏదయినా ఒకటి వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు తోలు తీసిన కోడి మాంసం కూర (2 లేదా 3 ముక్కలు), మాంసం కూర (5 లేదా 6ముక్కలు), చేప కూర (2 ముక్కలు), పచ్చసొ న తీసిన గ్రుడ్డు (1). తీసుకోకూడని ఆహార పదార్థాలు జీడిపప్పు పిస్తా కొబ్బరి వేరుశనగపప్పు బాదంపప్పు కొబ్బరి నీళ్లు హార్లిక్స్ బూస్ట్ శీతలపానియాలు ఆల్కహాలు,తేనె బెల్లం ఐస్క్రీములు కేకులు జామ్. తీసుకోవలసిన ఆహార పదార్థాలు భోజనం: ప్రోద్దున టిఫిను 8.00 గo కాఫీ / టీ (మీగడ తీసీన పాలతో చక్కర లేకుండా చేసినది) 1వ రోజు: చపాతీ(2)+నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1 కప్పు 2వ రోజు: దోసె (2) +చట్నీ 1కప్పు 3వ రోజు: ఇడ్లీ(4) +చట్నీ 1కప్పు 4వ రోజు: గోధుమ రవ్వ ఉప్మా(2చిన్న కప్పులు) 5వ రోజు: పుల్కా(3) +నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1కప్పు 6వ రోజు: పొంగలి (2 చిన్న కప్పులు) +చట్నీ 1కప్పు 7వ రోజు: జొన్న రొట్టెలు (2)+నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1 కప్పు భోజనం: అల్పాహారం 11.00గ 1వ రోజు: నూనె లేకుండా వేయించిన పేలాలు (1చిన్న కప్పు) 2వ రోజు: నూనె లేకుండా వేయించినఅటుకులు(1చిన్న కప్పు) 3వ రోజు: నూనె లేకుండా వేయించినమరమరాలు(1చిన్నకప్పు) 4వ రోజు: మొలకె త్తించిన పెసలు(1చిన్న కప్పు) 5వ రోజు: సాదా బిస్కెట్లు (4) 6వ రోజు: జామ పండు (1) (దోరగ ఉన్నది) 7వ రోజు: బొప్పాయి పండు ముక్కలు(1చిన్న కప్పు)ఏబీసీ భోజనం: మధ్యాహ్నం /రాత్రి భోజనం 1వ రోజు: చపాతీ(2)+అన్నం(1చిన్న కప్పు) పాలకూర పప్పు (1చిన్నకప్పు) బీరకాయ కూర (1పెద్ద కప్పు). 2వ రోజు: పుల్కాలు(3)+అన్నం (1చిన్న కప్పు)దోసకాయ పప్పు(1 చిన్న కప్పు) సొరకాయ కూర (1పెద్దకప్పు). 3వ రోజు: జొన్నరొట్టెలు(2) + అన్నం (1 చిన్న కప్పు) టమోటా పప్పు (1చిన్నకప్పు) కాబేజీ కూర (పెద్ద కప్పు). 4వ రోజు : అన్నం (2 చిన్న కప్పులు) + చపాతీ (1) సాంబారు (1చిన్నకప్పు) బెండకాయకూర (పెద్దకప్పు) 5వ రోజు: అన్నం (2చిన్నకప్పులు)+ పుల్కాలు(2)తోటకూర పప్పు(1 చిన్న కప్పు)దొండ కాయ కూర(1 పెద్ద కప్పు). 6వ రోజు: గోదుమ రవ్వఅన్నం(3 చిన్న కప్పులు)సోర కాయ పప్పు(1 చిన్నకప్పు)దోసకాయ కూర(1పెద్ద కప్పు). 7వ రోజు: అన్నం (3చిన్న కప్పులు) గోంగూర పప్పు(1 చిన్న కప్పు)టమోటా కూర/ఆకు కూర (1 పెద్ద కప్పు). భోజనం: సాయంత్రం అల్పాహారం 5.00 గo. 1వ రోజు: సాదా బిస్కెట్లు(5) 2వ రోజు: మొలకె త్తించిన పెసలు (1 చిన్న కప్పు). 3వ రోజు: ఉడక బెట్టిన ముడి పప్పు గింజలు (ఉదా:శనగలు 1 చిన్న కప్పు). 4వ రోజు: బొప్పాయి పండు ముక్కలు(1 చిన్న కప్పు). 5వ రోజు: బత్తాయి పండు (1/2)+నూనె లేకుండావేయించిన మరమరాలు(1 కప్పు). 6వ రోజు: జామ పండు (1)+ నూనె లేకుండా వేయించిన అటుకులు(1 చిన్న కప్పు) 7వ రోజు: ఉడక బెట్టిన ముడిపప్పు గింజలు (ఉదా : బటాణిలు (1 చిన్న కప్పు). ఆధారం: డాక్టర్ ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు. కుమారి ఎన్.సునీత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/090.