మధుమేహుల ఆహార నియమావళి మధుమేహం లేని వ్యక్తి హానికారక పదార్ధాలు తీసుకుంటే వాటి దుష్ప్రభావం వారిలో కొంత ఆలస్యంగా కనిపిస్తుంది. కాని మధుమేహుల్లో అది వెంటనే కనిపిస్తుంది. క్రింద వివరించిన విషయాలు మధుమేహాన్ని నివారించడానికి మరియు నియంత్రణకి తోడ్పడతాయి. మధుమేహుల కంటూ ప్రత్యేకంగా చెప్పినా ఇవి అందరూ పాటించవచ్చు. 1.భోజనానికీ భోజనానికీ మధ్య ఎక్కువ వ్యవధి ఉండకూడదు. ఎక్కువ గంటలు గడిచే కొద్దీరక్తంలో చక్కెర శాతం పూర్తిగా తగ్గిపోయి భోజనంచేయగానే హఠాత్తుగా పెరిగిపోతుంది. అందుకే భోజనాన్ని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా మూడు వేళలకు విభజించడం అవసరం. వీటికి తోడు ఉదయం 11 గంటలకు, సాయంత్రం 5 గంటలకు అల్పాహారం తీసుకోవడం కూడా అవసరం. దీనివల్ల రక్తంలో ఉండవలసిన చక్కెర శాతంలో హెచ్చు తగ్గులు లేకుండా నియంత్రణలో ఉంటాయి. 2. పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్లు) ఇతరుల్లాగే మధుమేహులకు సైతం అన్ని రకాల ఆహారపదార్ధాల అవసరం ఉంటుంది. కాకపోతే, మధుమేహం ఉన్న వారు సులభంగా జీర్ణమయ్యే ఆహారపదార్థాలుగల కార్బోహైడ్రేట్లు తీసుకోకూడదు. అలా తీసుకుంటే చక్కెర శాతం చాలా వేగంగా పెరుగుతుంది. ఇన్సులిన్ లోపాలు ఉండడం లేదా అది సక్రమంగా పనిచేయకపోవడమే అందుకు కారణం. అందుకే చక్కెర, స్వీట్లు, పళ్లరసాలు, అరటిపళ్లు, మామిడి, ద్రాక్ష, శీతలపానీయాలు, చాక్లెట్లు, బియ్యం వంటి వాటిని అతి తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. బియ్యంలో అన్నిటి కన్నా అతిత్వరగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు పిండిపదార్థాలు ఉంటాయి. మధుమేహులకు ఇవి పూర్తిగా నిషిద్ధమని, విషతుల్యమని చెప్పలేం. కానీ, అపరిమితంగా తీసుకోవడం వల్ల చక్కెర శాతం విపరీతంగా పెరుగుతుంది. గోధుమ, మొక్కజొన్న, మొలకెత్తినధాన్యాలు, కూరగాయలు లేదా పళ్లల్లోనూ కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అయితే ఇవి జీర్ణమవ్వడానికి సమయం ఎక్కువ పడుతుంది. కనుక రక్తం లో గ్లూకోస్ ను నియంత్రిచుకోవచ్చు.3.మాంసకృత్తులు(ప్రొటీన్లు) అందరిలాగే మధుమేహులకు కూడా ప్రొటీన్లు అవసరం. శరీరంలోని ధాతువుల నిర్మాణంలో వీటి అవసరం చాలా ఎక్కువ. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, చిక్కుడుధాన్యాలు కొన్నికూరగాయల్లోనూ కావలసినమేరకు ప్రొటీన్లు లభిస్తాయి. వీటితో పాటు పాలు, పెరుగు, సోయాపదార్ధాలు, తక్కువ కొవ్వుపదార్ధాలు ఉండే పన్నీరు తీసుకోవడం అవసరం.4.కొవ్వులు తృణధాన్యాలు, కూరగాయలు, పళ్లల్లోనూ కొవ్వుపదార్ధాలు ఉంటాయి. బాదం వంటి నట్స్‌లో కొవ్వుపదార్ధాలు మరీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మితంగా వాడాలి. వంటనూనె ఎక్కువగా వున్న వంటకాలు, వేపుడు కూరలు, మేకమాంసం వంటివి మితంగాతింటే శరీరంలో కొవ్వును నియంత్రణలో ఉంచవచ్చు. నిరంతరం ఒకేనూనె కాకుండా పల్లి, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, సోయా వంటివి రెండు రకాల నూనెలు కలిపి వాడాలి . పచ్చళ్లు, కొబ్బరి, మసాల వంటివి పూర్తిగా మానుకోవడమే మంచిది.5.విటమిన్లు, ఖనిజలవణాలు ఆహారంలో తృణధాన్యాలు, కూరగాయలు, పళ్లు, పాలు ఉత్పత్తులు సరిపడా తీసుకుంటే విటమిన్లు, లవణాలన్నీ వాటి ద్వారానే లభిస్తాయి. ఆకుకూరలు, సలాడ్లు తరచూ తీసుకుంటే అన్ని పోషకాలూ లభిస్తాయి. నల్లద్రాక్షపళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి అవసరం.6.పీచుపదార్ధాలు (పైబర్) ఆహారంలో పీచుపదార్ధాలు ఉంటే రక్తంలో కలిసే చక్కెర, కొవ్వు పదార్ధాల శాతం తగ్గుతుంది. ఇది కొలెస్ట్రాల్‌ను కూడా అదుపులో ఉంచుతుంది. పీచుపదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకున్నా చక్కెర నియంత్రణలోనే ఉంటుంది. ఆహార జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నామని వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం ద్వారా తీసుకున్న క్యాలరీలు ఖర్చు కావడానికి ప్రతిరోజూ అరగంట నుంచి గంట వరకు నడవడం అవసరం. ప్రత్యేక నియమావళి మధుమేహ వ్యాధి ఉన్నవారు అందరిలాగే ఆహారం మామూలుగా తీసుకోవచ్చు. కానీ తను చేసే పనిని బట్టి ఎన్ని కాలరీలు అవసరమో అంత వరకు మాత్రమే సరిపోయేటట్లు ఆహారం తీసుకోవాలి. చక్కెర, గ్లూకోజ్, బెల్లము, తేనె అత్యవసరంలో తప్ప విడిగా తీసుకోరాదు. మధుమేహులు మందులు వాడుతున్నప్పుడు ఆహారనియమాలు తప్పనిసరిగా పాటించాలి. ఆహారనియమాల పట్ల జాగ్రత్త వహిస్తే మందులు మోతాదు తగ్గించొచ్చు. కొద్దిపాటి వ్యాధికి మందులు లేకుండా ఆహార నియామాల ద్వారా వ్యాధిని అదుపుచేయొచ్చు . ఎత్తుకు తగ్గబరువు సరిచూసుకోవాలి. మనం ఎత్తుకు తగ్గబరువు వున్నామా అని తెలుసు కోవాలంటే ఎత్తుఎన్ని సెంటీమీటర్లో చూసుకుని, దానినుండి 100 తీసేస్తే మిగిలినది కిలోల బరువు అవుతుంది. ( ఉదారహణకు మీ ఎత్తు 165 సెంటి మీటర్లు . దాంట్లో నుండి 100 తీసివేస్తే మిగిలేది 65, కాబట్టి ఆదర్శ బరువు 65 కిలో గ్రాములు.) మీ ఆదర్శ బరువు. ఈ బరువు కంటే ఎక్కువ వుంటే , మీరు ఉండవలసిన దానికంటే ఎక్కువ బరువు వునట్లుగా అర్థం చేసుకోవాలి. బరువును తగ్గించే ప్రయత్నాలు చేయాలి.బాడీమాస్ ఇండెక్స్ లెక్కించడం ద్యారా ఎంత ఎక్కువ బరువున్నారో తెలుసుకోవచ్చు. మీ ఎత్తుని మీటర్లో లో కొలవండి. (ఉదాహరణకు 165 సెంటిమీటర్లు అంటే 1.65 మీటర్లు ) ఆ నంబరును దానితోనే గుణించండి.( ఉదాహరణకు 1.65 *1.65 =2.75) మీ బరువును కిలో గ్రాములలో లెక్కించండి. (ఉదాహరణకు 95 కిలోలు ) బాడీమాస్ ఇండెక్స్ ను లెక్కించేందుకు 3 పాయింట్‌లోని బరువుని రెండో పాయింట్‌లోని సమాధానంతో భాగించండి (ఉదాహరణకు 95/275*100), ఇలా భాగించగా వచ్చినదే బాడీమాస్ ఇండెక్స్. ఇపుడు యీ క్రింది ప్రకారం చూడండి. బాడీ మాస్ ఇండెక్స్ సూచిక విభజన బాడిమాస్ ఇండెక్స్ ఆరోగ్యానికి అపాయం తక్కువ బరువు 18.5 కంటే తక్కువ వుంటే తక్కువకాని ఇతర వైద్యపరమైన అపాయం పెరుగుతుంది మామూలు శ్రేణి 18.5 నుండి 23 వరకు సాధారణం అధిక బరువు 23 నుండి 25 వరకు మితంగా పెరిగింది స్థూలకాయం 25 నుండి 29.9వరకు గ్రేడ్-1 30 దాటితే గ్రేడ్-2 తీవ్ర ప్రమాదం అధిక తీవ్ర ప్రమాదం నార(పీచు) ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకుంటే జీర్ణాశయం నుండి గ్లూకోస్ రక్తంలోకి నెమ్మదిగా పీల్చబడుతుంది. కాబట్టి చక్కెర పెరగకుండా నివారించొచ్చు. పైగా నారపదార్థాలు తొందరగా జీర్ణంకావు. కనుక ఆకలితొందరగా వేయదు. రక్తంలో కొవ్వుశాతం కూడా తగ్గుతుంది .నార ఎక్కువ ఉండేపదార్థాలు మినుములు, పెసలు, కందులు, శనగలు, అలసందలు, బఠాణీ, కూరగాయలు, గుమ్మడి, బీన్స్, కాకర, వంకాయ, పొట్లకాయ, కాలిఫ్లవర్, సోరకాయ, క్యాబేజి, మునగ, టొమాటో, దొండకాయ, బెండకాయ, అరటిపువ్వు,బీరకాయ,బొప్పాయి మొదలగునవి.రోజుకు కనీసం ఒక రకం పండు తీసుకోవటం మంచిది. సీజన్ బట్టి ఒక పండు రాత్రి నిద్రకు ముందు తీసుకోవాలి. రక్తంలో చక్కెర అదుపులోకి వచ్చిన తర్వాత సగం యాపిల్ పండు, కొన్ని పుచ్చకాయ ముక్కలు, జామకాయ, కమల, బొప్పాయి మితంగా తీసుకోవాలి.ఉప్పుతగ్గించివాడాలి. ఉప్పువల్ల రక్తపోటు పెరుగుతుంది. కాబట్టి గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. ఉప్పురోజుకి 5 గ్రాముల కంటేఎక్కువతీసుకోకూడదు. గ్లైసిమిక్ఇండెక్స్(GI) ను బట్టి ఆహార పధార్దాలు ఎంపిక చేసుకోవాలిమనం తీసుకున్న ఆహారం శరీరంలో గ్లూకోస్ రూపంలోకి మార్చబడుతుంది. ఆహారం గ్లూకోస్ గా మారటానికి పట్టే సమయాన్ని గ్లై సిమిక్ ఇండెక్స్ అంటారు. కొన్ని ఆహారపదార్థాలు త్వరగా మారుతాయి, వాటిని అధిక గ్లై సిమిక్ ఆహారపదార్థాలని; ఆలస్యంగా మారే వాటిని అల్ప గ్లై సిమిక్ ఆహారపదార్థాలని అంటారు.మధుమేహులు అల్పగ్లై సిమిక్ ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది. అవి నెమ్మదిగా జీర్ణమై రక్తంలో గ్లూకోస్ శాతాన్ని సమతుల్యం చేస్తాయి .అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ పదార్థాలైతే త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోస్ పరిమాణం ఒక్కసారిగా పెరిగి అసమతుల్యతకు దారి తీస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ పట్టిక అల్ప గ్లైసిమిక్ ఇండెక్స్ < 55 పప్పుధాన్యాలు, ముడిధాన్యాలు, కూరగాయలు , పండ్లు, బాసుమతి బియ్యం ఒక మోస్తరు గ్లైసిమిక్ ఇండెక్స్ < 56-69 ఐస్ క్రీమ్, గోధుమ, బ్రెడ్, బియ్యం, జ్యూస్ లు, అరటిపండు అధిక గ్లైసిమిక్ ఇండెక్స్ < 70>70 వైట్ బ్రెడ్ , బియ్యం , ఆలుగడ్డ ఆహార పదార్థాలు - గ్లై సిమిక్ ఇండెక్స్ ధాన్యాలు మొక్కజొన్నఅటుకులు 83 గోధుమ 68 బియ్యం 89 బాసుమతి బియ్యం 58 బార్లీ 25 చిరుధాన్యాలు 71 పండ్లు ఆపిల్ 38 అరటి పండు 56 ద్రాక్ష 46 కివి 52 మామిడి పండు 55 ఆరెంజ్ 43 బొప్పాయి 58 పైన్ ఆపిల్ 66 ఖర్జూరం 103 ఎండు ద్రాక్ష 64 పుచ్చ కాయ 72 పప్పులు కందిపప్పు 21 శెనగపప్పు 11 బఠానీ 25 అలసందలు 37 పాలు - పాల పదార్థాలు మీగడ పాలు 30 పెరుగు 14 కస్టర్డ్ 43 సోయాపాలు 31 ఐస్ క్రీమ్ 38 ఆధారం : డాక్టర్ ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు.కుమారి ఎన్.సునీత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/090.