1900 సంవత్సరం లో కారల్ ల్యాండ్ స్టీనర్ అను శాస్త్రవేత రక్త వర్గాలను కనుగొన్నాడు. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహిత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. రక్త వర్గాలు : ఎ (A) బి (B) ఎబి (AB) ఓ (O) ఓ గ్రూప్ వారిని విశ్వదాత అని, ఎ.బి. గ్రూప్ వారిని విశ్వగ్రహీత అని అంటారు. ఎవరు ఎవరికి రక్తం దానం చేయవచ్చు ఎబి గ్రూప్ వారు ఎబి గ్రూప్ కి దానం చేయాలి ఎ గ్రూప్ వారు ఎ, ఎబి గ్రూప్ కి బి గ్రూప్ వారు బి, ఎబి గ్రూప్ కి ఓ గ్రూప్ వారు ఎ, బి, ఎబి, ఓ గ్రూప్ ల వారందరికి దానం చేయవచ్చు. ఎవరు ఎవరి నుండి రక్తం తీసుకోవచ్చు ఎబి గ్రూప్ వారు అన్ని గ్రూప్ ల నుండి రక్తం తీసుకోవచ్చు బి గ్రూప్ వారు బి, ఓ గ్రూప్ ల నుండి ఎ గ్రూప్ వారు ఎ, ఓ గ్రూప్ లనుండి ఓ గ్రూప్ వారు ఓ, గ్రూప్ నుండి మాత్రమే రక్తం తీసుకోవచ్చు. 16 నుండి 60 సంవత్సరాలు గల వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నవారు రక్తాన్ని దానం చేయవచ్చు. ఒక వ్యక్తి 3-4 నెలలకు ఒక్కసారి రక్తాన్ని దానం చేయవచ్చు. రక్తాన్ని సేకరించిన తర్వాత 35-45 రోజులు నిల్వ చేస్తారు. రక్త పీడనం (బి.పి.) మానవ గుండెలో ధమనులు, సిరలు అనే రక్త నాళాలు ఉంటాయి. ఈ ధమనుల గోడలలో జరిగే మార్పు వలన రక్త పీడనం పెరుగుతుంది లేదా తగ్గుతుంది. బి.పి. ని స్పిగ్నో మానో మీటర్ తో కొలుస్తారు. సామాన్య రక్త పీడనం 120/80 ఎం.ఎం.హెచ్.జి. ఉంటుంది. 120 ను సిస్టాలిక్ రక్త పీడనం అని, 80 ని డయాస్టాలిక్ రక్తపీడనం అని అంటారు. సిరల కన్నా ధమనులలో రక్తపీడనం ఎక్కువగా ఉంటుంది. గుండె కొట్టుకోవటాన్ని స్టేతస్కోప్ తో పరీక్షిస్తారు, ఈ విధానాన్ని ఆస్కలేటేషణ్ అంటారు. రక్త పోటు వ్యాదిని నిశబ్ద హంతకి లేదా సైలెంట్ కిల్లర్ అంటారు. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు